హైదరాబాద్

నేడు నీటి సరఫరా ఉండని ప్రాంతాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాంద్రాయణగుట్ట: గ్రేటర్ హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీరుస్తున్న గోదావరి ప్రాజెక్ట్ ఫేజ్-1 నీటి సరఫరాకు సంబంధించి ఈనెల 7న ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి పనె్నండు గంటల పాటు ఘన్‌పూర్ రిజర్వాయర్ వద్ద చేపడుతున్న మిగిలిన జంక్షన్ పనుల నిర్మాణం, పైప్ లైన్ ఏర్పాటు వంటి పనుల కారణంగా నీటి సరఫరాను నిలిపి వేస్తున్నట్లు జలమండలి అధికారులు శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఫలితంగా అనేక ప్రాంతాల్లో ఆదివారం నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
7న నీటి సరఫరా ఉండని ప్రాంతాలు: ఎర్రగడ్డ, ఎల్లారెడ్డిగూడ, వెంగళ్‌రావునగర్, యూసుఫ్‌గూడ, సోమాజిగూడ, వెంకటగిరి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బోరబండ, ఎస్‌పిఆర్ హిల్స్ ప్రాంతాలు, సనత్‌నగర్, ప్రకాష్‌నగర్ ప్రాంతాలు, కూకట్‌పల్లి, కూకట్‌పల్లి హౌజింగ్ బోర్డు, బాలనగర్, భాగ్యనగర్, నిజామ్‌పేట ప్రాంతాలు, ఆల్వీన్ కాలనీ, జగద్గిరిగుట్ట, ఆదర్శ్‌నగర్, షాపూర్‌నగర్, రోడామిస్ర్తీనగర్, హెచ్‌ఎంటి కాలనీ, సూరారం, చింతల్, జీడిమెట్ల, సుభాష్‌నగర్ ప్రాంతాలు, హఫీజ్‌పేట, చందానగర్, మియాపూర్, రామచంద్రాపురం, అశోక్‌నగర్, బొల్లారం, శేరిలింగంపల్లి మదాపూర్.
ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి చేయాలి
మంత్రి మహేందర్‌రెడ్డి
ఆంధ్రభూమిబ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 6: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎంతో నమ్మకంతో ప్రజలు గతంలో ఎన్నడూ లేని విధంగా టిఆర్‌ఎస్‌ను బలపరిచినందున వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధికి సహకరించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి డాక్టర్ పి.మహేందర్‌రెడ్డి అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో విజయం సాధించిన నూతన కార్పొరేటర్‌లు ఆయనను కలిశారు. ఈ సందర్భంగా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు అను నిత్యం కృషి చేస్తారని చెప్పారు. హైదరాబాద్ పరిసరాల్లోని రంగారెడ్డి జిల్లా శివారు ప్రాంతాలకు వౌలిక సదుపాయాలను కల్పించి మహర్దశను అందిస్తారని, అందుకు ఎన్నినిధులైనా కేటాయిస్తారని అన్నారు. ఎన్నికల విజయం తమ బాధ్యతలను మరింత పెంచాయని ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామని, ప్రతి కార్పొరేటర్ ప్రజలతో మమేకమై పనిచేయాలని సూచించారు. స్థానికంగా ఉండే మంచినీరు, రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణాలతో పాటు ప్రజాసమస్యలను గుర్తించాలని అన్నారు. గోదావరి ఫేజ్-1, కృష్ణా పేజ్-3లతో నగర శివారు ప్రాంతాల ప్రజల దాహార్తి తీరుస్తామని ఇందుకు 1900 కోట్లు కేటాయించామని వివరించారు. ముఖ్యంగా నగర శివారులోని రంగారెడ్డి జిల్లా పరిసరాల్లోని పారిశ్రామికవాడల్లో కనీస వసతులు లేకుండా జీవనయానం చేస్తున్న నేపథ్యంలో వారికి అవసరమైన అభివృద్ధి వేగవంతం చేయాలని అన్నారు. ఎమ్మెల్సీలు నరేందర్‌రెడ్డి, రాజు, ఎమ్మెల్యే కాలే యాదయ్య, పార్టీ నాయకులు, చంపాపేట, శేరిలింగంపల్లి, చందానగర్, మైలార్‌దేవ్‌పల్లి, అత్తాపూర్, రాజేంద్రనగర్, కార్పొరేటర్‌లు, టిఆర్‌ఎస్ నాయకులు స్వర్ణలతారెడ్డి, మువ్వా సత్యనారాయణ పాల్గొన్నారు.

ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే తీర్పు: తలసాని
బేగంపేట, ఫిబ్రవరి 6: గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలు ప్రతిపక్ష పార్టీలకు దిమ్మతిరిగే తీర్పునిచ్చారని ఇది దేశ చరిత్రలో మొదటిసారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం ఆయన నివాసంలో కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్ల అభినందనసభను ఏర్పాటు చేసిన సందర్భంగా మాట్లాడుతూ, సనత్‌నగర్ నియోజకవర్గ ప్రజలకు తాను ఋణపడి వుంటానని అన్నారు. ఏ.పి సిఎం చంద్రబాబు, లోకేష్ గ్రేటర్ ప్రజలకు ఏదో చేస్తానని చెప్పినా ప్రజలు నమ్మలేదని, వారికి డిపాజిట్లు గల్లంతు చేసారని, కాంగ్రెస్ పరిస్థితి చెప్పనవసరం లేదని తలసాని అన్నారు. ఎన్నికైన కార్పొరేటర్లు ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా పనిచేయాలన్నారు. సమావేశంలో బేగంపేట, రాంగోపాల్‌పేట, బన్సీలాల్‌పేట, అమీర్‌పేట, సనత్‌నగర్ కార్పొరేటర్లు లక్ష్మి బాల్‌రెడ్డి, అరుణాగౌడ్, హేమలత, శేషుకుమారి, తరణి, ఆకుల రూప పాల్గొన్నారు.