హైదరాబాద్

బహదూర్‌పురాలో దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 28: ఇద్దరి మధ్య జరిగిన గొడవ పాతకక్షల కారణంగా గుత్తేదారు దారుణ హత్యకు గురైన సంఘటన పాతబస్తీ బహదూర్‌పురా పోలీస్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. ఇన్స్‌పెక్టర్ హరీష్‌కౌశిక్ కథనం ప్రకారం..బహదూర్‌పురా రామ్‌నాస్‌పురాలో నివాసం ఉంటున్న మహ్మద్ మన్సూర్(40) కొంత కాలం నుండి రాజా ఫంక్షన్‌హాలును లీజ్‌కింద నడుపుతున్నాడు. రాంనాస్‌పురా జూపార్క్ ప్రాంతంలో బైక్ సర్వీస్ సెంటర్‌ను ఖాలేద్ నిర్వహిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం రామ్‌నాస్‌పురాలో మహ్మద్ మాన్సుర్, ఖాలేద్‌ల మధ్య తాగిన మైకంలో గోడవ జరిగింది. దీంతో మన్సూర్‌ను ఎలాగైన హతమర్చాలని ఖాలేద్ పథకం పన్నాడు. శనివారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో గుత్తేదారు మన్సూర్ బైక్‌పై రామనాస్‌పురా నుండి జూపార్క్‌వైపు వెళుతుండగా ఆదే ప్రాంతంలో ఉన్న ఖాలేద్ బైక్‌వాటర్ వాషింగ్ సెంటర్ నుండి ఖాలేద్‌తో పాటు అతనికి సంబంధించిన మరో ముగ్గురు అనుచరులతో కలిసి కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయాలపాలైన మన్సూర్ అక్కడిక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఘటన స్థలికి చేరుకుని మృతదేహన్ని పరీక్షల నిమిత్తం ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ కేసును చార్మినార్ ఏసిపి అశోక్‌చక్రవర్తి ఆధ్వర్యంలో ఇన్స్‌పెక్టర్ హరీష్‌కౌశిక్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
అక్రమ నిర్మాణాల కూల్చివేత
ఉప్పల్, జనవరి 28: పటాన్‌చెరువు పరిధిలోని పాటి గ్రామంలో సర్వే నెంబర్ 236లో అక్రమ నిర్మాణాలను హెచ్‌ఎండిఏ అధికారులు శనివారం కూల్చివేశారు. అనుమతి లేని లేఅవుట్‌లో అనుమతి తీసుకోకుండా చేపట్టిన గోడౌన్ నిర్మాణాలను పోలీసు బందోబస్తు మధ్య నేలమట్టం చేశారు. కార్యక్రమంలో ప్లానింగ్ అధికారి రమేశ్ బాబు, డిఎస్‌పి శ్రీనివాస్‌రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.
నాలుగు బాల్య వివాహాలను ఆపిన చైల్డ్‌లైన్
వికారాబాద్, జనవరి 28: వికారాబాద్ మండలం జాంబాపూర్ తండాలో చైల్డ్‌లైన్ 1098 నాలుగు బాల్య వివాహాలను ఆపింది. వివరాలలోకి వెళితే తండాలోని ముడావత్ మోహన్ కూతురు(15) పదోతరగతి, ముడావత్ బాబు కూతురు(15) పదోతరగతి, పదోతరగతితో చదువు మానేసిన రెట్య బాల్‌సింగ్ కూతురు(16), వడ్త్య పాండు కూతురు(13) ఎనిమిదో తరగతి వికారాబాద్ పట్టణంలోని హాస్టల్‌లో ఉండి చువుతున్నారు. వీరందరికీ నిశ్చితార్థం జరిగింది. వచ్చే నెలలో వివాహాలు చేయాలని నిర్ణయించుకోగా చైల్డ్‌లైన్ 1098కు సమాచారం రావడంతో ఎస్‌ఐ సురేష్, విఆర్‌వో ఎల్లయ్య, చైల్డ్‌లైన్ సభ్యుడు బి.శ్రీనివాస్ శనివారం కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈసందర్భంగా ఎస్‌ఐ సురేష్ మాట్లాడుతూ బాల్య వివాహాలు చేస్తే చట్టప్రకారం రెండు సంవత్సరాలు జైలుకు పంపుతామని హెచ్చరించారు.
అనంతరం తల్లిదండ్రులు బాల్యవివాహాలు చేయబోమని హామీఇచ్చారు. ఒకే గ్రామంలో నాలుగు బాల్య వివాహాలు జరగడం క్షమించరానిదని, అంగన్‌వాడీ, గ్రామసేవకులు వెంటనే సమాచారం అందించాలని సూచించారు.