హైదరాబాద్

నిర్లక్ష్యపు నీడలో సర్కారు వైద్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 13: నిర్లక్ష్యానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన నగరంలో ప్రభుత్వాసుపత్రులకు సర్కారు పుష్కలంగా నిధులు కేటాయించినా, నిర్లక్ష్యపు జబ్బు తగ్గడం లేదు. ప్రతి ఏటా పుష్కలంగా నిధులు కేటాయిస్తున్నా, నగరంలోని ఏ సర్కారు ఆసుపత్రిలోనూ వౌలిక వసతులు మెరుగపడటం లేదు. ప్రతిరోజు వేలాది మంది ఇన్ పేషెంటు, ఔట్ పేషెంట్ల రద్దీగా బిజీగా ఉండే నిలోఫర్ ఆసుపత్రికి కొత్త భవనం సమకూరి ఏళ్లు గడుస్తున్నా, అందులో ఇంకా సేవలు అందుబాటులోకి రాకపోవటం ఆసుపత్రి వర్గాల అలసత్వసం, ప్రభుత్వ పర్యవేక్షణ లోపానికి నిదర్శనం. ఇటీవలే నగరంలోని ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులతో పాటు నిలోఫర్ ఆసుపత్రిలో సంభవించిన మరణాలే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఈ మరణాలన్నీ కూడా రోగులకు కనీస వసతులు అందక సంభవించటం గమనార్హం. మూడేళ్ల క్రితం కొత్త రాష్ట్రంలో ప్రభుత్వం మొట్టమొదటి సారిగా ప్రవేశపెట్టిన స్వల్పకాలిక బడ్జెట్‌లో నగరంలోని వివిధ ప్రభుత్వ ఆస్పత్రులకు సుమారు రూ. 305 కోట్లు కేటాయించినా, వాటిని సద్వినియోగం చేసుకుని రోగులకు మెరుగైన వైద్యం అందించటంలో ఆసుపత్రి వర్గాలు విఫలమవుతున్నాయి. దీనికి పాలకుల పర్యవేక్షణ లోపం కూడా కారణమని చెప్పవచ్చు. తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటి సారిగా 2014 నవంబర్ మాసంలో ప్రవేశపెట్టిన స్వల్పకాలిక బడ్జెట్‌లోనే నగరంలోని ఆసుపత్రులకు కేటాయించిన రూ. 305 కోట్లను వినియోగించుకోలేని ప్రభుత్వాసుపత్రులు ఇపుడు తాజాగా ప్రభుత్వ రూపకల్పన చేస్తున్న 2017-18 బడ్జెట్‌కు ప్రతిపాదనలు పంపేందుకు సిద్దమవుతున్నాయి. ఒక్కసారి నిధులను కేటాయించి పాలకులు తమ పనైపోయిందనుకుని చేతులు దులుపేసుకుంటున్నారు. కేటాయించిన నిధులను వెచ్చిస్తున్న తీరుపై కనీసం మూడు నెలలకోసారైనా సమీక్షలు నిర్వహిస్తూ, క్షేత్ర స్థాయిలో అందిస్తున్న సేవలను తనిఖీ చేస్తే ప్రజలు ఆశించిన స్థాయిలో కాకపోయినా, కనీస వసతులనైనా అందించేందుకు వీలుగా సర్కారు వైద్యం అందుబాటులోకి వస్తుందని నగరవాసులంటున్నారు.
కనీస వసతులు సైతం కరవు
నిలోఫర్ ఆసుపత్రిలో గతంలో ఒకే సిరంజితో ముప్పై మంది చిన్నారులకు ఇంజక్షన్ చేసి సిబ్బంది పసి ప్రాణాలతో చెలగాటమాడిన సంఘటన మరవక ముందే కొద్ది రోజుల క్రితం వరుసగా ఐదుగురు బాలింతలు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. ఉస్మానియా ఆసుపత్రిలో వెయ్యి రూపాయల నుంచి రెండు వేల మధ్య ఖరీదు చేసే ఫ్లో మీటర్లు సిలెండర్లకు లేకపోవటం రోగులకు కావల్సిన మోతాదులో ఆక్సిజన్ అందక ఒకే రోజు తొమ్మిది మంది మృతి చెందిన సంఘటన విధితమే. అంతకు ముందు స్వైన్‌ఫ్లూ సోకిన రోగికి చికిత్స అందిస్తూ జూనియర్ డాక్టర్ ధనుంజయ్ కూడా వ్యాధి బారిన పడ్డారంటే ఈ ఆసుపత్రుల్లో కనీసం వైద్యులకు సైతం వ్యాధి నివారణ ప్రమాణాలు ఏ మాత్రం ఉన్నాయో అంచనా వేసుకోవచ్చు. అలాగే గాంధీ ఆస్పత్రిలో కొద్ది రోజుల క్రితం పాడైన సెలైన్ ఎక్కించినందుకు ప్రవల్లిక అనే చిన్నారి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. ఇక వాతావరణం చల్లబడిందంటే చాలు నగరంలో స్వైన్ ఫ్లూ విజృంభించే సమయాల్లో అనుమానిత లక్షణాలతో ఆసుపత్రికి వచ్చే ఎక్కువ మంది రోగులకు నాణ్యమైన మాస్కులను కూడా అందుబాటులో లేని పరిస్థితులున్నాయి. ప్రతి ఆర్థిక సంవత్సరం నగరంలోని సర్కారు ఆసుపత్రులకు ప్రభుత్వం పుష్కలంగా నిధులు కేటాయిస్తున్నా ప్రజలు ఆశించిన స్థాయిలో సేవలు దక్కటం లేదు. ఇందుకు ఇటీవల నిలోఫర్ ఆస్పత్రిలో చోటుచేసుకున్న ఘటనే నిదర్శనంగా చెప్పవచ్చు.

హుమాయూన్‌నగర్‌లో యువకుడి దారుణ హత్య
కుటుంబ తగాదాలే కారణం:పోలీసులు

హైదరాబాద్, నార్సింగ్, ఫిబ్రవరి 13: హుమాయూన్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. హైదరాబాద్ మాసాబ్‌ట్యాంక్ అస్లాం బస్తీకి చెందిన ఆతిక్ ఖురేషీ మటన్ షాపు నిర్వహిస్తున్నాడు. ఖురేషికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా ఐదు నెలల క్రితం ఖురేషి భార్య అనారోగ్యంతో మృతి చెందింది. అయితే ఆమె మృతికి భర్త వేధింపులే కారణమంటూ సోమవారం సాయంత్రం ఇద్దరు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఖురేషి అక్కడిక్కడే మృతి చెందాడు. కుటుంబ తగాదాలే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు హుమాయూన్‌నగర్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు.