హైదరాబాద్

నిర్లక్ష్యంపై వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 13: మహానగర ప్రజలకు అతి ముఖ్యమైన పౌర సేవలందించే బల్దియా బాసు కమిషనర్ చేసిన ఫిర్యాదుకే అతీగతీలేదు. కనీసం ఫిర్యాదు చేసిందెవరో కూడా తెల్సుకోలేని ఇంజనీర్లు విధులు నిర్వహించటం దురదృష్టకరం. వీధి దీపాలు సక్రమంగా వెలగటం లేదంటూ సాక్షాత్తు బల్దియా కమిషనర్ జనార్దన్ రెడ్డి ఫిర్యాదు చేసినా, పట్టించుకోని ఓ అసిస్టెంటు ఇంజనీర్ నిర్లక్ష్యంపై కమిషనర్ సస్పెన్షన్ వేటు వేశారు. దేశ, విదేశాల్లోని హైదరాబాదీలు ఎంతో ఆసక్తితో ఈ మై జిహెచ్‌ఎంసి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని సేవలు పొందుతుండగా, జిహెచ్‌ఎంసి ఇచ్చిన సెల్‌ఫోన్లను, ఇంటర్నెట్ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్న ఇంజనీర్ కనీసం తనకందిన ఫిర్యాదును ఏ మాత్రం పట్టించుకోవటం లేదనే విషయం కమిషనర్ నిర్వహించిన ఈ స్ట్రింగ్ ఆపరేషన్‌లో తేలింది. ఇక ప్రజలు సమర్పించే ఫిర్యాదులను జిహెచ్‌ఎంసి అధికారులు ఏ మేరకు పట్టించుకుంటారో అంచనా వేసుకోవచ్చు. ఈ నెల 10వ తేదీన హోటల్ మారియెట్‌లో అర్బన్ సిటీ సమ్మిట్ సమావేశానికి హాజరై తిరిగి ప్రధాన కార్యాలయంలో వెళ్తున్న కమిషనర్‌కు ట్యాంక్‌బండ్‌పై ఓ వీధి లైటు వెలగకపోవటాన్ని గమనించారు. వెంటనే దాన్ని ఫొటో తీసి ‘మై జిహెచ్‌ఎంసి’ యాప్‌కు అప్‌లోడ్ చేసి, స్థానిక అసిస్టెంటు ఇంజనీర్ రమేశ్‌కు పంపారు. ఫిర్యాదు చేసిన తర్వాత సంబంధిత అధికారుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందోనని వేచి ఉన్న కమిషనర్‌కు సోమవారం ఫోన్ చేసి మూడు రోజుల క్రితం వీది ధీపాలు వెలగటం లేదని ఫిర్యాదు చేశారు..మీరెవరు? అన్ని ప్రశ్నించటంతో కమిషనర్ నిర్ఘాంతపోయారు. కనీసం ఫిర్యాదు చేసిందెవరో కూడా తెల్సుకోకపోవటం, విధి నిర్వహణలో ఇంతటి నిర్లక్ష్యం ప్రదర్శించినందుకు సదరు అసిస్టెంటు ఇంజనీర్ రమేశ్‌ను సస్పెన్షన్ చేస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పరిణామం ఇంజనీర్లలోనే గాక, వివిధ విభాగాలకు సంబంధించి క్షేత్ర స్థాయి విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందిని షాక్‌కు గురి చేసింది. ఈ రకంగా తరుచూ ఫిర్యాదులు చేస్తూ, తమ ఫిర్యాదుకు కింది స్థాయి అధికారులు ఏ మాత్రం స్పందిస్తున్నారన్న విషయంపై ఈ రకంగా తరుచూ దృష్టి సారిస్తే అధికారులు అప్రమత్తంగా ఉంటారని, ఫలితంగా ప్రజల చేసే ఫిర్యాదులకు అధికారుల నుంచి మంచి స్పందన వస్తోందని నగరవాసులంటున్నారు. మ

అంతకన్నా ఎక్కువ గడువు పడితే
దరఖాస్తుదారుడికి తెలపాలి

‘మీ కోసం’లో కలెక్టర్ రాహుల్ బొజ్జా

హైదరాబాద్, ఫిబ్రవరి 13: ప్రజాసమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం జిల్లా యంత్రాంగం నిర్వహిస్తున్న ‘మీ కోసం’ కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులను వారం రోజుర్లో పరిష్కరించేందుకు ప్రయత్నించాలని కలెక్టర్ రాహుల్ బొజ్జా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘మీ కోసం’ కార్యక్రమంలో పెన్షన్లు, ఇళ్లు, ఉద్యోగాలు తదితర అంశాలకు సంబంధించి ప్రజల నుంచి వినతిపత్రాలను కలెక్టర్ స్వీకరించారు. ఇందులో భాగంగా సికిందరాబాద్‌లోని ఆర్పీ రోడ్డుకు చెందిన వెంకటేశ్వర్‌రావు తాము హెచ్‌ఎంటి లిమిటెడ్‌లో రిటైర్డు ఉద్యోగి అన్న కారణంతో పెన్షన్ నిలిపివేశారని, తనకు తిరిగి చెల్లించాలని కోరారు. ఇందుకు స్పందించిన కలెక్టర్ విచారణ చేయాలని సంబంధిత తహసిల్దార్‌ను ఆదేశించారు. ఆసిఫ్‌నగర్ మండలం మల్లేపల్లి ప్రాంతానికి చెందిన లక్ష్మీనారాయం తాను స్వయం ఉపాధి యూనిట్ స్థాపన కోసం బిసి కార్పొరేషన్‌కు దరఖాస్తు చేసుకున్నానని, తనకు త్వరగా రుణం ఇప్పించాలని కోరగా, బిసి కార్పొరేషన్ అధికారులు తగిన చర్య తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. తిరుమలగిరి మండలంలోని సర్వే నెంబర్ 114లోని సాయిబాబా హట్స్ నివాసులు తాము గత 30 ఏళ్లుగా అక్కడ నివాసముంటున్న ప్రభుత్వం తమకు పట్టాలు జారీ చేయలేదని, వెంటనే పట్టాలివ్వాలని కోరారు. సంబంధిత తహసిల్దార్ ఈ అంశాన్ని పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ ఎం.ప్రశాంతి మాట్లాడుతూ ప్రభుత్వ భూముల పరిరక్షణ బాధ్యత తహసిల్దార్లదేనని, ఖాళీగా ఉన్న ప్రతి ప్రభుత్వ భూమిలో అది ప్రభుత్వ భూమి అంటూ తెలిసేలా బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్వో సతీష్‌చంద్ర, పరిపాలనాధికారి జహురుద్దిన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.