హైదరాబాద్

వాటర్ బిల్లు చెల్లించకుంటే కనెక్షన్ కట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 8: ఆరు నెలలుగా వరుసగా వాటర్ బిల్లు చెల్లించని కనెక్షన్లను గుర్తించి, దాన్ని కట్ చేయాలని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ దాన కిషోర్ అధికారులకు సూచించారు. ఈ మేరకు ఆయన బుధవారం జలమండలి ప్రధాన కార్యాలయంలో సర్కిల్ 1,3 ఆపరేషన్, మెయింటనెన్స్ నిర్వహణ పనులు, రెవెన్యూ కలెక్షన్ వంటి అంశాలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండి దాన కిషోర్ మాట్లాడుతూ తరచుగా మురుగునీరు ప్రవహించే ప్రాంతాలు, సివరేజీ వాటర్ లీకేజీ కాలుష్య సంబంధిత ఫిర్యాదులు అధికంగా వస్తున్న ప్రాంతాల్లో తగిన మరమ్మతులకు ప్రతిపాదనలు, అంచనాలను రూపొందించి, ఈ నెల 20వ తేదీలోపు తనకు సమర్పించాలని ఆదేశించారు. దీంతో పాటు సిల్ట్ చాంబర్ల నిర్మాణం, హాట్‌స్పాట్‌ల మరమ్మతులో ప్రజలను కూడా భాగస్వాములను చేయాలని సూచించారు. హాట్‌స్పాట్‌ల మరమ్మతులకు సంబంధించి రూపొందించే ప్రతిపాదనలకు, అంచనాలను పెండింగ్‌లో ఉంచకుండా వీలైనంత త్వరగా మంజూరీ ఇస్తామన్నారు. ముఖ్యంగా రోడ్లపై, వీధుల్లో మురుగునీరు నిల్వ ఉండేందుకు కారకులైన వారిని గుర్తించి, వారికి సిల్ట్ చాంబర్లను నిర్మించుకోవాలని సూచిస్తూ, కొంత సమయాన్ని ఇవ్వాలన్నారు. గడువు ముగిసేలోపు సిల్ట్ చాంబర్లను నిర్మించుకోని వారిని గుర్తించి, వారికి జరిమానాలు విధించాలని ఆదేశించారు. నగరంలోని హాస్టళ్లు, హోటళ్లు, మెస్‌లు, హాస్పిటల్స్, ఫంక్షన్ హాళ్లు, డైరీ ఫాంలు వంటివి ఈ క్యాటగిరి కిందకు వస్తాయని ఎండి వివరించారు. ఇదిలా ఉండగా, ఈ నెల జలమండలి ఆదాయాన్ని రూ. వంద కోట్ల వసూలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇందుకు నల్లాల బిల్లులు చెల్లించని వారిని గుర్తించి, ఆరునెలల బకాయి ఉంటే కనెక్షన్లను కట్ చేయాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలతో సహా ప్రతి ఒక్క మొండి బకాయిదారుల గృహ, కార్యాలయాల ప్రాంగణంలో రెడ్ కార్నర్ నోటీసులను అంటించాలని ఆయన అధికారులకు సూచించారు. నల్లా తొలగింపు ప్రక్రియ స్థితిని తెలుసుకునేందుకు ప్రధాన కార్యాలయం నుంచి ఒక ఆడిట్ బృందం తనిఖీ చేయాలని ఆదేశించారు. అలాగే వచ్చే వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని, నీటి కష్టాలను ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహంతో ప్రణాళికలను సిద్ధం చేయాలని, వాటిని ఈ నెల 20వ తేదీ లోపు సమర్పించాలని జనరల్ మేనేజర్లను ఎండి ఆదేశించారు.
ఎండితో రంగారెడ్డి కలెక్టర్ భేటీ
జలమండలి ఎండి దాన కిషోర్‌తో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు బుధవారం భేటీ అయ్యారు. ఔటర్ రింగురోడ్డు ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఔటర్ బయటనున్న 190 గ్రామాలకు జలమండలి చేయనున్న నీటి సరఫరా అంశంపై చర్చించారు.