హైదరాబాద్

అధ్వాన్నంగా అంతర్గత రహదారి వ్యవస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముషీరాబాద్, ఫిబ్రవరి 12: అంతర్గత రహదారి వ్యవస్థ అధ్వాన్నంగా మారటంతో వాహననాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మరోవైపు ప్రధాన రహదారులు, కూడళిలోని ‘మలుపులు’ ట్రాఫికర్‌కు నిలయాలుగా మారుతున్నాయి. అసలే ఇరుకైన రోడ్లు.. మలుపుల వద్ద బస్సుకు బస్సు ఎదురైతే చాలు వెనుకవైపు ఉన్న వాహనాలు బారులుతీరుతున్నాయి. సిగ్నల్స్ వద్ద మలుపుల వద్ద ఇబ్బందులతో గ్రీన్‌సిగ్నల్ పడినా వాహనాలను ముందుకు కదిలించలేని పరిస్థితి నెలకొంటుంది. సికింద్రాబాద్ నుంచి ప్రధానకేం ద్రాలైన కోఠి, లక్డీకాపూల్, దిల్‌సుఖ్‌నగర్ తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సు రూట్లలో మలుపుల వద్ద బస్సుల కారణంగా ద్విచక్ర వాహనదారులు ట్రాఫికర్ కోరల్లో చిక్కుకుపోతున్నారు. బస్సు రూట్ నెంబర్ 86 ప్రయాణాంచే మార్గంలో సితాఫల్‌మండి చౌరస్తా, వారాసిగూడ, బౌద్దనగర్, జామైఉస్మానియా, విఎస్‌టి క్రాస్‌రోడ్ మలుపులు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. అసలు ఇక్కడ ఫ్రీలెప్ట్ అమలుకావటంతోనే సమస్యలు తలెత్తుతున్నాయని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక బస్సు రూట్ నెంబర్ 40 ప్రయాణించే మార్గంలో కవాడిగూడ, పద్మశాలికాలని, ఆశోక్‌నగర్ క్రాస్‌రోడ్, హిమాయత్‌నగర్ మార్గం సమస్యాత్మకంగా మారింది. అసలే నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారులలో మలుపుల విషయంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థలసేకరణకు అనువుగా ఉన్న ప్రాంతాలను సైతం గుర్తించటానికి సంభందిత శాఖలు నిర్లక్ష్యం చేస్తుండటమే కారణంగా తెలుస్తోంది. ఫ్రీలెఫ్ట్ విధానాన్ని సక్రమంగా అమలు చేస్తే మలుపుల వద్ద ప్రమాదాలు, డ్రాఫిక్ జాం నియంత్రించవచ్చని వాహనదారులు కోరుతున్నారు.

ట్రంప్ నిర్ణయం భారత్ విద్యార్థులకు ఇబ్బందే

ఖైరతాబాద్, ఫిబ్రవరి 12: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు భారత విద్యార్థులు, ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపనున్నాయని తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ పేరెంట్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.రాజు కుమార్ మాట్లాడారు. గతంలో భారత్ నుంచి విద్యను అభ్యసించేందుకు అమెరికాకు వెళ్లిన విద్యార్థులకు ఓటిపి కింద ఏడాది పాటు పనిచేసుకునే అవకాశం ఇచ్చేవారని, అనంతరం మరో 24 నెలలు పొడిగింపు లభించేదని చెప్పారు.
కాగా ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం వాటిని కుదించేస్తున్నారని అన్నారు. దీంతో స్వదేశంలో లక్షల కొద్ద్దీ అప్పు చేసి అమెరికా వెళ్లిన విద్యార్థి ఖాళీగా తిరుగుముఖం పట్టడం ఇక్కడి తల్లిదండ్రులకు పెనుభారంగా ఉంటుందని పేర్కొన్నారు. వీటితో పాటు వీసాలు, గ్రీన్‌కార్డు జారీల్లో భారీ కోతలు ఉండటం వంటి చర్యలు కూడా భారత్ పౌరులను తీవ్ర ఇరకాటంలో పెట్టేవేనని చెప్పారు. సీనియర్ జర్నలిస్టు నర్సింహారావు మాట్లాడుతూ ప్రపంచీకరణ కాంక్షించిన అగ్ర రాజ్యం ప్రస్తుతం దానే్న వ్యతిరేకించడం దారుణమని అన్నారు. ట్రంప్ నిర్ణయాలతో అమెరికాలో నివసించే భారతీయులు ఇబ్బందులకు గురికావడం కొద్దిమేర తప్పక పోవచ్చునని, అదే సమయంలో పూర్తిగా భారతీయులను పంపించివేసే సాహసం అమెరికా చేయలేదని చెప్పారు. దీనికి ఎన్నో ఆర్థికపరమైన వ్యవహారాలు ముడిపడి ఉండటంతో పాటు నైపుణ్యం కలిగిన ఉద్యోగులలేమి కూడా భారతీయులకు కలిసి వచ్చే అంశం అన్నారు. అమెరికా వద్దంటుందని ఇక్కడి తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అమెరికా కంటే ఎంతో గొప్పదేశం భారత్ అని ఇక్కడే తమ పిల్లల్ని ఉద్యోగాలు చేసుకునేలా ప్రోత్సహించాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు కనకయ్య, రాజ్‌కుమారి, శ్రీనివాసులు పాల్గొన్నారు.