హైదరాబాద్

ప్రజారవాణా మెరుగుకు బల్దియా కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 16: మహానగరంలో రోజురోజుకీ పెరిగిపోతున్న ట్రాఫిక్, రద్దీల కారణంగా పార్కింగ్ సమస్య తలనొప్పిగా మారింది. పెయిడ్ పార్కింగ్‌లను అందుబాటులోకి తెచ్చినా, సమస్య శాశ్వతంగా పరిష్కారం కాకపోవటంతో ప్రభుత్వం సెంట్రల్ పార్కింగ్ మేనేజ్‌మెంట్ అథారిటీ(సిపిఎంఏ)ను ఏర్పాటు చేయాలని యోచిస్తుంది. ఇందుకు సంబంధించి విధి విధానాల రూపకల్పనతో పాటు శివార్లలో భారీ పార్కింగ్ కాంప్లెక్సుల నిర్మించే విషయంపై కసరత్తు చేయాలని ఇప్పటికే జిహెచ్‌ఎంసిని ఆదేశించింది. ఈ అథారిటీనిఅందుబాటులోకి తెచ్చిన తర్వాత శివార్లలో కూడా ప్రజారవాణా వ్యవస్థను అందుబాటులోకి తెచ్చి, దానికి అనుసంధానంగా ఈ పార్కింగ్ కాంప్లెక్సులను ఏర్పాటు చేయాలని జిహెచ్‌ఎంసి భావిస్తోంది. ముఖ్యంగా త్వరలో అందుబాటులోకి రానున్న హైదరాబాద్ మెట్రోరైలు మొదటి దశలో భాగంగా మెట్రో స్టేషన్లకు సమీపంలోనే ఈ భారీ పార్కింగ్ కాంపెక్స్‌లను నిర్మించాలని జిహెచ్‌ఎంసి భావిస్తోంది. మెట్రో స్టేషన్లకు ఈ పార్కింగ్ కాంప్లెక్సులు అందుబాటులో ఉంటే వృత్తి, విద్యా, ఉద్యోగం, వ్యాపారాల నిమిత్తం రాకపోకలు సాగించే వారు ఈ పార్కింగ్ కాంప్లెక్సుల్లో తమ వాహనాలను పార్కింగ్ చేసుకుని, అక్కడి నుంచి అవసరమైన చోటకు మెట్రోరైలులో ప్రయాణించి, ఆ తర్వాత తమ వాహనాలను తీసుకుని వెళ్లిపోయే వీలు కలుగుతుందని, దీంతో ప్రజారవాణా వ్యవస్ధను వాహనదారులు సద్వినియోగం చేసుకోవటంతో పాటు పార్కింగ్ సమస్య కూడా కొంత వరకు తగ్గుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం అథారిటీ ఏర్పాటు దిశగా కొనసాగుతున్న జిహెచ్‌ఎంసి కసరత్తు మరో నెలరోజుల్లో ముగిసి ప్రతిపాదనపై స్పష్టత వచ్చే అవకాశమున్నట్లు జిహెచ్‌ఎంసి అధికారులు చెబుతున్నారు. ఈ అథారిటీలో ఆర్టీసి, జిహెచ్‌ఎంసి, మెట్రోరైలు విభాగాలు కీలక పాత్ర పోషించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
భారం కానున్న పార్కింగ్ ఛార్జీలు
శివార్లలో భారీ పార్కింగ్ కాంప్లెక్సులను నిర్మించాలని భావిస్తుండగా, నగరంలో ఎక్కువగా రద్దీ ఉండే ప్రాంతాల్లో నిర్మించనున్న పార్కింగ్ కాంప్లెక్సుల్లో నిమిషాల ప్రాతిపదికన పార్కింగ్ ఛార్జీలను వసూలు చేయాలని జిహెచ్‌ఎంసి భావిస్తోంది. నగరం నడిబొడ్డును ఏర్పాటు చేయనున్న కాంప్లెక్సుల్లో ప్రతి ఇరవై నిమిషాలకు వాహనాలను బట్టి ఛార్జీలు వర్తింపజేయాలని భావిస్తున్నారు. ఇలా చేస్తే పార్కింగ్ ఛార్జీలు భారమై అత్యవసర అవసరముంటే తప్పా, భారీ వాహనాలు బయటకు వచ్చే అవకాశముండదనేది అధికారుల ఆలోచనగా కన్పిస్తోంది.