హైదరాబాద్

రోడ్లపైకి వ్యర్థాలు వదిలితే జరిమానా చెల్లించాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, కుషాయగూడ, జనవరి 31: నగరంలోని వ్యాపార సంస్థలు, హోటళ్లు ఏ మాత్రం నిర్లక్ష్యం చేసి రోడ్డుపైకి వ్యర్థాలను వదిలినా తగిన మూల్యం చెల్లించాల్సిందే! స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే నేపథ్యంలో ఇప్పటికే రోడ్లపై, నాలాల్లో చెత్తను వేసే వ్యక్తులు, వ్యాపార సంస్థలకు జరిమానాలు విధిస్తున్న జిహెచ్‌ఎంసి ఈ నిబంధనను మరింత కట్టుదిట్టంగా అమలు చేసేందుకు సిద్దమైంది. ఈ మేరకు ఏఎస్‌రావునగర్‌లోని స్వాగత్ గ్రాండ్ హోటల్ యాజమాన్యం మంగళవారం నిర్లక్ష్యంగా రోడ్డుపైకి వ్యర్థాలను వదలటాన్ని గుర్తించిన జిహెచ్‌ఎణసి అధికారులు ఆ హోటల్ నుంచి రూ. లక్షన్నర జరిమానా వసూలు చేశారు. ఏడాది పొడువున నిరంతరంగా చేపట్టనున్న నాలాల పూడికతీత పనులను ప్రారంభించేందుకు ఆయా ప్రాంతాల్లో పర్యటించిన మేయర్ బొంతు రామ్మోహన్ ఏఎస్‌రావునగర్‌లో హోటల్ వ్యర్థాలను రోడ్లపైకి వదలటాన్ని గమనించారు. ఈ రకంగా రోడ్లపై వ్యర్థాలను వదిలితే రోడ్లు ధ్వంసమవుతాయని, ప్రస్తుతం స్వాగత్‌గ్రాండ్ హోటల్ వదిలిన వ్యర్థాలతో ధ్వంసమైన రోడ్డుకు మరమ్మతులు చేసేందుకు రూ. లక్షన్నర వరకు ఖర్చవుతుదంటూ ఇంజనీర్లు మేయర్‌కు తెలపటంతో, ఆ మొత్తం ఖర్చును హోటల్ యాజమాన్యం నుంచే వసూలు చేయాలని ఆదేశించటంతో అధికారులు జరిమానా విధిస్తూ నోటీసులు జారీ చేశారు. ఈ రకంగా రోడ్లపైకి వ్యర్థాలను వదిలితే, రోడ్లు ధ్వంసం కావటంతో పాటు పరిసర ప్రాంతాల్లో దుర్గంధం చోటుచేసుకోవటంతో పాటు వాహనదారులు ప్రమాదాలకు కూడా గురవుతున్నారని అధికారులు పేర్కొన్నారు. ఈ రకంగా ఒకటిరెండుసార్లు జరిమానాలు విధించిన తర్వాత యాజమాన్యం తీరులో మార్పు రాని పక్షంలో అవసరమైతే ట్రేడ్ లైసెన్సును కూడా రద్దు చేసే విషయాన్ని పరిశీలించాలని మేయర్ అధికారులను ఆదేశించారు. దీంతో పాటు లక్షఈమపురం కాలనీలో మారుతి బిల్డర్స్ నిర్మిస్తున్న నిర్మాణం సందర్భంగా వచ్చిన భవన నిర్మాణ వ్యర్థాలను రోడ్లపై వేసేందుకు గాను బిల్డర్స్‌కు రూ. 10వేలు జరిమానా విధిస్తున్నట్లు మెడికల్ ఆఫీసర్ నోటీసులు జారీ చేశారు. అలాగే పాదచారుల కోసం ఏర్పాటు చేసిన ఫుట్‌పాత్‌పై టెంట్ హౌజ్ సామానును ఉంచిన మహాలక్ష్మి టెంట్ హౌజ్ యాజమాన్యానికి కూడా వెయ్యి రూపాయల జరిమానా విధించి అక్కడికక్కడే వసూలు చేశారు. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి మూడురోజుల పాటు స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే జరగనున్నందున ఇలాంటి నిర్ణయాలను మరింత కఠినంగా అమలు చేయాలని జిహెచ్‌ఎంసి భావిస్తోంది.
కొనసాగుతున్న నర్సుల సమ్మె
సికింద్రాబాద్, జనవరి 31: సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో న్యాయమైన డిమాండ్‌ను పరిష్కరించాలని కాంట్రాక్టు నర్సులు చేపట్టిన సమ్మె ఎనిమిదో రోజుకు చేరింది. ప్రభుత్వం తక్షణమే స్పందించి క్రమబద్ధీకరించాలని, లేనిచో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.