హైదరాబాద్

ప్రభుత్వ పనుల్లో నాణ్యత పాటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 10: రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన భవనాలు, రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం వంటి అభివృద్థి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పట్నం సునీతా మహేందర్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం జిల్లాపరిషత్‌లో సాంఘిక సంక్షేమం పనులు, ఫైనాన్స్ స్థాయి సంఘాల సమావేశాలు జరిగాయి. జడ్పీ నిధులు, సిడిపి, ఎంఆర్‌ఆర్, సిఆర్‌ఆర్, పిఎంజీఎస్వీ, ఆర్డీఎఫ్ 13 ఆర్థిక సంఘం ఎంజిఎస్‌ఆర్‌జిఎస్, నాబార్డ్ వంటి పథకాలలో చేపట్టిన పనులపై సమావేశంలో సమగ్రంగా చర్చించారు. మంజూరైన జడ్పీ పనులు ఇప్పటి వరకు ప్రారంభించకుంటే వాటిని మార్చి అవసరమున్న గ్రామాలలో పనులు కేటాయించాలని సభ్యులు సూచించారు. పద్దేముల్ మండలంలోనే రూ.20లక్షల జడ్పీ నిధులు ఇప్పటి వరకు ప్రారంభించలేదని సునీతా అన్నారు. ఇలాంటి పనులను గుర్తించి నివేదికను ఇవ్వాలని పిఆర్ ఇంజనీర్లకు ఆదేశించారు. గ్రామాల్లో పగలు వీధిలైట్లు ఆర్చడానికి రూ.9కోట్లతో వైర్లు ఏర్పాటు చేస్తామని ట్రాన్స్‌కో ఎస్‌ఇ తెలిపారు. మూడవ విడత మిషన్ కాకతీయ ద్వారా వికారాబాద్ జిల్లాలో 109, రంగారెడ్డి జిల్లాలో 224, మేడ్చల్ జిల్లాలో 26 చెరువుల పునరుద్ధరణకు ప్రతిపాదనలు పంపినట్లు ఇరిగేషన్ అధికారులు వెల్లడించారు. వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులను ఆదేశించారు. కల్యాణలక్ష్మీ పథకం చెక్కులు సకాలంలో లబ్ధిదారులకు అందజేయాలని పేర్కొన్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ ఉన్నందున దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారందరికీ కల్యాణలక్ష్మీ అందజేయాలని ఆదేశించారు. 2015-2016 ఆర్థిక సంవత్సరంలో కార్పొరేషన్‌ల నుంచి 1226 మందికి రాయితీ రుణాలు పెండింగ్‌లో ఉన్నాయని వీటిలో ఎస్సీ 716, ఎస్టీ 37, బిసి 473 మంది పెండింగ్‌లో ఉన్న లబ్ధిదారులకు ఈ నెలాఖరులోగా అందిస్తామని అధికారులు స్టాండింగ్ కమిటీకి వివరించారు. హైదరాబాద్ పబ్లిక్ పాఠశాలలో ప్రతి జిల్లాకు 10 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించాలని కమిటీ సమావేశంలో తీర్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, సంజీవరావు, సిఇఓ రమణారెడ్డి, సాంఘిక, సంక్షేమ స్థాయి సంఘం అధ్యక్షురాలు కావలి సునీత, సభ్యులు ఎం.సంజీవరెడ్డి, ముత్తార్ షరీఫ్, జ్యోతి, శైలజ, ఈశ్వర్ నాయక్, సరోజ, నర్సింహ, డిప్యూటీ సిఇఓ శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.

కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణానికి భూమి పూజ

హైదరాబాద్, ఫిబ్రవరి 10: అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించతలపెట్టిన పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణ పనులను తెలంగాణ రాష్ట్ర డిజిపి అనురాగ్‌శర్మ శుక్రవారం భూమి పూజ నిర్వహించారు. బంజారాహిల్స్‌లోని రోడ్డు నెంబర్ 12లో నిర్మిస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను రూ.350 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ పనులను 21 నెలల్లో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలనే ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో ఈ కేంద్రాన్ని అనుసంధానం చేస్తామన్నారు. 16 నుంచి 20 అంతస్తులు ఉండే మొత్తం నాలుగు టవర్స్‌కు సంబంధించిన నాలుగు టవర్స్ నిర్మాణం చేపడుతామన్నారు.
నాలుగు టవర్స్‌ను అను సంధానం చేస్తూ బ్రిడ్జిలను నిర్మిస్తున్నారు. ముందుగా హైదరాబాద్ సిటీ పోలీసుకు సంబంధించి అన్ని విభాగాలకు సంబంధించిన కమాండ్ కంట్రోల్ పనులను పూర్తిచేస్తామన్నారు. రాష్ట్రానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు ఇక్కడి నుంచే నిర్వహిస్తామని చెప్పారు.