హైదరాబాద్

ప్రాథమిక దశలో గుర్తిస్తే స్వైన్‌ఫ్లూను నివారించవచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, ఫిబ్రవరి 16: స్వైన్‌ఫ్లూ వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తిస్తే నివారించవచ్చునని నిమ్స్ డైరెక్టర్ మనోహర్ అన్నారు. గురువారం నిమ్స్ లెర్నింగ్ సెంటర్‌లో స్వైన్‌ఫ్లూ వ్యాధి లక్షణాలు - నివారణోపాయాలు అనే అంశంపై అవగాహన సదస్సును నిర్వహించారు. సదస్సుకు ముఖ్యఅతిథిగా మనోహర్ హాజరై మాట్లాడారు. స్వైన్‌ఫ్లూ నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. ప్రాణాలను హరించే స్వైన్‌ఫ్లూ వ్యాధిని పూర్తిగా నయం చేయగల ఆధునిక వైద్యం అందుబాటులో ఉందని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2235 మంది రోగులకు సంబందించిన నమూనాలను సేకరించామని, 470 మందికి పాజిటివ్ రిపోర్టు వచ్చిందని చెప్పారు. వీరిలో 12 మంది వరకు మరణించడం ఆవేదన కలిగించే అంశమన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన రాష్ట్రంలో మరణాల సంఖ్య తక్కువగా ఉందని తెలిపారు. స్వైన్‌ఫ్లూ వ్యాధి బారిన పడిన వారి కోసం గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. అత్యవసర కేసుల కోసం 20 పడకలను, సాదారణ రోగులగా చేరే వారి కోసం మరో 30 పడకలను అందుబాటులో ఉంచినట్టు చెప్పారు. స్వైన్‌ఫ్లూ రోగుల కోసం 12 వెంటిలేటర్లను సిద్దంగా ఉంచినట్టు చెప్పారు. గత నెల మహబూబ్‌నగర్‌కు చెందిన ఓ రోగి నిమోనియాతో బాధపడుతూ తమ వద్దకు రాగా అతనికి మెరుగైన వైద్యం అందించడంతో పూర్తి ఆరోగ్యవంతుడయ్యాడని తెలిపారు. నారాయణగూడాలోని ఇన్సిటిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసెన్‌లో ఐపిఎం కేంద్రం ఉందని, ఫీవర్ ఆసుపత్రిలో సైతం ఇలాంటి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఒసెల్‌టెమ మాత్రలను క్రమం తప్పకుండా ఐదు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో వేసుకున్నట్లయితే వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చునని చెప్పారు. మాత్రలు వాడటంలో నిర్లక్ష్యం వహిస్తే తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. ఐపిఎం, చెస్ట్, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో ఈ మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇప్పటి వరకు నిమ్స్‌లో 11 మంది ఓపికి జలుబు, జ్వరం లక్షణాలతో వచ్చారని, అందులో ఇన్‌పేషెంటుగా ఒక్కరూ మాత్రమే అడ్మిటయ్యారని, ప్రస్తుతం అతను కూడా పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు తెలిపారు. ఈ సదస్సులో నిమ్స్ డీన్ సుబాష్ కౌల్, సుపరింటెండెంట్ నిమ్మ సత్యనారాయణ, జనరల్ మెడిసెన్ హెచ్‌ఓడి వైఎస్‌ఎన్ రాజు, ఛాతి వైద్య నిపుణులు డాక్టర్ పరంజ్యోతి పాల్గొన్నారు.

వ్యభిచారం నిర్వహిస్తున్న లాడ్జిపై దాడి
* ముగ్గురి అరెస్ట్..
పరారీలో లాడ్జి మేనేజర్

హైదరాబాద్, ఫిబ్రవరి 16: గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నడుపుతున్న లాడ్జిపై పోలీసులు దాడి చేసిన కేసులో ముగ్గురిని అరెస్టు చేయగా ఒకరు పారిపోయారు. సికింద్రాబాద్‌లోని సెవెన్ హిల్స్ లాడ్జిలో గత కొంతకాలంగా గుట్టు చపుడు కాకుండా మహబుబ్‌నగర్ మెట్టుగూడ పద్మవతి కాలనీకి చెందిన ననావత్ కళావతి(28) వ్యవసాయ కూలి. సువర్ణ భర్త రాజు నాలుగు సంవత్సరాల క్రితం చనిపోయాడు. దీంతో ఆమెకు ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి. ఎలాగైన డబ్బులు సంపాదించాలని కళవతి మహబుబ్‌నగర్ మెట్టుగూడ ప్రాంతానికి చెందిన కేతవత్ సువర్ణ(27)కు మాయమాటాలు చెప్పి వ్యభిచార వృత్తిలోకి దింపింది. పోలీసులకు అందిన సమాచారంతో బేగంపేట మహిళ పోలీస్టేషన్ ఇన్‌పెక్టర్ పి.జానకమ్మ స్థానిక గోపాల్‌పురం పోలీసుల సహకారంతో పథకం ప్రకారం లాడ్జిపై దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాద్‌లోని సెవన్ హిల్స్ లాడ్జిలో రిసిప్షనిస్ట్‌గా పనిచేస్తున్న ఆదిలాబాద్ జిల్లా ఇన్‌ర్రావెల్లి గ్రామానికి చెందిన ఆర్.జగదీష్(19), నేరేడ్‌మెట్ ప్రాంతానికి చెందిన బిజీనెస్‌మెన్ అంతర్వేది ప్రకాష్(32)ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసులో లాడ్జి మేనేజర్ లఖన్ తప్పించుకున్నాడని, అతనిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని నార్త్ జోన్ డిసిపి సుమతి తెలిపారు. బేగంపేట మహిళ పోలీస్టేషన్ ఇన్‌స్పెక్టర్ జానకమ్మ మాట్లాడుతూ లాడ్జిలు నిర్వాహకులు బస వేసేందుకు వచ్చేవారి వివారలను సేకరించిన తరువాతనే అనుమతించాలని అన్నారు.