హైదరాబాద్

ప్రారంభమైన నాలా పూడికతీత పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 31: ఇదివరకు కురిసిన అతి భారీ వర్షాలతో గుణపాఠాలు నేర్చుకున్న జిహెచ్‌ఎంసి అధికారులు రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని కాస్త ముందుచూపుతో వ్యవహారిస్తున్నారు. నగరాన్ని వరద ముప్పు నుంచి రక్షించేందుకు గాను నగరంలోని నాలాల్లోని పూడిక తీత పనులను ఇక నిరంతరంగా చేపట్టేందుకు బల్దియా సిద్దమైంది. ప్రతి ఏటా కోట్లాది రూపాయలను వెచ్చిస్తున్నా, నాలాల్లోని పూడిక పూర్తి స్థాయిలో తొలగకపోవటంతో నిరంతరంగా చేపట్టనున్న పనులను మంగళవారం మేయర్ బొంతు రామ్మోహన్ మీర్‌పేట నాలా పూడికతీత పనులను ప్రారంభించారు. ఇప్పటి వరకు కేవలం ఎండాకాలంలో మాత్రమే పూడికతీత పనులను చేపట్టిన బల్దియా ఇపుడు సంవత్సరం పొడువున ఎప్పటికపుడు పనులు చేపడితే వర్షాకాలంలో వరద నీరు ఆటంకాల్లేకుండా ప్రవహిస్తోందని భావిస్తోంది. నగరంలో వెయ్యి కిలోమీటర్ల విస్తీర్ణంలో మురికి కాలువలు, వర్షపునీటి కాలువలున్నాయి. ఈ నాలాల్ల 216 కిలోమీటర్ల విస్తీర్ణంలో భారీ నాలాలుండగా, 735 కిలోమీటర్ల విస్తీర్ణంలో పైప్‌లైన్ డ్రెయిన్లు, చిన్న తరహా నాలాలున్నాయి. ఈ నాలాలన్నింటి నుంచి మే నెలాఖరు వరకు పూడికతీత పనులు పూర్తి చేయాలని భావిస్తున్నారు. గతంలో ఎండాకాలంలో పూడికతీత పనులను చేపట్టేందుకు అధికారులు యత్నించినా, టెండర్ల ప్రక్రియలో జాప్యం జరగటంతో పనులు ఆలస్యంగా ప్రారంభమయ్యేవి. వర్షాలు సైతం కాస్త ముందుగానే దంచికొట్టడటంతో నాలాలు పొంగి ప్రవహిస్తూ పరిసర ప్రాంతాలను నీట ముంచేసిన సంఘటనలున్నాయి. ఇందుకు గత సెప్టెంబర్ మాసంలో కురిసిన అతి భారీ వర్షాలను ఇందుకు నిదర్శనం.
తీసిన పూడికను తొలగించే బాధ్యత కాంట్రాక్టర్లదే
పూడికను తీసి పక్కనే వేయటంతో తిరిగి వర్షాలకు ఆ పూడిక మళ్లీ నాలాల్లోకి చేరటంతో జిహెచ్‌ఎంసి ఇంజనీరింగ్ విభాగం పనితీరుపై అనేక రకాల విమర్శలు, అనుమానాలున్నాయి. ఆ తర్వాత పడే చెత్తాచెదారం, పూడికను ఎప్పటికపుడు తొలగించాలని కూడా భావిస్తోంది. ఈ ఏటా పూడికతీత పనులకు రూ. 30.18 కోట్లను కేటాయించారు. ఇందుకు గాను టెండర్ల ప్రక్రియను కూడా చేపట్టారు. 216 కిలోమీటర్ల పొడువు గల భారీ నాలాల్లో ఉన్న 4లక్షల 49వేల 111 క్యూబిక్ మీటర్ల పరిమాణంలో ఉన్న పూడికను, అదే విధంగా 735 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న మైనర్ డ్రెయిన్ల నుంచి 3లక్షల 33వేల 780 క్యూబిక్ మీటర్ల పరిమాణంలో పూడిక తీయనున్నారు. ముఖ్యంగా నాలాల్లోని బయటకు తీసిన పూడిక, వ్యర్థాలను కూడా పక్కనే వేయకుండా అక్కడి నుంచి కాంట్రాక్టర్లే తొలగించాలన్న నిబంధన విధించారు. పూడికలో ఉన్న మట్టిని సమీపంలోని డంపింగ్ యార్డుకు తరలించి, క్వారీలు, గుంతల్లో కూడా వేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

స్పెషల్ పోలీస్ ఆఫీసర్లుగా రిటైర్డ్ అధికారులు
సైబరాబాద్‌లో ముగ్గురు అధికారుల పదవీ విరమణ
డిసిపి జాయింట్ సిపి స్టీఫెన్ రవీంద్ర

హైదరాబాద్, జనవరి 31: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ముగ్గురు పోలీస్ అధికారులు మంగళవారం పదవీ విరమణ చేశారు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ట్రాఫిక్ విభాగం సబ్-ఇన్స్‌పెక్టర్ కె శ్రీనివాస్, రాయదుర్గం పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ బి రంగయ్య, సెంట్రల్ క్రైం స్టేషన్ ఎఎస్‌ఐ మహమ్మద్ ఖాజా రిటైర్డ్ అయిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య వీరిని శాలువ కప్పి సత్కరించారు. క్రెడిడ్ సొసైటీ, బెనిఫిట్ నిధులు ఒక్కొక్కరికి రూ. 20వేలు నగదుతోపాటు పింఛన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా రిటైర్డైన పోలీస్ అధికారుల కుటుంబ సభ్యులను అప్యాయతో పలకరించి క్షేమయోగాలు అడిగి తెలుసుకున్నారు.
అదనపు సిపి స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ, రిటైర్డ్ అయిన పోలీస్ అధికారులు స్పెషల్ పోలీస్ ఆఫీసర్లుగా పనిచేసే అవకాశాలున్నాయని తెలిపారు. రిటైర్డ్ అయిన అధికారులు శేషకాల జీవితాన్ని కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో గడపాలని కాంక్షించారు. విధినిర్వహణలో మంచి పేరు తెచ్చుకొని రిటైర్డ్ అయిన అధికారులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు పోలీస్ కమిషనర్ సిహెచ్ భద్రారెడ్డి, పోలీస్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జి కృష్ణారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.