హైదరాబాద్

ట్యాంక్‌బండ్ నుంచి మదీనా వరకు ట్రామ్ వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 31: మహానగరంలో రోజురోజుకీ పెరుగుతున్న ట్రాఫిక్, రద్దీకి అనుకూలంగా ప్రజల ట్రాఫిక్ కష్టాలను దూరం చేసేందుకు ప్రభుత్వం అందుబాటులో ఉన్న అని అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు సిద్ధమైంది. నగరవాసుల ట్రాఫిక్ కష్టాలకు శాశ్వతంగా చెక్ పెట్టడంతో పాటు తక్కువ ఛార్జీలు, సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించేందుకు వీలుగా ప్రతిపాదించిన మెట్రోరైలు పనులను వేగవంతం చేసిన సర్కారు మరిన్ని ఆధునిక రవాణా వ్యవస్థలను అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. ఇటీవల నగరానికి విచ్చేసిన ఫ్రెంచ్ బృందంతో పాతబస్తీలో దశల వారీగా ట్రామ్‌వేను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే! ఇందులో భాగంగా న్యూ సిటీలోని ట్యాంక్‌బండ్ నుంచి ఓల్డ్‌సిటీలోని మదీనా వరకు సుమారు పదిన్నర కిలోమీటర్ల పొడువున ట్రామ్‌వేను అందుబాటులోకి తెచ్చే దిశగా కసరత్తు కొనసాగుతోంది. ముఖ్యంగా ట్యాంక్‌బండ్ నుంచి మదీనా వరకున్న హెరిటెజ్ భవనాలను తిలకించేందుకు వీలుగా ఈ ట్రామ్ వేను డిజైనింగ్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం కోల్‌కత్తలో ఇప్పటికే ట్రామ్‌వే అందుబాటులో ఉన్నా, దేశంలో మొట్టమొదటి సారిగా ఆధునిక హంగులు, సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ట్రామ్ వేను ఏర్పాటు చేయాలని జిహెచ్‌ఎంసి యోచిస్తోంది. అయితే ఒక కిలోమీటరు మేరకు ఏర్పాటు చేసేందుకు సుమారు రూ. 10 కోట్ల వరకు ఖర్చవుతున్నట్లు ప్రాథమికంగా అంచనా వేసిన జిహెచ్‌ఎంసి నగరంలో పాతబస్తీ ట్రామ్ వే మినహా మరో రెండు విడతలుగా 24 కిలోమీటర్ల పొడువున కేవలం హెరిటెజ్ భవనాలను తిలకించేందుకు వీలుగా అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. ఇందులో మొదటి దశగా ట్యాంక్‌బండ్, నాంపల్లి, ఎం.జె.మార్కెట్, బేగంబజార్‌ల మీదుగా మదీనా వరకు ఏర్పాటు చేసే దిశగా కసరత్తు జరుగుతోంది. మదీనా కన్నా కొంత ముందు వరకు ఈ ట్రామ్‌వేను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉన్నా, అందుకు కేంద్ర పురావస్తు శాఖ ఇప్పటికే అమలు చేస్తున్న ఆంక్షలు అడ్డురావటంతో ఈ ప్రాజెక్టును పత్తర్‌గట్టి వద్దనున్న ఫౌంటేన్ వరకు పరిమితం చేయాలని జిహెచ్‌ఎంసి భావిస్తోంది. రోడ్డుకిరువైపులా కన్పించే హెరిటెజ్ భవనాలను ప్రయాణికులు వీక్షించేందుకు వీలుగా దీని వేగాన్ని గంటకు సుమారు ఇరవై కిలోమీటర్లకు పరిమితం చేయాలన్న యోచన కూడా ఉంది. ఈ ప్రాజెక్టును ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేసి అన్యూసిటీ పద్దతిన ఏటా ప్రాజెక్టు ఖర్చును చెల్లించాలని భావిస్తున్నారు.

హైటెక్ అటెండెన్స్
బల్దియాలో
బయోమెట్రిక్ విధానం
22వేల 500 మంది
కార్మికులకు వర్తింపు
తొలి సారిగా అమలు చేసిన జిహెచ్‌ఎంసి
నేటి నుంచి తప్పక
పాటించాలని ఆదేశం
లాంఛనంగా ప్రారంభించిన మంత్రి కెటిఆర్

హైదరాబాద్, జనవరి 31: జిహెచ్‌ఎంసి జంటనగరవాసులకు అందిస్తున్న అతి ముఖ్యమైన పారిశుద్ధ్యం. ఈ విభాగంలో తరుచూ అక్రమాలు చోటుచేసుకుంటాన్నాయంటూ ఆరోపణలు వెల్లువెత్తటంతో వాటికి స్వస్తి పలికేందుకు అధికారులు బయోమెట్రిక్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ విధానాన్ని రాష్ట్ర మున్సిపల్ మంత్రి కె. తారకరామారావు మేయర్ బొంతు రామ్మోహన్‌తో కలిసి మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. దేశంలో మొట్టమొదటి సారిగా జిహెచ్‌ఎంసి పారిశుద్ద్య విభాగంలోని దాదాపు 22వేల 500 మంది కార్మికులకు బయోమెట్రిక్ అటెండెన్స్‌ను అమలు చేస్తూ జిహెచ్‌ఎంసి అగ్రస్థానానికి చేరుకుంది.
అంతేగాక, దేశంలో ఏ కార్పొరేషన్ చెల్లించని స్థాయిలో పారిశుద్దయ విభాగం కార్మికులకు జిహెచ్‌ఎంసి జీతాలను చెల్లిస్తోంది. బుధవారం నుంచి పారిశుద్ద్య విభాగంలో పనిచేసే ప్రతి కార్మికుడు ఈ బయోమెట్రిక్ విధానాన్ని పాటించాలని కమిషనర్ జనార్దన్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేశారు. గతంలో పలు స్వీపింగ్ యూనిట్లలో కార్మికులు లేకున్నా, బినానీ పేర్లతో జీతాలు డ్రా అవుతున్న తతంగాన్ని పసిగట్టిన అప్పటి కమిషనర్ సోమేశ్‌కుమార్ ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా సర్కిల్ 9లో ప్రవేశపెట్టగా అధికారులు ఆశ్చర్యపోయేలా అక్రమాలు బయటపడ్డాయి. అప్పటి మొదలుపెట్టిన కసరత్తు ఎట్టకేలకు ఫలించి ఇపుడు పూర్తి స్థాయిలో బయోమెట్రిక్ యంత్రాలను అందుబాటులోకి తెచ్చిన జిహెచ్‌ఎంసి బుధవారం నుంచి కట్టుదిట్టంగా అమలు చేయాలని భావిస్తోంది.
అందుబాటులో 1200 మిషన్లు
ముఖ్యంగా డ్యూటీ ఎక్కినప్పటి నుంచి ముగిసే వరకు కూడా క్షేత్ర స్థాయిలో రోడ్లపై పనిచేసే కార్మికుల వద్దకే వచ్చి సూపర్‌వైజర్ అటెండెన్స్ తీసుకునేందుకు వీలుగా జిహెచ్‌ఎంసి మొత్తం 1200 బయోమెట్రిక్ యంత్రాలను జిహెచ్‌ఎంసి అద్దె ప్రాతిపదికన సమకూర్చుకుంది. తెలంగాణ రాష్ట్ర టెక్నాలజి సర్వీసెస్ ద్వారా అనలాజిక్ టెక్నాలజీ అనే సంస్థ ఒక్కో యంత్రానికి నెలకు రూ. 1175 చెల్లించేందుకు వీలుగా కాంట్రాక్టు కుదుర్చుకుంది. ఈ మిషన్‌కు శానిటరీ ఫీల్డు అసిస్టెంటును జియో ట్యాగింగ్‌తో అనుసంధానం చేయటంతో వారి పరిధిలోనే ఈ యంత్రం పనిచేస్తోంది. దీనికి తోడు కార్మికుడి ఆధార్ కార్డు వివరాలను ఈ యంత్రంలో పొందుపర్చారు. దీంతో కార్మికుల సంఖ్య, అటెండెన్స్, క్షేత్ర స్థాయిలో సూపర్‌వైజర్లు కార్మికుల పనితీరులో పారదర్శకత చోటుచేసుకుంటుందని అధికారులు భావిస్తున్నారు.
అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందా?
జిహెచ్‌ఎంసి స్వీపింగ్ యూనిట్లకు సంబంధించి కార్మికుల సంఖ్య ఎక్కువగా చూపించటం, క్షేత్ర స్థాయిలో తక్కువ మంది పనిచేయటం, ఒకే కుటుంబానికి చెందిన వారు కార్మికులుగా కొనసాగటం వంటి అక్రమాలు జరిగేవి. అయితే గతంలో ఇదే తరహాలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయంటూ బ్యాంకు ఖాతాల ద్వారా జీతాలను చెల్లించిన కార్పొరేషన్ నేటికీ అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని భావిస్తోంది.
ఈ క్రమంలో దేశంలో ఎక్కడా లేని విధంగా పర్మినెంటు ఉద్యోగులను వదిలి కార్మికులకు బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తేవటంతో అక్రమాలు తగ్గుతాయా? అన్నది చర్చనీయాంశంగా మారింది. స్వీపింగ్ యూనిట్లలో ఎప్పటికపుడు అక్రమాలు చోటుచేసుకోవటంలో కీలక పాత్ర వహించే ఎస్‌ఎఫ్‌ఏల చేతికే మళ్లీ ఈ బయోమెట్రిక్ యంత్రాలను అప్పగించటంతో అధికారులు ఆశించిన పారదర్శకత దక్కుతుందా? అన్నది ప్రశ్నార్దకంగా మారింది.