హైదరాబాద్

వసూళ్ల బిజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 16: గ్రేటర్ నగరం ప్రజల జనజీవనంతో ముడిపడి ఉన్న ముఖ్యమైన శాఖల్లో జిహెచ్‌ఎంసి, జలమండలిలు ప్రస్తుతం వసూళ్లలో బిజీగా ఉన్నాయి. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జిహెచ్‌ఎంసి ఈ ఆర్థిక సంవత్సరం రూ. 1500 కోట్ల ఆస్తిపన్ను వసూళ్లను లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటి వరకు రూ. 850 కోట్ల మేరకు వసూలు చేసుకుని, ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు ఉన్న మరో 44 రోజుల్లో మరో రూ. 650 కోట్లను వసూలు చేసుకునే లక్ష్యంతో జిహెచ్‌ఎంసి అధికారులు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. అలాగే జలమండలి అధికారులు కూడా ఈ నెలాఖరు వరకు కనీసం రూ. వంద కోట్ల మేరకు రెవెన్యూ సమకూర్చుకోవాలన్న దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేశారు. వరుసగా ఆరు నెలలు వాటర్ బిల్లులు చెల్లించని కమర్షియల్, రెసిడెన్షియల్ కనెక్షన్లను గుర్తించి కట్ చేయాలంటూ ఎండి దాన కిషోర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయటంతో జలమండలి అధికారులు, సిబ్బంది క్షేత్ర స్థాయి విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రతి ఆర్థిక సంవత్సరం చివరి మూడు నెలలైన జనవరి నుంచి మార్చి వరకు ఆస్తిపన్ను వసూళ్లతో జిహెచ్‌ఎంసి అధికారులు హడావుడి చేసేవారు. కానీ కమిషనర్‌గా జనార్దన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆస్తిపన్ను అనేది కార్పొరేషన్ ప్రధాన ఆర్థిక వనరు అని, ఏడాది పొడువున పన్ను వసూలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేయటంతో గత సంవత్సరం ఇదే తేదీ నాటికి వసూలైన కలెక్షన్‌తో పోల్చితే రూ. 200 కోట్ల వరకు అధికంగా పన్ను వసూలైందని అధికారులు చెబుతున్నారు. జలమండలి అధికారులేమో వాటర్ కనెక్షన్ కట్ చేసేందుకు సిద్దమవుతుండగా, పెద్ద మొత్తంలో దీర్ఘకాలకంగా ఆస్తిపన్ను బకాయి ఉన్న ఇళ్లు, వ్యాపార సంస్థల ముందు జిహెచ్‌ఎంసి అధికారులు, సిబ్బంది గాంధేయ మార్గంలో నిరసన వ్యక్తం చేసి పన్ను వసూలు చేసుకునేందుకు సిద్దమవుతున్నారు.
బల్దియా లక్ష్యం ఫలించేనా?
జిహెచ్‌ఎంసి ప్రధాన ఆర్థిక వనరైన ఆస్తిపన్ను వసూళ్లకు సంబంధించి కార్పొరేషన్ ప్రతి ఏటా లక్ష్యంగా పెట్టుకునే టార్గెట్‌కు అనుకూలంగా వసూళ్లు చేసేది. గానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లక్ష్యంగా పెట్టుకున్న రూ. 1500కోట్ల ఆస్తిపన్ను వసూలయ్యే అవకాశాలు కన్పించటం లేదు. అలాగనీ పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఉందని కూడా చెప్పలేం. కమిషనర్ ఏడాది పొడువున ఆస్తిపన్ను వసూలు చేయాలని ఆదేశించటం, అలాగే నగదు రహిత, ఆన్‌లైన్ చెల్లింపులకు కార్పొరేషన్ ఆకర్షణీయమైన నగదు బహుమతులను ప్రకటించటంతో గత సంవత్సరం కన్నా రెండు వంద కోట్ల మేరకు పన్ను వసూలైంది. ఇక ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు ఉన్న 44 రోజుల్లో వసూళ్లు అంతంతమాత్రమేనని చెప్పవచ్చు. దీనికి తోడు ఈ సారి వడ్డీ మినహాయింపు ఉండదంటూ ఇప్పటికే ప్రభుత్వం, కమిషనర్ కూడా తేల్చి చెప్పటంతో బల్దియా వసూళ్ల లక్ష్యం ఫలించే అవకాశాలు అంతంతమాత్రమేనని చెప్పవచ్చు.
రూ. 300 కోట్లు బడ్జెట్‌లో కేటాయించాలి:
సర్కారుకు త్వరలో జలమండలి లేఖ
గ్రేటర్‌లో నీటి సరఫరా, మురుగు నీటి నిర్వాహణ, రుణాల చెల్లింపు ఇతరత్రా ఖర్చులకు జలమండలి ప్రతి నెల రూ. 110 కోట్ల మేరకు వెచ్చిస్తోంది. కానీ వసూలవుతున్న నీటి బిల్లులు కేవలం రూ. 90 కోట్ల నుంచి రూ. 95 కోట్ల మధ్య ఉంటున్నాయి. దీంతో ప్రతి నెల జలమండలికి రూ. 10కోట్ల నుంచి రూ. 15 కోట్ల వరకు అదనపు భారంగా మారుతోంది. అలాగే ఏటా వివిధ ప్రభుత్వ విభాగాల నుంచి రావల్సిన రూ. 300 కోట్లు సక్రమంగా వసూలు కాకపోవటంతో, ఈ మొత్తాన్ని రానున్న రాష్ట్ర బడ్జెట్‌లో జలమండలికి కేటాయించాలని కోరుతూ లేఖ రాయాలని జలమండలి అధికారులు భావిస్తున్నారు.