తెలంగాణ

ఉపాధి కల్పన కేంద్రాలుగా ఇక పోస్ట్ఫాసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 11: దేశంలో నిరుద్యోగ యువత పేర్లను నమోదు చేసుకుని వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజీలుగా ఇక మీదట పోస్ట్ఫాసులూ పనిచేయనున్నాయి. ఇందుకోసం ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజీల నమూనాను మార్చి నేషనల్ కెరీర్ సర్వీసులుగా రూపొందించారు. ఇవి ఇపిఎఫ్‌ఒ పెన్షనర్లకు జీవన్ ప్రమాణ్ ఫెసిలిటీ కేంద్రాలుగా కూడా పనిచేస్తాయి. ఇందుకోసం కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖకు, తపాలా శాఖకు మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదరనుంది. ఈ ఒప్పందం కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ సమక్షంలో ఇరు శాఖల అధికారుల మధ్య ఆదివారం కుదురుతుందని తపాలా శాఖ అధికారులు తెలిపారు.
ఇద్దరు ఎస్‌ఐల సస్పెన్షన్?
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 11: సివిల్ తగాదాలో జోక్యం చేసుకున్న ఇద్దరు ఎస్‌ఐలపై వేటు పడింది. మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ స్థల వివాదంలో మీర్‌పేట పోలీసులు జోక్యం చేసుకుని తనపై దాడి చేశారని సంతోశ్‌రెడ్డి అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన పోలీస్ ఉన్నతాధికారులు ఇద్దరు ఎస్‌ఐలను సస్పెండ్ చేశారు. ఇప్పటికే సివిల్ తగాదాలో జోక్యం చేసుకున్న ఏసిపి రాములు నాయక్‌ను బదిలీ చేసిన సంగతి తెలిసిందే. రాజశేఖర్, జీవన్ ప్రసాద్ అనే ఎస్‌ఐలు సస్పెన్షన్‌కు గురైనట్టు, జీవన్‌ప్రసాద్ పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది.