హైదరాబాద్

చేస్తే సన్మానం చేయకుంటే జరిమానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 30: విడిపోయిన కుటుంబాలను తిరిగి కలిపి అందరి దృష్టిని ఆకట్టుకున్న బల్దియా ఇపుడు చెత్తలోని తడి,పొడి చెత్తల విడాకుల మాసంగా ఫిబ్రవరి నెలను పాటించేందుకు సిద్ధమవుతోంది. వినటానికి ఈ మాట కాస్త విచిత్రంగానే అన్పిస్తున్నా, తడి,పొడి చెత్తను వేరు చేసే అంశంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు, ప్రతి చోట చర్చ జరిగేందుకు వీలుగా బల్దియా ఈ మాస్ రూట్‌ను అనుసరించేందుకు సిద్దమైంది. అంతేగాక, ప్రతి ఇళ్లు, వ్యాపార సంస్థల నుంచి కూడా తడి,పొడి చెత్త వేర్వేరుగా వచ్చేందుకు వీలుగా నిబంధనలను కొంత కఠినం చేసింది. చెత్తను వేరు చేసే వారిని గుర్తించి సన్మానించటం, ఇప్పటికే పలు సార్లు సూచించినా వేరు చేయని సంస్థలు, వ్యక్తుల నుంచి జరిమానాలు వసూలు చేసేందుకు జిహెచ్‌ఎంసి సిద్దమవుతోంది. ఇందుకు గాను సోమవారం కమిషనర్ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ప్రజల్లో చైతన్యం పెంపొందించేందుకు తడి,పొడి చెత్తను వేర్వేరు చేసే అంశంపై ఫిబ్రవరి నెల మొత్తం ప్రతి సర్కిల్‌లో ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టాలని కమిషనర్ జనార్దన్ రెడ్డి అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. చెత్త విడాకుల మాసంలో భాగంగా ప్రతి సర్కిల్‌లో నూటికి నూరు శాతం తడి,పొడి చెత్తను వేర్వేరు సేకరించాలని సూచించారు. వేర్వేరు చేయని ఇళ్లను గుర్తించి, ఆ ఇళ్లకు వెళ్లి చెత్తను తమకు వేర్వేరు చేసి ఇవ్వాలని సిబ్బంది చైతన్య కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ప్రతి జోన్‌లోని అన్ని ప్రాంతాల్లో జోనల్, డిప్యూటీ కమిషనర్లు విధిగా ఈ కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. నగరంలోని అన్ని ట్రాన్స్‌ఫర్ స్టేషన్లకు తడి,పొడి చెత్త వేర్వేరుగా, వాటిపై కవర్ కప్పి తీసుకెళ్లాలన్న విషయంపై వంద శాతం లక్ష్యాన్ని సాధించాలని కమిషనర్ మెడికల్ ఆఫీసర్లకు సూచించారు. ఇందుకు గాను ప్రతి స్వచ్ఛ ఆటోడ్రైవర్లకు స్పాన్సర్ల ద్వారా ప్రత్యేక యూనిఫాం దుస్తులను అందజేయాలని సూచించారు. రాజేంద్రనగర్ సర్కిల్‌లో అందరూ స్వచ్ఛ ఆటో డ్రైవర్లకు ప్రత్యేక దస్తులను ఓ ప్రైవేటు సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అందజేసిన విషయాన్ని కమిషనర్ గుర్తుచేశారు.
ట్రాన్స్‌ఫర్ స్టేషన్లు పెంచే దిశగా...
ఇళ్ల నుంచి ఆటో టిప్పర్లు సేకరించిన చెత్తను అవి శివారులోని డంపింగ్ యార్డు వరకు తీసుకెళ్లకపోవటంతో నగరంలోనే ఒక చోట నిల్వ ఉంచి, అక్కడి నుంచి భారీ వాహనాలు, టిప్పర్లలో డంపింగ్ యార్డుకు పంపే ట్రాన్స్‌ఫర్ స్టేషన్లను పెంచేందుకు గ్రేటర్ ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రస్తుతం ఇరవై వరకున్న ఈ స్టేషన్లను మున్ముందు సర్కిల్‌కు ఒకటి చొప్పున మొత్తం 30కి పెంచేందుకు అధికారులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
ఏ స్టేషన్‌లో ‘వేర్వేరు’ ఎంత శాతం
నగరంలోని మొత్తం 20 ట్రాన్స్‌ఫర్ స్టేషన్లలో తొమ్మిదింటిలో వందకు వంద శాతం చెత్తను తడి,పొడిగా వేరు చేస్తున్నారు. మిగిలిన మరో పదకొండు స్టేషన్లలో కూడా నిల్వ చేస్తున్న చెత్తలో దాదాపు 75 శాతం చెత్తను ఆటో టిప్పర్లు వేర్వేరు చేసి పంపుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో సర్కిల్ 6లోని రాజేంద్రనగర్‌లో, సర్కిల్ 2లోని దేవేందర్‌నగర్, సర్కిల్ 1లోని మల్లాపూర్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్, సర్కిల్ 17లోని దీప్తినగర్, నేరెడ్‌మెట్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్, సర్కిల్ 16లోని మచ్చబొల్లారం, సర్కిల్ 1లోని సాకేత్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్, సర్కిల్ 15లోని హెచ్‌ఎంటి పైప్‌లైన్ రోడ్డు ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌లకు చేరుతున్న చెత్త వంద శాతం తడి,పొడిగా చేరుతున్నట్లు అధికారులు తెలిపారు.

1నుంచి 173 మురికివాడల్లో..
50వేల కనెక్షన్లకు రోజు నీటి సరఫరా
వారంరోజుల తరువాత
లక్ష కనెక్షన్లకు అమలు
మంచినీటి పొదుపుపై
అవగాహన కార్యక్రమాలు
జలమండలి ఎండి
దానకిషోర్ వెల్లడి

హైదరాబాద్, జనవరి 30: హైదనరాబాద్ నగరంలోని 173 మురికివాడల ప్రాంతాల్లోని దాదాపు 50వేల నీటి కనెక్షన్లకు ఫిబ్రవరి 1నుంచి ప్రతి రోజు నీటి సరఫరా చేయనున్నట్లు జలమండలి ఎండి ఎం.దానకిషోర్ తెలిపారు. వారం రోజుల తరువాత లక్ష కనెక్షన్లకు రోజు నీటి సరఫరాను అంధించేందుకు కృషి చేస్తున్నట్లు ఎండి వివరించారు. వచ్చేనెల 1నుంచి రోజు నీటి సరఫరా జరుగుతుందని, ఇది కేవలం ఉదయం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు, లేదా సాయంత్రం ఆరు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరలకు సరఫరా చేసేందుకు అన్ని ఎర్పాట్లు చేయడం జరిగిందని ఎండి స్పష్టం చేశారు. ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో సోమవారంనాడు నగరంలో నీటి పొదుపుపై అగాహాన కార్యక్రమాలు చేపట్టేందుకు వివిధ సంస్థలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎండి దానకిషోర్ మాట్లాడుతూ వచ్చేనెల ప్రారంభం నుండి నగరంలోని మురికివాడల ప్రాంతాల్లో ప్రతిరోజు నీటి సరఫరాను పునరుద్ధరిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరు నీటిని పొదుపుగా వాడుకోవలని, విలువైన నీటిని ఎలా వినియోగించుకోవాలో అవగాహాన కల్పించేలా పెద్ద ఎత్తున నగర వ్యాప్తంగా అవగాహాన కార్యక్రమాలు నిర్వహించాలని సమావేశంలో పాల్గొన్న వివిధ స్వచ్చంద సంస్థల ప్రతినిధులను ఎండి కోరారు. కార్యక్రమంలో జలమండలి ఆపరేషన్స్ విభాగం డైరెక్టర్ జి.రామేశ్వరరావుతో పాటు స్వచ్చంద సంస్థ ప్రతినిధి స్నేహలత పాల్గొన్నారు.