హైదరాబాద్

ఒక్క నిమిషం ఆలస్యమైనా..అనుమతించం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 15: వచ్చే నెల 1వ తేదీ నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ థియరీ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమష్టిగా కృషి చేయాలని జిల్లా ఆర్డీవో సతీష్‌చంద్ర అధికారులను ఆదేశించారు. ఇంటర్ పరీక్షలపై ఆయన బుధవారం జిల్లా పరీక్షల కమిటీతో సమావేశమై ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలకు జిల్లాలో మొత్తం 198 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరాలకు చెందిన మొత్తం లక్షా 46వేల 329 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని సూచించారు. ఉదయం తొమ్మిది గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని ఆయన స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులు ఎనిమిదిన్నర గంటల నుంచి అనుమతించనున్నట్లు తెలిపారు. అంతేగాక, మార్చి 9వ తేదీన శాసన మండలి టీచర్స్ నియోజకవర్గానికి పోలింగ్ నిర్వహిస్తున్న కారణంగా 9న నిర్వహించాల్సిన పేపర్ పరీక్షను 19న నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని అభ్యర్థులంతా గుర్తించాలని సూచించారు. అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలను చేరుకునేందుకు వీలుగా సరిపడ ఆర్టీసి బస్సులను నడపాలని, ముఖ్యంగా పరీక్షా కేంద్రాలు అధికంగా ఉన్న సంజీవరెడ్డినగర్, నారాయణగూడ, దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతాల్లో బస్సులు ఎక్కువగా నడపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రధానంగా అభ్యర్థులందరూ పరీక్షా కేంద్రాలకు క్యాలికులేటర్లు, సెల్‌ఫోన్‌లు, పెన్‌డ్రైవ్‌లు, తదితర ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకురావద్దని సూచించారు. జిల్లా ఇంటర్మీడియట్ పరీక్షల అధికారి, కన్వీనర్ హరినాథ్ మాట్లాడుతూ నూతనంగా జిల్లాలు ఏర్పడిన దృష్ట్యా హాట్ టికెట్లపై ఆయా జిల్లాలకు సంబంధించి కొత్త, పాత కోడ్ నెంబర్లను ముద్రించటం జరిగిందని, అభ్యర్థులు వాటిని పోల్చి చూసుకొవాలని సూచించారు. పోలీసు, రెవెన్యూ, ఆర్టీసి, పోస్టల్, విద్యుత్ వాటర్ వర్క్స్, వైద్యారోగ్యశాఖలు తమ పూర్తి సహకారాన్ని అందించాలని కోరారు. ఈ సమావేశంలో అదనపు డిసిపి శ్రీనివాస్, ఎసిపి ఎస్. శ్రీనివాసచార్యులు, సిపిడిసిఎల్ ఏడిఇ సుధీర్, ఆర్టీసి డిఎం కెవివి.రెడ్డి, విద్యాశాఖ అసిస్టెంటు కమిషనర్ ఆఫ్ ఎగ్జామినేషన్ మోహన్‌రావు, డిపిసిఆర్వో రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
సందేహాలుంటే..ఈ నెంబర్లను సంప్రదించండి
ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి అభ్యర్థులకు ఎలాంటి సందేహాలున్నా డిఐఇవో హరీంద్రనాథ్(9848781805), సభ్యులు ఎం.చంద్రకళ(9908215359), ప్రతిమారెడ్డి(9347201789), ఎన్‌ఆర్. శ్యాముల్‌బాబు( 9849524111), ఆర్. సత్యానంద్(9849557401), డి. భద్రేషన్(9391012604)లను సంప్రదించవచ్చునని ఆర్డీవో సతీష్‌చంద్ర తెలిపారు.

మాదాపూర్‌లో మహిళ దారుణ హత్య

క్లూస్ సేకరిస్తున్న పోలీసులు
గచ్చిబౌలి, ఫిబ్రవరి 15: గుర్తు తెలియని మహిళను హత్య చేసి అనంతరం శవాని గుర్తు పట్టకుండా కాల్చివేసిన సంఘటన మాదాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని హైటెక్ సిటీ రైల్వేస్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ చంద్రశేఖర్ కధనం ప్రకారం వివరాలు ఇలావున్నాయి. మాదాపూర్ సర్వే నెంబర్ 1007లోని భాగ్యనగర్ హౌసింగ్ సొసైటీ కాలనీ ఎన్‌ఐఎ బిల్డింగ్ పక్కన ఉన్న ఖాళీ సంస్థలో గుర్తు తెలియని మహిళ శవం ఉన్నట్టు తెలియడంతో పోలీసులు సంఘటనా ప్రదేశానికి వెళ్లి శవాని స్వాధీనం చేసుకున్నారు. మృతురాలికి 22నుండి 25 సంవత్సరాల వయస్సు ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతురాలు పంజాబీ డ్రస్ ధరించినట్టుందని పోలీసులు అంటున్నారు. మృతురాలు చేతికి కడియం ధరించిందని మృతదేహం వద్ద ఎలాంటి అనవాళ్లు లేకుండా చేశారని పోలీసులు చెబుతున్నారు. మృతురాలు లేబర్ కాదని ఉద్యోగై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహం వద్ద లభించిన ఆధారాలను సేకరించిన పోలీసులు ఎక్కడైనా హత్య చేసి అనంతరం ఇక్కడికి తీసుకొచ్చి అనంతరం మృతదేహన్ని గుర్తు పట్టకుండా కాల్చివేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు ముందు మహిళపై అత్యాచారం జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈప్రాంతంలో ఐటి ఉద్యోగులు అధికంగా ఉండడంతో మృతురాలు వయస్సు తక్కువ ఉండడంతో అనేకకోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు వయస్సు చిన్న వయస్సు కావడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించారు. మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.