హైదరాబాద్

హైదరాబాద్‌లో 4501 మంది ఉపాధ్యాయులేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 11: అమ్మో ఇంత పెద్ద నగరం, కోటి మందికి పైగా జనాభా, సుమారు 800 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, ఎయిడెడ్, నవోదయ పాఠశాలలు, అయినా ఉపాధ్యాయుల సంఖ్య 4501. అవునా ఇంత పెద్ద నగరంలో ఇంత తక్కువ ఉపాధ్యాయుల ఉన్నారేమిటీ? అని అనుకుంటున్నారా?. ఇది నిజమే, ఓటు హక్కు వయస్సు రాగానే ఓటును సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులను, ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన ఉపాధ్యాయులే ఓటు హక్కు కోసం చాలా మంది తమ పేర్లను నమోదు చేయించుకోలేదంటే నమ్మండి.
వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ స్థానానికి వచ్చే నెల 9న పోలింగ్ జరగనున్నది. ఈ మేరకు ఈ నెల 13న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఉభయ రాష్ట్రాల ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ శనివారం మీడియాకు తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఉపాధ్యాయ ఓటర్లు 6675, రంగారెడ్డిలో 11,837, హైదరాబాద్‌లో 4,501 మంది ఉన్నట్లు ఆయన ప్రకటించారు. హైదరాబాద్‌లో సుమారు 10 వేల పైచిలుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు. కానీ వారిలో సగానికి పైగా ఉపాధ్యాయుల నియోజకవర్గాల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోలేదు. అందుకే ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎన్నికల పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రాలు బోసి పోతున్నాయి.
నిజాయితీపరుడు, నిస్వార్థంగా సమాజ సేవ చేసే నాయకున్ని ఎన్నుకోవడానికి ఓటు అనే ఆయుధాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పాల్సిన ఉపాధ్యాయులు తమ పేర్లను నమోదు చేయించుకోవడానికి అనాసక్తి చూపిస్తున్నారు.
నమోదు చేయించుకున్న వాళ్ళ పోలింగ్ శాతం కూడా తక్కువగానే నమోదు అవుతున్నది. అయితే హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తూ నగర శివారులో నివసించే వారు ఓటర్ల జాబితాలో నమోదు చేయించుకోవడం సాధ్యపడదు. హైదరాబాద్ చిరునామా ఉండాలి. అటువంటి వారి సంఖ్య అరుదుగానే ఉంటుంది.