హైదరాబాద్

అవుటర్ రింగ్ రోడ్డులో వేగ నియంత్రణకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 10: అవుటర్ రింగ్ రోడ్డులో వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్నామని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్‌పి సింగ్ అన్నారు. శుక్రవారం సచివాలయంలో ఆయన చాంబర్‌లో యునిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టు అథారిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవుటర్ రింగ్ రోడ్డులో 100 కి.మీ వేగాన్ని నోటిఫై చేయాలని అధికారులను ఆదేశించామని అన్నారు. రోడ్డుపై సీడు నియంత్రణ సమాచారాన్ని వాహనదారులకు తెలిపే విధంగా సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలని అన్నారు. నగరంలో ట్రాఫిక్ సమాచారం ఎప్పటికప్పుడు తెలిసే విధంగా ఒక యాప్ రూపొందించినట్లు తెలిపారు. ప్రతి శాఖ తమ సమస్యలను ముందుగానే యునిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టు అథారిటీకి పంపాలని సూచించారు. నగరంలోని అంతర్గత బస్ టెర్మినల్, ఎంఎంటిఎస్ రెండో దశ, హైవే ట్రాఫిక్ నిర్వహణ విధానం, ఇంటిలిజెన్స్ ట్రాఫిక్ టాన్స్‌పోర్టు సిస్టమ్ తదితర అంశాలపై చర్చించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎండిఎ కమిషనర్ చిరంజీవులు యుఎంటిఏపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి నవీన్ మిత్తల్, జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్థన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కేంద్ర నిధులను పక్కదారి పట్టించిన తెరాస సర్కార్ : టిటిడిపి

హైదరాబాద్, ఫిబ్రవరి 10: కేంద్ర నిధులను తెరాస ప్రభుత్వం పక్కదారి పట్టించిన తెలంగాణ టిడిపి నేతలు విమర్శించారు. కేంద్రం మంజూరు చేసిన నిధులను ఖర్చు చేయకపోగా వాటిని పక్కదారి పట్టించిందని అన్నారు.
శుక్రవారం ఎన్టీఆర్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టిడిపి పోలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర రెడ్డి, ప్రధాన కార్యదర్శి అమర్‌నాథ్‌బాబు, మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు తాజుద్దీన్ మాట్లాడుతూ తమ ఢిల్లీ పర్యటన వివరాలను వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులతో పాటు ప్రధాన సమస్యలను కేంద్ర మంత్రుల దృష్టికి తమ పార్టీ నేతలు తీసుకెళ్లారని తెలిపారు. కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు గురించి రైల్వే మంత్రికి వివరించగా, ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక పాలనపై ప్రజాపోరు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.