హైదరాబాద్

రోడ్డుపై మురుగునీరు పారితే ‘ఫైన్’?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 4: ఇకపై మహానగరంలోని రోడ్లపై మురుగు నీరు పారితే ఫైన్ విధించాలని జలమండలి యోచిస్తోంది. ముఖ్యంగా నగరంలో ప్రస్తుతం పలు రోడ్లను ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఇష్టారాజ్యంగా తవ్వ వేదిలేయగా, మిగిలిన రోడ్లలో కొన్నింటిని జిహెచ్‌ఎంసి ఇటీవలే రీ కార్పెటింగ్ చేసినా, ఆశించిన ఫలితం దక్కటం లేదు. వర్షాకాలంలో వాన నీరు ఆగి రోడ్లు ధ్వంసమవుతుండగా, ఆ సీజన్ యేతర ఇతర సమయాల్లో ఎక్కువగా రోడ్లపై మురుగునీరు ప్రవహించటం, లేక రోజుల తరబడి నిల్వ ఉండటం వల్ల ధ్వంసమవుతున్నట్లు జిహెచ్‌ఎంసి గుర్తించింది. ఇలాంటి లోపాలకు శాశ్వత ప్రాతిపదికన చెక్ పెట్టాలంటూ కన్వర్జెన్సీ సమావేశంలో చర్చకు వచ్చింది. అయితే ఇప్పటికే బెంగుళూరు వంటి నగరాల్లో అమలవుతున్న జరిమానాల వసూలు విధానాన్ని నగరంలో కూడా అమలు చేస్తే ఎలా ఉంటుందన్న అంశంపై అధికారులు చర్చించారు. ఈ దిశగా ఇప్పటికే ఏడువేల మందిని గుర్తించి నోటీసులు జారీ చేసినట్లు జలమండలి ఎండి దానాకిషోర్ తెలిపారు. ఈ మేరకు వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని పెంపొందించేందుకు శనివారం కంటోనె్మంట్ బోర్డు కార్యాలయంలో జిహెచ్‌ఎంసి కమిషనర్ డా. జనార్దన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కన్వర్జెన్సీ సమావేశంలో కూడా ఈ మురుగునీరు రోడ్డుపై ప్రవహించకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై చర్చ జరిగింది. ఇందుకు స్పందించిన జలమండలి అధికారులు ఇకపై రోడ్లపై సీవరేజ్ నీరు ప్రవహిస్తే, ఆ నీరు ఎక్కడి నుంచి ప్రవహిస్తుందో గుర్తించి సదరు ఇళ్లు, లేక వ్యాపార సంస్థ, భవన యజమాని నుంచి జరిమానా వసూలు చేయాలని యోచిస్తున్నట్లు, ఇందుకు నిబంధనలను రూపకల్పన చేస్తున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా ఒక ఇంటి నుంచి వచ్చే మురుగు నీరు సక్రమంగా ప్రవహించి, మెయిన్ రోడ్డులో ఉండే పెద్ద పైపుల్లో కలిసేందుకు వీలుగా ప్రతి ఇళ్లు, వ్యాపార సంస్థల యజమానులు తమ సీవరేజ్ లైన్లను జాగ్రత్తగా చూసుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఈ జరిమానాల వసూలు నిబంధనను త్వరలో అమలు చేసేందుకు జలమండలి సిద్దమవుతున్నట్లు తెలిసింది. పలు ఇళ్లు, వ్యాపార సంస్థ నుంచి సీవరేజీ నీరు ప్రవహించే పైప్‌లైన్లలో స్థానికుల అవగాహన రాహిత్యం కారణంగా ప్లాస్టిక్ కవర్లు, షాంపు కవర్లు, గుడ్డలు వంటివి సీవరేజీ పైపుల్లో వేయటం వల్ల మురుగునీరు సక్రమంగా ప్రవహించక పైపుల నుంచి లీక్ అవుతున్నట్లు గుర్తించామని, ఏ ఇంటి సీవరేజీ పైప్ లైను నుంచి నీరు రోడ్డుపై ప్రవహించినా, ఆ నీటితో రోడ్డు ధ్వంసమవుతున్నందున, ఆ రోడ్డు మరమ్మతులకయ్యే ఖర్చును ఇళ్లు, వ్యాపార సంస్థల యజమానుల నుంచి వసూలు చేస్తే, స్థానికులకు కూడా బాధ్యత పెరుగుతోందని జలమండలి అధికారులు భావిస్తున్నారు. ఈ సరికొత్త విధానాన్ని అమలు చేసి, తొలుత నోటీసులు జారీ చేసి, ఆ తర్వాత జరిమానాలు విధించాలన్న అంశంపై జలమండలి కసరత్తు చేస్తోంది.

25 స్వైన్ ఫ్లూ కేసులు నమోదు

హైదరాబాద్, ఫిబ్రవరి 4: రాష్ట్రంలో ఈ నెల 3వ తేదీ ఒక్కరోజే 25 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. 68 మంది రక్త పరీక్షల్లో 25 పాజిటివ్‌గా తేలిందని, అయితే ఒక్క మరణం కూడా నమోదు కాలేదని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కార్యాలయం ప్రకటించింది. 2016 ఆగస్టు 1 నుంచి ఈ నెల 3 వరకు 3827 కేసులను పరీక్షించగా, 288 కేసులు పాజిటివ్‌గా ఉన్నట్లు తేలింది.
అప్పటి నుంచి 13 మంది స్వైన్‌ఫ్లూ, సంబంధిత ఇతర కారణాల వల్ల మృతి చెందినట్లు ఆ ప్రకటన పేర్కొంది. స్వైన్ ఫ్లూను ఎదుర్కొనేందుకు గాను అవసరమైన మందులను అన్ని ప్రభుత్వ వైద్య, రామాంతపూర్ హోమియో వైద్య శాలలో సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు.