హైదరాబాద్

బిల్లు కట్టలేదని కరెంట్ కట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైదాబాద్,్ఫబ్రవరి14:ట్రాన్స్‌కో సిబ్బంది అత్యుత్సాహం వసతి గృహ అంధులను ఇబ్బందులకు గురిచేసింది. కరెంట్ బిల్లు కట్టలేదని అంధుల వసతి గృహానికి కరెంట్ సరఫరా కట్‌చేయడంతో అంధుల వెతలువర్ణనాతీతం అయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మూసారాంబాగ్‌లో నిర్వహిస్తున్న ప్రభుత్వ అంధుల వసతి గృహంలో 200మంది ఆవాసం పొందుతున్నారు. వసతి గృహ ఖర్చులు, వివిధ బిల్లులు వార్డెన్ జమ చేస్తుంటారు. శాఖాపరంగా ఈ వసతి గృహానికి అక్టోబర్‌లో నిధులు మంజూరు కావటంతో వార్డెన్ అప్పటి వరకు ఉన్న కరెంట్ బిల్లును చెల్లించారు. తరువాత మూడు నెలలుగా నిధులు మంజూరు కాకపోవడంతో కరెంట్ బిల్లు చెల్లించలేదు. దాంతో మంగళవారం వసతిగృహానికి కరెంట్ నిలిపివేసారు.ప్రభుత్వ శాఖకే చెందిన అంధుల వసతి గృహం కదా ఎందుకు నిలిపివేస్తారని ప్రశ్నిస్తే తమకు నెలవారి వసూళ్ళ లక్ష్యాలు ఉంటాయని, అంధుల వసతి గృహమైనాసరే కరెంట్ సరఫరా నిలిపివేయాలని తమ అధికారులు చెప్పినందునే కట్ చేస్తున్నామని లైన్‌మెన్ సమాధానమిచ్చారు. కరెంటు నిలిపివేతతో మంగళవారం అందులో ఆశ్రయం పొందుతున్న 200 మంది తీవ్ర అవస్థలు ఎదుర్కున్నారు. తాగునీరు కోసం భవనం ముందు ఉన్న సెల్లార్‌లోకి ప్రమాదకరంగా ఒంగి సీసాల్లో నీరు నింపుకున్నారు. మోటార్లు, ఫ్యాన్లు పనిచేయకపోవడంతో చాలా ఇబ్బందులు పడ్డామని వారు ఆవేదన వ్యక్తం చేసారు. అంధులమనే మాననీయ కోణం కూడా లేకుండా ట్రాన్స్‌కో అధికారులు వ్యవహరించిన తీరు తమని బాధిస్తోందన్నారు. ఆస్మాన్‌ఘాడ్ సబ్ డివిజన్ పరిధిలో పదుల సంఖ్యలో ప్రైవేట్ వసతి గృహాలున్నాయి. అనధికారికంగా గృహవసరాల కరెంట్ కనెక్షన్ తీసుకుని వ్యాపారం నిర్వహించే వారితో కుమ్మక్కై వారిని వదిలిపెట్టి ప్రభుత్వ శాఖచే నిర్వహించే తమ వసతి గృహాల సరఫరా ఎలా నిలిపివేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. మంగళవారం సాయంత్రం వసతి గృహ వార్డెన్ ఆస్మాన్‌ఘాడ్ ట్రాన్స్‌కో కార్యాలయానికి వెళ్ళి త్వరలో బిల్లు చెల్లిస్తామని రాసి ఇవ్వడంతో తిరిగి కరెంట్‌ను పునరుద్ధరించారు. ట్రాన్స్‌కో అధికారులు మరోసారి ఇలా ప్రవర్తించకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని అంధులు కోరుతున్నారు.
భూగర్భ డ్రైనేజీని నిర్మించాలి

సర్పంచ్‌కు బాబానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వినతి
రెండురోజుల్లో పనులు
ప్రారంభిస్తామని హామీ

హైదరాబాద్, ఫిబ్రవరి 14: నగర శివారులోని నారపల్లిలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్ధను నిర్మించి, వెంటనే ప్రజలకు అందుబాటులోకి తేవాలని స్థానిక బాబానగర్ వెల్ఫేర్ అసోసియేషర్ స్థానిక సర్పంచ్ నుర్వి రవీందర్‌ను కోరింది. ఈ మేరకు అసోసియేషన్ ప్రతినిధుల బృందం మంగళవారం ఆయన్ను కలిసి వినతిప్రతం కూడా సమర్పించింది. ఇందుకు సానుకూలంగా స్పందించిన సర్పంచ్ రెండురోజుల్లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభిస్తామని హామీ ఇచ్చినట్లు అసోసియేషన్ ప్రతినిధుల బృందం పేర్కొంది. ఈ సందర్భంగా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె. విజయసింహారావు, జె. మధుకర్‌లు గ్రామ సమస్యల గురించి సర్పంచ్‌కు వివరిస్తూ కాలనీలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ సమస్య అధికంగా ఉందని తెలిపారు. కాలువ పనులు పూర్తికాకపోవటంతో అయిదో నెంబర్ రోడ్డులో మురుగునీరు పొంగి రోడ్లపై ప్రవహిస్తుందని వివరించారు. రోడ్లపై మురుగురు నీరు ప్రవహించటం, కొన్ని చోట్ల రోజుల తరబడి నిల్వ ఉండటంతో దోమల బెడద కూడా పెరిగిందని వాపోయారు. గతంలో అనేక సార్లు స్థానిక ఎమ్మెల్యే, గ్రామ పంచాయతీకి ఎన్నో విన్నపాలు చేశామని తెలిపారు. నుర్వి రవీందర్ సర్పంచ్‌గా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో మరో సారి సమస్యలను వివరిస్తూ వినతిపత్రం సమర్పించినట్లు వారు తెలిపారు.