హైదరాబాద్

కల్తీ పాల దందాలో 11మంది అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 14: రాచకొండ కమిషనరేట్ పరిధిలో కల్తీ పాల దందా చేస్తున్న 11 మందిని అరెస్టు చేశామని సిపి తెలిపారు. పాలలో హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి విక్రయిస్తున్నారని, గత పదేళ్లుగా కల్తీపాల దందా జరిగినట్టు ఆయన చెప్పారు. పాలలో కలిపేందుకు సిద్ధంగా ఉన్న 425 కేజీల లిక్విడ్ హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను సీజ్ చేసినట్టు రాచకొండ సిపి మహేశ్ భగవత్ తెలిపారు.
హత్య కుట్ర భగ్నం

పార్కుల్లో సమస్యలన్నీ పరిష్కారం
నిర్వహణకు ముందుకొస్తున్న కాలనీ సంక్షేమ సంఘాలు

హైదరాబాద్, ఫిబ్రవరి 14: రోజురోజుకీ కాలుష్యం పెరిగిపోతున్న నగరంలో ప్రజలకు కాస్త ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించే పార్కుల్లో సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని జిహెచ్‌ఎంసి కమిషనర్ డా.బి.జనార్దన్ రెడ్డి ఆదేశించారు.
ఇందిరాపార్కుల్లో చోటుచేసుకున్న సమస్యలను పలువురు వాకర్లు అధికారులు, కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. వీటిపై స్పందించిన కమిషనర్ పార్కుల్లో కూలిన చెట్లు, మట్టికుప్పలను నాలుగైదు రోజుల్లోగా తొలగించాలని సూచించారు. పార్కు ఆవరణలో కొందరు షటిల్, ఫుట్‌బాల్ వంటి క్రీడలు ఆడుతున్నారని, దీని వల్ల గార్డెన్‌లో పచ్ఛదనం ధ్వంసకావటంతో పాటు పార్కును సందర్శించే వారికి తీవ్ర అసౌకర్యం ఏర్పడుతుందని, దీన్ని నివారించాలన్నారు. వాకర్స్‌తో పాటు సందర్శకులకు ఇబ్బందిగా ఉన్న ఈ ఫుట్‌బాల్, షటిల్ క్రీడలను ఆడకుండా చర్యలు తీసుకోవటానికి అవసరమైతే పోలీసు శాఖ సహాయాన్ని కూడా పొందాలని కమిషనర్ సూచించారు.
ఇందిరాపార్కును సందర్శించే పలువురు పావురాలకు ఆహారాన్ని వేస్తున్నందున ఇతర పక్షులు పార్కు ఆవరణలోకి రావటం లేదని, దీతో పాటు పావురాలు అధికంగా రావటం వల్ల వాకర్స్‌లో కొందరికి శ్వాస సంబంధిత సమస్యలు ఏర్పడుతున్నాయని బయోడైవర్శిటీ అధికారులు కమిషనర్‌కు వివరించారు. ఈ సమస్య వల్ల ఇందిరాపార్కులో పావురాలకు ఆహారాన్ని అందించటాన్ని నిషేధించామని తెలిపారు.
ఇదిలా ఉండగా, ఖైరతాబాద్ సర్కిల్‌లోని పద్మావతినగర్ పార్కు నిర్వాహణను చేపట్టడానికి పద్మావతి కాలనీ సంక్షేమ సంఘం ముందుకు వచ్చిందని బయోడైవర్శిటీ అధికారులు పేర్కొన్నారు. ఫిబ్రవరి 13న కాలనీ సంక్షేమ సంఘంతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు అంగీకారం కుదిరందని, పార్కులో బోరుబావిని తవ్వించి పార్కు నిర్వహణను కాలనీ సంక్షేమ సంఘానికి అందించనున్నట్లు వివరించారు. దీంతో పాటు పార్కులో ఉన్న వ్యర్థాలను పూర్తిగా తొలగిస్తున్నట్లు స్పష్టం చేశారు.