హైదరాబాద్

జూపార్కుకు ఆన్‌లైన్ టికెటింగ్ విధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 8: సందర్శకులతో నిత్యం రద్దీగా ఉండే జూపార్కు ఎంట్రీ టికెట్ కోసం ఇక క్యూ లైన్‌లో పడిగాపులు గాయాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చోని ఆన్‌లైన్‌లోనే టికెట్లు బుక్ చేసుకుని నేరుగా జూపార్కులోకి వెళ్లవచ్చు. ఈ మేరకు జూపార్కులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ టికెట్ కేంద్రాన్ని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగురామన్న బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా, గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడకుండా ఉండేందుకు ఈ ఆన్‌లైన్ టికెటింగ్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టినట్లు వివరించారు. ముఖ్యంగా సెలవు రోజుల్లో జూ పార్కు అత్యంత రద్దీగా ఉంటుందని, అటువంటి సమయాల్లో క్యూ లైన్లలో నిలబడి టికెట్లు కొనుగోలు చేసేందుకు సందర్శకులు, ముఖ్యంగా మహిళలకు ఎదుర్కొంటున్న కష్టాలను నివారించేందుకే ఈ ఆన్‌లైన్ టికెటింగ్ సౌకర్యాన్ని కల్పించినట్లు తెలిపారు.
ముఖ్యంగా సెలవు రోజుల్లో జూపార్కును సందర్శించాలనుకుని ముందుగానే ప్లాన్ చేసుకునే వారు తమ ఇంటి వద్ద నుంచే తమ టికెట్లు బుక్ చేసుకునే వెసులుబాటు కల్గిందన్నారు. ఈ రకంగా టికెట్ బుక్ చేసుకున్న వారిని లోనికి అనుమతించేందుకు ప్రత్యేక గేటును ఏర్పాటు చేశామన్నారు. జూ పార్కు సందర్శకులను మరింత ఆకట్టుకునేందుకు గాను నూతనంగా పార్కులో ఎన్నో జంతువులను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. దీంతో పాటు జూ పార్కులో సందర్శకులకు ఉచితంగా అందిస్తున్న వైఫై సేవలను కూడా మంత్రి ప్రారంభించారు. అంతేగాక, రెండు తెల్లపులుల కూనలను ఎన్‌క్లోజర్లలోకి మంత్రి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సిసిసిఎఫ్ అండ్ ఫారెస్ట్ ఫోర్స్ హెడ్ పి.కె.ఝా, అదనపు సిసిసిఎఫ్ ఎం. భాంజా, అదనపు సిసిసిఎఫ్ మునీంద్ర, పృథ్వీరాజ్, సోషల్ ఫారెస్ట్రీ డోబ్రియాల్, జూపార్కు డైరెక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి, క్యూరేటర్ శివానీ బోగ్రా, వైల్డ్‌లైఫ్ వోఎస్‌డి శంకరన్, వైల్డ్‌లైఫ్ సిసిసి ఎఫ్ సుభద్ర పాల్గొన్నారు.