హైదరాబాద్

ఆరు నెలల బకాయి ఉంటే కనెక్షన్ కట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 15: జలమండలికి సంబంధించి నగరంలోని అన్ని లీకేజీలు, రిపేర్లను నాలుగు నెలల్లో పూర్తి చేయాలని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ దాన కిషోర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన ఆపరేషన్, మెయింటనెన్స్, రెవెన్యూ అంశాలకు సంబంధించి బుధవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండి మాట్లాడుతూ నగరంలోని వివిధ 600 హాట్ స్పాట్ ప్రాంతాల్లో తరుచూ సీవరేజీ లీకేజీలతో కాలుష్యం పెరిగిపోతుందని ఫిర్యాదులు వస్తున్నాయని, వాటికి నిర్ణీత గడువులోపు మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజల నుంచి ఫిర్యాదులను మరింత వేగవంతంగా స్వీకరించేందుకు జల యాప్‌ను అందుబాటులోకి తెచ్చామని, దీనికి వచ్చే ఫిర్యాదులకు తప్పకుండా హజరుకావాలని సూచించారు. ఈ రకంగా ఫిర్యాదులను పరిష్కరిస్తూ సంతృప్తి చెందే వినియోగదారుల శాతాన్ని పెంచుకునే అంశంపై దృష్టి సారించాలన్నారు. ఆరు నెలలుగా వరుసగా వాటర్ బిల్లు చెల్లించని కనెక్షన్లను కట్ చేయాలని సూచించారు. ఆరు నెలలుగా బిల్లులు చెల్లించని వారిని గుర్తించి, దీర్ఘకాలంగా పెద్ద మొత్తంలో బకాయిపడ్డ వారిని గుర్తించి వారి ఆఫీసులు, ఇళ్ల ఆవరణలో రెడ్ కార్నర్ నోటీసులు అంటించాలని అధికారులను ఆదేశించారు. బిల్లుల కలెక్షన్‌లో చూపే చొరవను ప్రజలకు మెరుగైన సేవలు అందించటంలోనూ చూపాలని చెబుతూ, తరుచుగా మురుగునీరు ప్రవహించే ప్రాంతాలు, సీవరేజీ వాటర్ లీకేజీ కాలుష్య సంబంధిత ఫిర్యాదులు అధికంగా వస్తున్న ప్రాంతాల్లో తగిన మరమ్మతులకు ప్రతిపాదనలు, అంచనాలను తమకు పంపితే వెంటనే మంజూరీ ఇస్తామన్నారు. అన్ని సర్కిళ్లకు సంబంధించి వచ్చే మార్చి నెలాఖరుకల్లా అన్ని కమర్షియల్ సంస్థల వాటర్ బిల్లులు వసూలు చేయాలని జనరల్ మేనేజర్లను ఆదేశించారు. అప్పటికీ వ్యాపార సంస్థల వినియోగదారులు స్పందించని పక్షంలో జిహెచ్‌ఎంసిని సమన్వయం చేసుకుని, వారి ట్రేడ్ లైసెన్సులను రద్దు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బిల్లులు చెల్లించని నల్లా కనెక్షన్ల తొలగింపు ప్రక్రియ స్థితిని తెలుసుకునేందుకు ప్రధాన కార్యాలయం నుంచి ఒక ఆడిట్ బృందం తనిఖీ చేయాలని ఆదేశించారు.
స్వైన్ ఫ్లూ పంజా

అనుమానిత రోగులతో కిటకిటలాడుతున్న క్లినిక్‌లు
వ్యాధి బారిన పడి మరొకరి మృతి
గాంధీలో పెరుగుతున్న రోగుల సంఖ్య
పత్తాలేని ప్రజావగాహన కార్యక్రమాలు

హైదరాబాద్, ఫిబ్రవరి 15: గ్రేటర్ హైదరాబాద్ నగరంలో వాతావరణంలో చోటుచేసుకుంటున్న పెనుమార్పులు..దానికి తోడు జిల్లా వైద్యారోగ్యశాఖ నిర్లక్ష్యం పుణ్యమాని స్వైన్ ఫ్లూ వ్యాధి పంజా విసిరింది. గడిచిన నెలన్నర రోజుల్లో ఈ వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న వారు, అలాగే వ్యాధి నిర్థారణ అయి మృతి చెందిన వారి సంఖ్య పెరుగుతున్నా, కనీసం వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను చేపట్టకపోవటం గమనార్హం. నగరంలో వాతావరణం చల్లబడినపుడల్లా స్వైన్ ఫ్లూ మహమ్మారి తమ ప్రతాపాన్ని చూపుతున్నా, కనీసం ముందస్తుగా వ్యాధి నివారణ చర్యలు చేపట్టడంలో అధికార యంత్రాంగం విఫలమవుతోంది. పేద, ధనిక వర్గాలు నివసించే దాదాపు అన్ని ప్రాంతాల్లో ఈ వ్యాధి ఆనవాళ్లు కన్పించటంతో జనం బెంబేలెత్తుతున్నారు. ఈ సంవత్సరం జనవరి మొదటి నుంచి ఇప్పటి వరకు ఈ వ్యాధి బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య పదికి చేరింది. నేటికీ గాంధీ ఆసుపత్రిలో ఈ వ్యాధి బారిన పడి చికిత్స నిమిత్తం చేరిన వారి సంఖ్య కూడా పదికి పెరిగింది. తాజాగా బుధవారం మరో ఇద్దరు మృతి చెందినట్లు ప్రచారం జరుగుతున్నా, గాంధీ ఆసుపత్రి వర్గాలు ఒకరు మృతి చెందినట్లు నిర్థారించాయి. చికిత్స పొందుతున్న వారిలో ఓ గర్భిణి, కొందరు చిన్నారులున్నట్లు తెలిసింది. స్వైన్ ఫ్లూ వ్యాధి బారిన పడ్డ వారికి మామూలు లక్షణాలైన జలుబు, తుమ్ములు, అతి జ్వరం వంటివి ఉండటండతో సాధారణ అనారోగ్యంగా భావిస్తూ అనేక మంది ప్రైవేటు క్లినిక్‌లలో చికిత్స చేయించుకుంటున్నారు. పాతబస్తీతో పాటు పేద, మధ్య తరగతి ప్రజలెక్కువగా నివసించే మాస్ ప్రాంతాల్లోని క్లినిక్‌లు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఇలాంటి లక్షణాలతో బాధపడుతున్న రోగులతో కిటకిటలాడుతున్నాయి. అనుమానిత లక్షణాలతో వచ్చి, ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి పరీక్షలు నిర్వహించి, రిపోర్టు రాకముందే, పూర్తిస్థాయిలో చికిత్స పొందకముందే ఆసుపత్రుల నుంచి వెళ్లి పోయి, జనం మధ్య జీవనం కొనసాగించటం వల్ల ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని వైద్యులంటున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలకు, వృద్దులకు, అలాగే మధుమేహాం, గుండె సంబంధిత వ్యాధుల బారిన పడిన వారికి ఈ వ్యాధి చాలా త్వరగా సోకే అవకాశాలున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధి నిర్థారణ అయిన రోగుల నుంచి ఇతరులకు వ్యాధి ప్రబలకుండా వారికి నాణ్యమైన మాస్కులు ధరించాల్సి ఉంటుంది. కానీ గాంధీ ఆసుపత్రి మినహా మిగిలిన సర్కారు ఆసుపత్రుల్లో మాస్కుల కొరత ఉంది. గతంలో ఇదే తరహాలో నాణ్యమైన మాస్కు ధరించకుండా ఉస్మానియా ఆసుపత్రిలో స్వైన్ ఫ్లూ రోగికి చికిత్స చేస్తూ ధనుంజయ్ అనే జూనియర్ డాక్టర్ మృతి చెందిన విషయం తెలిసిందే! వ్యాధి ప్రబలక ముందు నివారణ చర్యలు చేపట్టడం మరిచిన వైద్యాధికారులు, కనీసం వ్యాధి నిర్థారణ అయిన తర్వాత ఒకరి నుంచి మరొకరికి వ్యాపించకుండా కనీస చర్యలు చేపట్టకపోవటం విమర్శలకు తావిస్తోంది.