హైదరాబాద్

చార్మినార్ వద్ద కాంగ్రెస్ నేతల వౌన దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 5: దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 1991 సంవత్సరంలో కాంగ్రెస్ జెండా ఎగుర వేసిన దిమ్మెను టిఆర్‌ఎస్ కార్యకర్తలు కూల్చి వేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆదివారం చార్మినార్ వద్ద వౌన దీక్ష చేపట్టారు. చార్మినార్ పోలీసు స్టేషన్‌కు ఎదురుగానే ఉన్న స్మారక స్తంభాన్ని (దిమ్మె) టిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు తొలగిస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టి.పిసిసి నాయకుడు, స్మారక సమితి అధ్యక్షుడు జి. నిరంజన్ స్మారక స్తంభాన్ని కూల్చి వేసిన చోట వౌన దీక్ష చేపట్టారు. ఈ విషయం తెలియగానే మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి, ఎంపి రాపోలు ఆనంద భాస్కర్, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పి. విష్ణువర్ధన్ రెడ్డి హుటాహుటిన చార్మినార్ వద్దకు చేరుకుని వారూ వౌన దీక్షలో పాల్గొన్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ కవిత ముషాయిరా కోసం ఏర్పాటు చేసిన వేదిక, షామియానాల కోసం స్మారక స్తంభాన్ని తొలగించారని తెలిపారు. ఇందుకు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఎంపి కవిత క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఇలాఉండగా సాయంత్రం స్మారక స్తంభాన్ని పునఃప్రతిష్టించడంతో నిరంజన్ వౌన దీక్షను విరమించారు.
చిలకలగూడలో
చైన్‌స్నాచింగ్
సికిందరాబాద్, ఫిబ్రవరి 5: నడుచుకుంటూ వెళుతున్న మహిళ మెడలోంచి బంగారు గొలుసులు తస్కరించిన దుండగులు సంఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...పార్శిగుట్ట ప్రాంతంలో నివసించే జి.జ్యోతి (32) ఆదివారం సాయంత్రం స్థానికంగా ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగి వస్తుండగా, నల్లరంగు పల్సర్ బైక్ వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని 10తులాల గొలుసులను లాక్కుని పారిపోయారు. కేసును చిలకలగూడ పోలీసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.