హైదరాబాద్

తీహార్ జైలుకు మరో ఇద్దరు దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల కేసులోని ఖైదీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 7: దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల కేసులోని మరో ఇద్దరు ఖైదీలను ఎన్‌ఐఏ అధికారులు తీహార్ జైలుకు తరలించారు. 2013 ఫిబ్రవరి 21న జరిగిన జంట పేలుళ్లలో 22 మంది మృతి చెందగా, 138 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఈ పేలుళ్ల కేసులో 2016 డిసెంబర్ 19న ఐదుగురిని దోషులుగా నిర్ధారించిన ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధించింది. అయితే శిక్ష ఇంకా అమలు కాకపోగా, నిందితులపై ముంబై, ఢిల్లీలో కేసులు ఉన్నందున కేసుల విచారణ నిమిత్తం ఐదుగురిలో ఇటీవల ఇద్దరిని తీహార్ జైలుకు, ఒకరిని ముంబై జైలుకు తరలించారు. అదేవిధంగా చర్లపల్లి జైలులో ఉన్న మరో ఇద్దరు ఖైదీలు జియాఉర్ రహ్మాన్, తహసిన్ అక్తర్‌ను ఓ కేసులో విచారణ కోసం ఎన్‌ఐఏ అధికారులు మంగళవారం తీహార్ జైలుకు తరలించారు. ఐదుగురు నిందితుల్లోని యాసిన్ భత్కల్, అసదుల్లా అక్తర్, ఎజాజ్ షేక్‌లను ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ కొనసాగుతోందని ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు.

విద్యతోనే అత్యంత వెనుకబడ్డ కులాల అభివృద్ధి
ఖైరతాబాద్, ఫిబ్రవరి 7: విద్యతోనే సమాజంలో అత్యంత వెనుకబడ్డ కులాలు అభివృద్ధి సాధించగలవని రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జాతీయ ఎంబిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రిజర్వేషన్లు- ఎంబిసిలు అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఎంబిసి జాతీయ అధ్యక్షుడు కెసి కాళప్ప అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సీనియర్ పాత్రికేయులు శ్రీనివాసరావు, విజయ్‌కుమార్, తెలంగాణ రాష్ట్ర సగర సంఘం అధ్యక్షుడు నర్సింహ సగర, జయంత్ రావు, బెల్లం మాదవి, షకీనా, అంతయ్య, సూర్యారావులతో పాటు పలు సంఘాల నాయకులు పాల్గొని ప్రసగించారు. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడుస్తున్నా ఎంబిసి కులాల పరిస్థితిలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. దీనికి ప్రధాన కారణం అన్ని పార్టీలు అత్యంత వెనుకబడిన కులాలను కేవలం ఓటు బ్యాంకుగానే భావిస్తున్నాయని అన్నారు. రాజకీయంగా, ఆర్ధికంగా, సామాజికంగా వెనుకబాటును అనుభవిస్తున్న ఈ కులాలు అభివృద్ధి జరగాలంటే ఐక్యతా, విద్య ఎంతో ముఖ్యమని అన్నారు. దీనికోసం ఎంబిసి కులాల ప్రజలు ఎంతగానో కృషి చేయాల్సి ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలను రూపొందించాలని డిమాండ్ చేశారు.