హైదరాబాద్

స్వచ్ఛ సర్వేక్షణ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 2: పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన స్వచ్ఛ్భారత్ సాధించే దిశగా కేంద్ర ప్రభుత్వ స్వ్ఛ్భారత్ మిషన్ దేశవ్యాప్తంగా 500 నగరాల్లో చేపట్టిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2017 గురువారం నుంచి ప్రారంభమైంది. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి విచ్చేసిన ముగ్గురు చురుకైన నిపుణులతో కూడిన త్రిసభ్య కమిటీ నగరంలో గురువారం వ్యూహాత్మకంగా పర్యటించింది. సౌత్, నార్త్‌జోన్ల పరిధుల్లోని పలు ప్రాంతాల్లో స్వచ్ఛ్భారత్ మిషన్ కార్యక్రమల అమలును స్వయంగా పరిశీలించి, ఫొటోలను సేకరించింది. సౌత్ జోన్‌లోని ఫలక్‌నుమా రైతుబజార్, మలక్‌పేట గ్రేన్ మార్కెట్, ఐఎస్ సదన్‌తో పాటు పలు మురికివాడల్లో పర్యటించింది. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించి పలు ఇళ్లలో ఆకస్మికంగా తనఖీలు నిర్వహించింది. అలాగే నార్త్‌జోన్ పరిధిలో సికిందరాబాద్ రైల్వే స్టేషన్, మోండామార్కెట్, పలు ప్రధాన కూడళ్లలో ఈ బృందం పర్యటించింది. మరో రెండురోజుల పాటు కమిటీ ఇలాగే పర్యటించే అవకాశముండటంతో ఎపుడు ఏ ప్రాంతానికి వెళ్తారో తెలీక జిహెచ్‌ఎంసి సర్వే కోసం క్షణ క్షణం ఉత్కంఠకు గురవుతోంది. ముఖ్యంగా జిహెచ్‌ఎంసి అధికారులకు ముందస్తు ఎలాంటి సమాచారం లేకుండానే పలు ప్రాంతాల్లో ఈ కమిటీ పర్యటన చేపట్టడంతో అధికారులు ఖంగుతిన్నారు. స్వచ్ఛ కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహిస్తున్న జిహెచ్‌ఎంసి నగరంలోని పారిశుద్ద్యం, తడి,పొడి చెత్తను వేర్వేరు చేసే ప్రక్రియ, అలాగే బహిరంగ మల,మూత్ర విసర్జనకు వివిధ ప్రాంతాల్లో చేపట్టిన చర్యలను, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, పెద్ద పెద్ద మురికివాడలు, జనం ఎక్కువగా ఉండే మార్కెట్లు వంటి ఇతరత్ర సమాచారాన్ని స్వచ్ఛ్భారత్ మిషన్‌కు అందజేసింది. ఈ సమాచారంతో దిల్లీలోని స్వచ్ఛ్భారత్ మిషన్ ఉన్నతాధికారులు నగరంలో ఉన్న త్రిసభ్య కమిటీ ఎపుడు ఎక్కడ పర్యటించాలన్న విషయాన్ని కొద్ది గంటల ముందు సూచిస్తోంది. హైదరాబాద్ నగరంలో తాము ఎక్కడికి ఎపుడు వెళ్లి ఏ అంశం ప్రాతిపదికన సర్వే చేయాలన్న విషయం ఈ ముగ్గురు నిపుణులకు సైతం ముందుగా తెలియకపోవటం, క్షేత్ర స్థాయి సర్వేకు సంబంధించి సమాచారమిచ్చిన తర్వాత కూడా సంబంధిత అధికారులకు ముందసుస్త సమాచారమివ్వకుండా పారదర్శకతతో పర్యటించి, క్షేత్ర స్థాయిలో నెలకొన్న వాస్తపరిస్థితులను పరిగణలోకి తీసుకుని మార్కులు కేటాయించాలంటూ ఖచ్చితమైన నిబంధన ఉన్నట్లు తెలుస్తోంది. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మొదటి రోజైన గురువారం ఉదయం ఉన్నట్టుడి ఈ కమిటీ ఇమ్లిబన్ బస్ స్టేషన్‌ను సందర్శించేందుకు వస్తుందన్న సమాచారం కొద్ది క్షణాల ముందు తెలియటంతో జిహెచ్‌ఎంసి అధికారులు హడావుడిగా ఇమ్లిబన్‌కు పరుగులు తీశారు. ఇమ్లిబన్‌లో చెత్త తడి,పొడిగా వేర్వేరుగా వేసేందుకు, మల,మూత్ర విసర్జనకు సంబంధించి ఏర్పాట్లపై సంతృప్తిని వ్యక్తం చేసిన ఈ కమిటీ రాకపోకలు సాగించిన పలు ప్రాంతాల్లో చెత్త కుప్పలుగా పడి ఉండటాన్ని గమనించారు. సర్దిచెప్పేందుకు పలువురు జిహెచ్‌ఎంసి అధికారులు ప్రయత్నించగా, కమిటీ విన్పించుకోలేదని, ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితులను తీవ్రంగా పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, గత కొద్ది నెలలుగా స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ర్యాంకు సాధనే లక్ష్యమంటూ జిహెచ్‌ఎంసి అధికారులు హడావుడి చేస్తున్నా, ఎంతో వ్యూహాత్మకంగా క్షేత్ర స్థాయి పర్యటనలు జరుపుతున్న కేంద్ర కమిటీ మరో రెండురోజలు పాటు పర్యటించే అవకాశముంది. ఇందులో భాగంగా నగరంలోని పలు మురికివాడల్లో పర్యటించి స్వచ్ఛతపై ప్రజల్లో ఉన్న అవగాహనను తెల్సుకునేందుకు నేరుగా వారితో ముచ్చటించే అవకాశం కూడా ఉండటంతో ప్రజల నుంచి స్పందన ఎలా ఉంటుందో, ఎన్ని మార్కులతో ఎంత ర్యాంకు వస్తుందో? వేచి చూడాలి.