హైదరాబాద్

1నుంచి మురికివాడల్లో ప్రతిరోజు నీటి సరఫరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 28: వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రారంభించిన జల్‌యాప్, ప్రతిరోజు నీటి సరఫరా, రెవెన్యూ రాబడి వంటి పలు అంశాలపై జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిషోర్ సమీక్ష నిర్వహించారు. ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో శనివారం ఉదయం జలమండలి మెయింటనెన్స్ ఆపరేషన్స్ విభాగానికి సంబంధించిన అన్ని డివిజన్‌ల అధికారులతో ఎండి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని 173 మురికివాడల ప్రాంతాల్లోని దాదాపు 50వేల నీటి కనెక్షన్లకు ఫిబ్రవరి 1నుంచి ప్రతిరోజు నీటి సరఫరా చేయనున్నట్లు తెలిపారు. నగరంలో నీటిపొదుపుపై అవగాహన కార్యక్రమాలు చేపట్టేందుకు వివిధ సంస్థలతో సమావేశం నిర్వహించి వినియోగదారులను చైతన్యవంతులను చేయాలని వివిధ డివిజన్‌లకు సంబంధించిన జనరల్ మేనేజర్‌లను ఎండి ఆదేశించారు. ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడుకోవాలని, విలువైన నీటిని ఎలావినియోగించుకోవాలో అవగాహన కల్పించేలా పెద్దఎత్తున నగర వ్యాప్తంగా వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఫిబ్రవరి 1నుంచి 50వేల కనెక్షన్లకు ప్రతిరోజు మంచినీరు సరఫరా చేసిన వారం రోజుల తరువాత అదనంగా లక్ష కనెక్షన్లకు ప్రతిరోజు నీటి సరఫరాను చేస్తామన్నారు. నీటి సరఫరాలో నీటి లీకేజీలను అరికట్టి, కలుషిత నీటి సరఫరా జరుగకుండా చూడాలన్నారు. సిల్ట్ ఛాంబర్స్‌పై సమీక్ష నిర్వహించిన ఎండి మురుగునీటి పైప్‌లైన్‌లు నిండకుండా నిరోధించడానికి ప్రతి గృహదారుడు తప్పకుండా సిల్ట్ ఛాంబర్స్‌ను నిర్మించుకునేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రధానంగా హోటళ్లు, హాస్టళ్లు, మెస్‌లు, ఆసుపత్రులు, ఫంక్షన్‌హాల్స్, డైరీఫామ్‌లు ఉన్న ప్రాంతాల్లో సిల్ట్ ఛాంబర్లు నిర్మించుకోవాలని ఆయన స్పష్టం చేశారు. జలమండలి రాబడిపై దృష్టి సారించాలని, మొండి బకాయిదారుల పట్ల కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఎండి ఆదేశించారు.
నీటి బిల్లులు చెల్లించని మొండి బకాయిదారుల పరిసరాల్లో రెడ్ నోటీసులు అంటించాలని, అప్పటికీ వినియోగదారుడు స్పందించకపోతే నల్లా, సివరేజీ కనెక్షన్లను తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో జలమండలి ఆపరేషన్స్ విభాగం డైరెక్టర్ జి.రామేశ్వరరావు, పిఅండ్‌ఎ విభాగం డైరెక్టర్ ఆజ్మీరా కృష్ణతో పాటు సిజిఎం, జిఎం, డిజిఎం తదితరులు పాల్గొన్నారు.
బాపూఘాట్‌ను సందర్శించిన రాహుల్ బొజ్జా

నార్సింగి, జనవరి 28: జాతిపిత వర్థంతిని పురస్కరించుకుని బాపూఘాట్‌ను సర్వంగ సుందరంగా ముస్తాబు చేయాలని ఆయా శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా ఆదేశాలు ఇచ్చారు. శనివారం లంగర్‌హౌస్ బాపూఘాట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ జాతిపిత మహాత్మగాంధీ వర్థంతిని పురస్కరించుకుని ఈనెల 30న ఉదయం పదకొండు గంటలకు రాష్ట్ర గవర్నరు, రాష్ట్ర ముఖ్యమంత్రి, గాంధేయవాదులు బాపూజీ సమాధికి నివాళులు అర్పించేందుకు విచ్చేస్తున్నారని పేర్కొన్నారు. అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా ముఖ్యంగా ప్రముఖులందరూ విచ్చేస్తున్నందున ఏర్పాట్లలో ఎటువంటి లోటుపాట్లు ఉండకూడదన్నారు. బాపూఘాట్‌లో ఏర్పాటు చేసే భారీ బందోబస్తు గురించి ఇన్‌స్పెక్టర్ మహ్మద్ జావేద్‌ను అడిగి తెలుసుకున్నారు. బాపూఘాట్‌ను సర్వంగా సుందరంగా ముస్తాబు చేస్తున్నందున టూరిజం శాఖ ఏజిఎం జనార్ధన్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా ఓ అంబులెన్స్‌ను, డాక్టర్లను కూడా ఏర్పాటు చేసుకోవాలని వైద్యశాఖ అధికారిని డాక్టర్ పద్మజను ఆదేశించారు. ప్రముఖులతో పాటు విద్యార్థులు కూడా బాపూఘాట్‌కుజాతిపిత వర్ధంతి కోసం విచ్చేస్తున్నందున వారు తాగేందుకు మంచినీటి సదుపాయాలను కూడా ఏర్పాటు చేయాలని జలమండలి సెక్షన్ మేనేజర్ సాజిద్‌కు ఆదేశాలు జారి చేశారు. ఈ పర్యటనలో హైదరాబాద్ ఆర్డీఓ శ్రీ వత్సకోట, గోల్కొండ తహశీల్దార్ చంద్రకళ, డిఎంహెచ్‌ఓ డాక్టర్ పద్మజ, జిహెచ్‌ఎంసి సర్కిల్-7ఏ డిప్యూటీ కమిషనర్ వేణుగోపాల్, ఎఎంహెచ్‌ఓ ఏజాజ్ కాశీమ్, డిఇఓ జి.రమేష్, టూరిజం ఏజిఎమ్ ఐ.జనార్ధన్, టూరిజం శాఖ అధికారులు శ్రీ్ధర్‌రెడ్డి, రాజశేఖర్, ఆర్‌అండ్‌బి ఏఇ అంబేద్కర్, విద్యుత్ శాఖ ఏఇ తిరుపతిరావు, జలమండలి అధికారి సాజిద్ తదితరులు పాల్గొన్నారు.