హైదరాబాద్

నగరంలో నీటి సంక్షోభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 30: మహానగరంలో మంచినీటి సంక్షోభం తీవ్ర రూపం దాల్చనుంది. ఒకవైపు ప్రభుత్వం జంటనగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు కృష్ణా, గోదావరి జలాలను తరలిస్తున్నా, మున్ముందు నగరవాసులకు తీవ్ర నీటి ఇక్కట్లు తప్పేట్టు లేవు. ప్రస్తుతం నగరంలోని పలు ప్రాంతాలకు రోజు విడిచి రోజు మంచినీటిని సరఫరా చేస్తుండగా, శివార్లలో సమస్య మాత్రం రోజురోజుకీ తీవ్ర రూపం దాల్చుతోంది. శివార్లలో ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసేందుకు ప్రయత్నించినా, ఫలితం దక్కపోవటంతో చుక్క నీటి కోసం ప్రజలు చుక్కలు చూడాల్సి వస్తోంది. రెండేళ్ల నుంచి ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవటం వల్లే జలాశయాల్లో నీటి మట్టాలు బాగా పడిపోయి, ఈ పరిస్థితి దాపురించిందని, మున్ముందు మంచినీటి సమస్య తీవ్రం అవుతుందన్న వాదనతో జలమండలి అధికారులు కూడా ఏకీభవిస్తున్నారు. రిజర్వాయర్లలో నీటి మట్టాలు బాగా పడిపోయి నీటి సమస్య తీవ్రరూపం దాల్చినపుడు నీటిని అందించే సింగూరు, మంజీరా జలాశయాల నుంచి ప్రతిరోజు సుమారు 50 ఎంజిడిల నీటిని నగరానికి తరలించేవారు. కానీ గత మూడు దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా సంగూరు జలాశయంలో నీటి మట్టం పూర్తిగా పడిపోవటంతో జలాలు ఇచ్చేందుకు మెదక్ జిల్లా అధికారులు ససేమిరా అంటున్నారు. గత కొద్దిరోజుల క్రితమే నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించటంతో జలమండలి అధికారులు ముఖ్యమంత్రిని ఆశ్రయించటంతో ఈ నెల 29వరకు నీటిని సరఫరా చేయాలని, లేని పక్షంలో నగరవాసుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతుందని ముఖ్యమంత్రి సూచించటంతో అధికారులు ఇప్పటివరకు నీటిని సరఫరా చేస్తూ వచ్చారు. మరో వైపు అధికారులు ప్రత్యామ్నాయంగా 28 ఎండిజిల గోదావరి జిలాలలను నగరానికి ఇప్పటికే తీసుకువచ్చినా, దీంతో కొన్ని ప్రాంతాలకు మాత్రమే తాగునీటిని అందించగల్గుతున్నారు. ఈ క్రమంలో లింగంపల్లి రిజర్వాయర్‌కు మరో 28 ఎంజిడిల నీటిని మంగళవారం తరలించేందుకు పనులు చేపట్టారు. ఈ నీరు నగరానికి చేరితే లింగంపల్లి, కూకట్‌పల్లి, అల్వాల్, కుత్బుల్లాపూర్ ప్రాంతాలకు ప్రస్తుతం పదిరోజులకోసారి జరుగుతున్న మంచినీటి సరఫరా రెండురోజులకోసారి చేపట్టేందుకు ఆస్కారముంటుంది. దీనికి తోడు కృష్ణా జలాల మూడో దశ తరలింపు పనులు కూడా త్వరలోనే పూర్తయి మరో మూడు రోజుల్లో 40 ఎంజిడిల నీరు నగరానికి చేరునున్నట్లు జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ డా.బి. జనార్ధన్‌రెడ్డి తెలిపారు. దశల వారీగా గోదావరి, కృష్ణా నదులు నుంచి తరలిస్తున్న నీటికి సంబంధించి ఇప్పటి వరకు ఓ దశ గోదావరి జలాలను తరలించే రింగ్ మెయిన్ తాము అనుకున్న విధంగానే పనిచేస్తుందని, మరో 28 ఎంజిడిల నీరు నగరానికి నేడు చేరటంతో మరికొన్ని ప్రాంతాలకు సరఫరా అందించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఫిర్యాదుల వెల్లువ
నగరంలోని వివిధ ప్రాంతాలు, శివార్లలో మంచినీటి సమస్యపై ప్రతిరోజు జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ డా.బి. జనార్ధన్‌రెడ్డికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో నివసించే విఐపిలు సైతం తమ ప్రాంతంలో మంచినీటి సరఫరా కావటం లేదని, మరికొన్ని ప్రాంతాల నుంచి ప్రజాప్రతినిధులు, సామాన్య ప్రజలు సైతం నేరుగా ఆయన సెల్‌ఫోన్‌కు మంచినీటి సమస్యపై మేసేజ్‌లు పంపుతున్నట్లు తెలిసింది.
వారం, పదిరోజుల్లో ఊరట
ప్రస్తుతం నగరంలో మంచినీటి సమస్య తీవ్ర రూపం దాల్చనుందన్న వాదనకు జలమండలి ఎండి జనార్ధన్‌రెడ్డి సైతం ఏకీభవిస్తున్నారు. ఇప్పటికే సింగూరు, మంజీరాల నుంచి తరలిస్తున్న నీటిని త్వరలోనే అక్కడి అధికారులు నిలిపివేయనున్నారు. ఈ నెల 29వరకే వారు సరఫరా చేస్తామని చెప్పినా, వారికి నచ్చజెప్పి, సోమవారం కూడా కొంత నీటిని తరలించగలిగామని వివరించారు. నగరంలో నీటి సమస్యను దృష్టిలో పెట్టుకుని ప్రతి మనిషి నీటి వృథాను అరికట్టి, పొదుపు చేసుకోవాల్సిన అవసరముందని ఆయన సూచించారు.
త్వరలోనే కృష్ణాజలాల మూడో దశ తరలింపు పనులు పూర్తయి నగరానికి 40 ఎంజిడిలు, గోదావరి నుంచి మరో 28 ఎంజిడిల నీటిని తరలించేందుకు వారం, పదిరోజుల సమయం పడుతుందని, ఆ తర్వాత సమస్య నుంచి కాస్త ఊరట కల్గుతోందని వివరించారు. దీనికి తోడు వచ్చే వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే కార్యాచరణను సిద్ధం చేస్తున్నామని ఆయన వివరించారు.