హైదరాబాద్

స్వైన్‌ఫ్లూతో బాలిక మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికింద్రాబాద్, జనవరి 31: స్వైన్‌ఫ్లూతో గాంధీలో చికిత్స పొందుతున్న రెండేళ్ల బాలిక మరణించింది. బేగంపేటకు చెందిన బాలిక తీవ్ర విషజ్వరంతో గత నెల 25న గాంధీలో చేర్పించారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మరణించడంలో స్వైన్ ఫ్లూ కలవరం కలిగిస్తోంది.

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో
కిలో బంగారం పట్టివేత

హైదరాబాద్, జనవరి 31: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం ఉదయం భారీ బంగారం పట్టుకున్నారు. జెద్దా నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుల నుంచి కస్టమ్స్ అధికారులు ఒక కిలో వంద గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. గత కొద్ది రోజులుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ, కస్టమ్స్ అధికారుల కళ్లు గప్పి బంగారం అక్రమ రవాణా చేస్తున్నారని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో అప్రమత్తమైన సెక్యూరిటీ, కస్టమ్స్ అధికారులు జెద్దా నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులు జేమ్స్, జాస్మిన్‌లపై అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు వారిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తాము బంగారం తీసుకువస్తున్నట్టు సెక్యూరిటీ, కస్టమ్స్ అధికారులు గుర్తించకుండా ఉండేందుకు బంగారు బిస్కెట్లను అరికాళ్ల కింద పెట్టుకొని వచ్చారు. ఎయిర్‌పోర్టు పోలీసులు వీరిని శంషాబాద్ పోలీసులకు విచారణ నిమిత్తం అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రయాణీకుల వద్ద లభించిన బంగారం ఎవరిది? ఎవరు పంపిస్తోంది? ఇది స్మగ్లింగ్ బంగారమా? స్మగుల్డ్ బంగారమైతే దీని వెనుక ఎవరి హస్తం ఉంది? అన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.