హైదరాబాద్

మెట్రో రైల్ నత్తనడక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 5: మెట్రో రైల్ నిర్మాణం పనులు నత్త నడకన సాగుతున్నాయని బిజెపి జాతీయ నాయకుడు, కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ బాధను వ్యక్తం చేశారు. మెట్రో రైల్, ఎంఎంటిఎస్ పనులపై కేంద్ర మంత్రి దత్తాత్రేయ ఆదివారం సంబంధిత ఉన్నతాధికారులతో సమీక్షించారు. బిజెపి ఎమ్మెల్సీ ఎన్. రామచందర్ రావు, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ నగర ముఖ చిత్రాన్ని మార్చే ఈ ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే కాలుష్యం తగ్గుతుందని, వాహన రద్దీ తగ్గడమే కాకుండా రోజుకు 12 నుంచి 14 లక్షల మంది ప్రయాణికులకు ఇబ్బందులు తప్పుతాయని అన్నారు. నాగోల్-మెట్టుగూడ, మెట్టుగూడ-బేగంపేట, మియాపూర్-సంజీవరెడ్డి నగర్ ప్రాంతాల మధ్య మెట్రో రైల్ నిర్మాణ పనులు పూర్తి అయినందున వెంటనే ప్రారంభానికి చర్యలు చేపట్టాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించవచ్చని ఆయన చెప్పారు.
అన్న చెయ్యి నరికిన తమ్ముడు
శంకర్‌పల్లి, ఫిబ్రవరి 5: తమ్మునితో గొడవ పడొద్దని మందలించినందుకు, అన్న చేయినే గొడ్డలితో నరికిన ఓ తమ్ముని ఉదంతమిది. శంకర్‌పల్లి ఎస్‌ఐ కథనం ప్రకారం, శంకర్‌పల్లి మండలం, మహరాజ్‌పేట పరిధిలోని కాకర్లగుట్ట తండాకు చెందిన సబావత్ మోహన్ 3వ తమ్ముడిని అన్న రవి కొడుతుంటే వద్దని పెద్దఅన్నయ్య మందలించాడు. దీంతో కోపంతో రవి గొడ్డలితో మోహన్ చేయి నరికి దాడి చేశాడు. మోహన్ భార్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రవిని కోర్టుకు హాజరు పరుస్తామని ఎస్‌ఐ క్రాంతికుమార్ తెలిపారు.

కల్తీ నీళ్ల దందా!

బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో నకిలీ నీళ్ల బాటిళ్లు
వామ్మో..వా‘్ఢర్’!
బ్రాండెడ్ లేబుల్స్‌తో
విక్రయాలు

ముషీరాబాద్, ఖైరతాబాద్, ఫిబ్రవరి 5: గొంతు తడుపుకుందామని నీళ్ల బాటిల్ కొనుగోలు చేసేవారు ఇకపై జాగ్రత్త పడాలి. సాధారణ వాటర్ బాటిళ్లకు బ్రాండెడ్ సంస్థల లేబుళ్లను అతికించి విక్రయిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే నగరంలోని బస్‌స్టేషన్లు, రైల్వేస్టేషన్లలో ఈ నకిలీ నీళ్ల దందా కొనసాగుతోంది. బస్సులు, రైళ్లు ఎక్కే హడావుడిలో వాటర్ బాటిళ్లను కొనుగోలు చేసే ప్రయాణికులే టార్గెట్‌గా విక్రయానికి తెరలేపారు. నగరంలో వెలుగు చూసిన నకిలీ నీళ్ల బాటిళ్ల విక్రయాలతో ప్రజలు దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. నకిలీ టమోటో సాస్, నకిలీ వెల్లుల్లి పేస్ట్, కల్తీపాలు ఇలా చెప్పుకుంటూ పోతే నగరవాసులు తమ దైనందిన జీవితంలో నిత్యవసర వస్తువుల కొనుగోళ్లలో కల్తీ సరుకులు కొకొల్లలు. తాజా నకిలీ నీళ్ల బాటిళ్ల తయారీ వెలుగుచూడటం ప్రజలను మరింత కలవర పరుస్తుంది. స్థానికంగా ఉన్న నీటిని బాటిళ్లలో నింపుతూ ప్రముఖ కంపెనీలకు చెందిన లేబుళ్లను అతికిస్తూ విక్రయించడం గమనార్హం. బస్‌స్టేషన్లలో, రైల్వేస్టేషన్లలో స్థానికంగా కుళాయి పంపుల నీటిపై నమ్మకం లేకే వాటర్ బాటిళ్లను కొనుగోలు చేసే ప్రయాణికులు కల్తీ నీళ్ల బాటిళ్లు విక్రయిస్తున్నారని తెలిసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే విశ్వసనీయ సమాచారం మేరకు ఓ వ్యాపారిని పోలీసులు అదుపులోనికి తీసుకొని విచారించగా వాస్తవాలు వెలుగుచూశాయి. ఇప్పటికే ఇంటింటికి సరఫరా అయ్యే వాటర్ క్యాన్స్‌ల సరఫరాలో జరుగుతున్న కలుషిత నీటిని అరికట్టలేని ప్రభుత్వ అధికారులు ఇక ఈ కల్తీ వాటర్ బాటిళ్ల విక్రయాలపై ఏ మాత్రం స్పందిస్తారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ఆరోగ్యాన్ని ప్రభుత్వ నిఘా విభాగ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని వాపోతున్నారు. నగరంలోని సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లతో పాటు మహాత్మాగాంధీ బస్‌స్టాండ్, జూబ్లీతో పాటు శివారు ప్రాంతాల్లోని ఆయా జిల్లాలకు వెళ్లే ప్రధాన బస్టాండ్లలోని స్టాల్స్‌ల్లో కల్తీ నీళ్ల దందా యథేచ్ఛగా సాగుతున్నట్టు తెలుస్తోంది. సంబంధిత శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేపట్టి నకిలీ నీటి బాటిళ్ల విక్రయాలపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది.