హైదరాబాద్

ఆన్‌లైన్ మోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 9: ఆన్‌లైన్ మోసం కేసులో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన మహేందర్‌కుమార్ మండల్‌ను గురువారం సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. తాను బ్యాంక్ మేనేజర్‌ను అంటూ కొత్త డెబిట్ కార్డు ఇస్తామని, పాత ఏటిఎం పిన్ నెంబర్ అడిగి..ఆ పిన్ నెంబర్ సహాయంతో ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్నాడు. ఇప్పటికే ఇతనిపై జార్ఖండ్‌లో పలు కేసులు ఉన్నాయి. కాగా డిసెంబర్ 31న సికిందరాబాద్ బోయినపల్లికి చెందిన సిహెచ్ శంకర్ వ్యక్తికి ఫోన్ చేసి బ్యాంక్ నెంబర్‌తోపాటు ఏటిఎం పిన్ నెంబర్ తీసుకున్నాడు. అతని ఖాతా నుంచి రూ. 1,69,000లు కాజేశాడు. శంకర్ ఫిర్యాదు మేరకు సిసిఎస్ పోలీసులు రంగంలోకి దిగారు. ఎట్టకేలకు గురువారం మహేందర్‌కుమార్ మండల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఐపిసి 419, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్టు సైబర్ క్రైం ఇన్స్‌పెక్టర్ విపి తివారి తెలిపారు.

చిన్నారిని చితకబాదిన అంగన్‌వాడీ టీచర్
విరిగిన చేయి
అంగన్‌వాడీ కేంద్రంపై దాడి

హైదరాబాద్, ఫిబ్రవరి 9: ఎస్‌ఆర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లారెడ్డిగూడలో దారుణం చోటుచేసుకుంది. అంగన్‌వాడి కేంద్రంలో ఓ విద్యార్థిని టీచర్ విచక్షణారహితంగా కొట్టింది. మూడేళ్ల చిన్నారని చితకబాదడంతో చిన్నారి చేయి విరిగింది. దీంతో టీచర్‌పై చర్యలు తీసుకోవాలని చిన్నారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఎల్లారెడ్డిగూడలోని అంగన్‌వాడి కేంద్రంపై చిన్నారి బంధువులు దాడి చేశారు. చిన్నారులని చూడకుండా చేయి విరిగేలా కొట్టిన అంగన్‌వాడి టీచర్ సుమపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినట్టు చిన్నారి తల్లిదండ్రులు తెలిపారు.