హైదరాబాద్

అవే అడ్డంకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 10: అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు తయారైంది హైదరాబాద్ అభివృద్ధి. పుష్కలంగా నిధులు, ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే స్వపరిపాలన అందుబాటులో ఉన్నా, ఇంజనీర్ల నిర్వాకం కారణంగా ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పనులకు పాతకాలం అడ్డంకులెదురై పనులు ముందుకు సాగటం లేదు. స్వరాష్ట్రం, స్వపరిపాలనకు ముందు హైదరాబాద్ నగరం అన్ని రకాలుగా ధ్వంసమయ్యేందుకు ఆంధ్ర పాలకులే కారణమన్న విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే! కానీ కొత్త రాష్ట్రంలో సొంత పాలనలో సైతం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ నగరంలో ఆశించిన అభివృద్ధి పనులు జరగకపోవటం విడ్డూరం. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా, హెరిటెజ్ సిటీగా తీర్చిదిద్దేందుకు ఎంతో పకడ్బందీగా ముందుకెళ్తున్నామని పాలకులు ప్రకటించిన సంగతి తెలిసిందే! అయినా జిహెచ్‌ఎంసి ఇంజనీర్లలో ముందు చూపు కొరవడటంతో కొత్తగా ప్రతిపాదించిన పనులకు సైతం పాత సమస్యలే ఎదురవుతున్నాయి. వీటిలో అతి ముఖ్యమైంది స్థల సేకరణ. అంతేగాక, నగరంలో రోజురోజుకి నరకప్రాయంగా మారుతున్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రతిపాదించిన స్ట్రాటెజికల్ రోడ్డు డెవలప్‌మెంట్ ప్లాన్(ఎస్‌ఆర్‌డిపి) కింద అయిదు జంక్షన్లలో జరగాల్సిన మల్టీలేవెల్ ఫ్లై ఓవర్లు, స్కైవేలు, గ్రేడ్ సెపరేటర్లకు సంబంధించిన పనులు కేవలం రెండు చోట్ల మాత్రమే జరుగుతున్నాయి. బహద్దూర్‌పురా, జూబ్లీహిల్స్ మైండ్ స్పేస్ వద్ధ రూ. 65 కోట్ల వ్యయంతో అండర్ పాస్ నిర్మాణ పనులు మాత్రమే జరుగుతున్నాయి. మిగిలిన వాటిల్లో కెబిఆర్ పార్కు చుట్టూ చేపట్టాల్సిన పనులకు సంబంధించి వేల సంఖ్యలో చెట్లను నరికివేస్తున్నారంటూ కొందరు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించటంతో అక్కడ పనులు సకాలంలో ప్రారంభించలేకపోయారు. ఈ వ్యవహారానికి సంబంధించి తాము అతి తక్కువ చెట్లను తొలగిస్తున్నామని, తొలగించిన చెట్లను సైతం మరో చోట ట్రాన్స్ లోకేటెడ్ చేస్తున్నామని జిహెచ్‌ఎంసి ట్రిబ్యునల్‌కు సమాధానం కూడా ఇచ్చిన నేపథ్యంలో త్వరలోనే ఈ వివాదం సద్దుమణిగే అవకాశాలున్నాయి. కానీ కంచన్‌బాగ్‌లో ఎస్‌ఆర్‌డిపి కింద ప్రతిపాదించని మల్టీలెవెల్ ఫ్లై ఓవర్, గ్రేడ్ సెపరేటర్ వంటి పనులకు సంబంధించి మజ్లిస్ శాసన సభ పక్ష నేత అభ్యంతరాలు తెలుపుతూ మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె. తారకరామారావుకు లేఖ కూడా రాశారు. అంతలోపు జిహెచ్‌ఎంసి అధికారులు ఈ పనులకు టెండర్లను ఖరారు చేసి శీనయ్య అనే కాంట్రాక్టర్‌కు పనులను కూడా అప్పగించారు. కానీ క్షేత్ర స్థాయిలో స్థల సేకరణ ఏ మాత్రం జరగకపోవటంతో తాము పని ఎలా ప్రారంభించాలంటూ ఇప్పటికే పలు సార్లు కాంట్రాక్టు సంస్థ జిహెచ్‌ఎంసిని ప్రశ్నించినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని జిహెచ్‌ఎంసి ఇంజనీర్లు మున్సిపల్ శాఖ దృష్టికి తీసుకెళ్లగా, స్థానిక ప్రజాప్రతినిధి అభ్యంతరం తెలిపిన నేపథ్యంలో పనులు నిలిపివేయాలని సూచించిన ఆ శాఖ ఆ పనులు రద్దు చేస్తూ త్వరలోనే ఉత్తర్వులు జారీ చేసే అవకాశాలున్నట్లు తెలిసింది.

ఎస్‌ఎస్‌సి, ఇంటర్ పరీక్షల

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 10: వచ్చే నెల నిర్వహించే పదవతరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణకు పకడ్భందీగా ఏర్పాటు చేయాలని రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్నార్ ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్‌లో వేర్వేరుగా నిర్వహించిన సమీక్షా సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ మార్చి ఒకటి నుంచి 18వ తేదీ వరకు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు జరిగే ఇంటర్మీడియెట్ పరీక్షలకు మొదటి సంవత్సరం 56వేల 471 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరం 50,774 మంది విద్యార్థులు హాజరు కానున్నారని పేర్కొన్నారు. పరీక్షల నిర్వాహణకు 125 కేంద్రాలను ఏర్పాటు చేయగా హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 03, రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో 12, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 13 చొప్పున 28 స్టోరేజి పాయింట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మార్చి 14 నుంచి 30వ తేదీ వరకు ఉదయం 9-30 నుంచి మధ్యాహ్నం 12-45 గంటల వరకు జరిగే పదవతరగతి పరీక్షలకు 44,596 మంది విద్యార్థులు హాజరవుతారని పేర్కొన్నారు. ఈ పరీక్షల నిర్వాహణకు 205 కేంద్రాలను ఏర్పాటు చేయగా 27 స్టోరేజి పాయింట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా 144 సెక్షన్ అమలు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.