హైదరాబాద్

వంద శాతం ఆధార్ నమోదు చేపట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 16: వందశాతం ఆధార్ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని వికారాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ సురేశ్ పొద్దార్ అధికారులను ఆదేశించారు. గురువారం వికారాబాద్ కలెక్టరేట్‌లో ఆధార్ నమోదు, పాఠశాలలకు పుస్తకాల పంపిణీ, ఇంటర్ పరీక్షల నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో జెసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రప్రభుత్వ ఆదేశాల మేరకు ఆధార్ నమోదు ప్రక్రియను మార్చి 31లోగా పూర్తి చేయాలని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతో పాటు అంగన్‌వాడి కేంద్రాల్లోని 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ ఆధార్ చేయించాలని సూచించారు. ఎక్కడైనా ఆధార్ నమోదు ప్రక్రియలో సాంకేతిక లోపాలుంటే సరిచేసుకునేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇంకా అదనంగా అవసరమనుకుంటే కొత్త కేంద్రాలను కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బియ్యం కోటాను ఏజెన్సీలు పాఠశాలలకు చేర్చడం లేదని కొందరు ఎంఇఓలు జేసి దృష్టికి తీసుకురాగా దీనిపై చర్యలు తీసుకోవాలని పౌర సరఫరా శాఖ అధికారికి సూచించారు. బియ్యం వివరాలను ప్రతి నెల 25లోపు నివేదికలు అందజేయాలని అన్నారు. ఫిబ్రవరి చివరిలోగా పాఠశాలలకు పాఠ్య పుస్తకాలను మండలాల వారీగా అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు జేసి తెలిపారు. ఆర్చి 1 నుండి 14వ తేదీ వరకు నిర్వహించే ఇంటర్మీడియట్ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని జేసి సూచించారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుండి మద్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో పరీక్షలు నిర్వహించేందుకు 24 కేంద్రాలను గుర్తించినట్టు చెప్పారు. పరీక్షా కేంద్రాలుగా గుర్తించిన కేంద్రాల్లో ఫర్నీచర్ లేనట్లయితే వాటి వివరాలను పంపాలని జెసి అన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఇన్‌చార్జి డిఇఓ అనంతచారి, పౌరసరఫరాల సంస్థ మేనేజర్ విజయ్‌మోహన్, జిల్లా సంక్షేమాధికారి సునంద, డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాస్, వివిద కళాశాలల ప్రిన్సిపల్స్, ఎంఇఓలు పాల్గొన్నారు.

మేయర్‌ను కలిసిన రాజస్థాన్ మేయర్ల బృందం
పౌరసేవల నిర్వహణ, రెవెన్యూపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్

హైదరాబాద్, ఫిబ్రవరి 16: రాజస్థాన్ రాష్ట్రంలోని పలు నగరాలకు చెందిన మేయర్లు, డిప్యూటీ మేయర్ల బృందం గురువారం నగర మేయర్ బొంతు రామ్మోహన్‌ను జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో కలిసింది. నగరంలో అమలవుతున్న పలు అభివృద్ది పనులు, పారిశుద్ద్య కార్యఅకమాల్లో చేపట్టిన సరికొత్త విధానాలు, ప్రధాన ఆర్థిక వనరైన ఆస్తిపన్ను వసూలకు అవలంభిస్తున్న సరికొత్త విధానాలు, పరిపాలన పరమైన అంశాలతో పాటు ఐటి సేవల వినియోగానికి సంబంధించి కమిషనర్ డా.బి.జనార్దన్ రెడ్డి ఈ ప్రతినిధుల బృందానికి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ముఖ్యంగా నగరాన్ని స్వచ్ఛ హైదరాబాద్‌గా తీర్చిదిద్దేందుకు మెరుగైన పారిశుద్ద్యం సాధించేందుకు, అందులో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు చేపట్టిన చర్యల గుర్తించి వివరించారు. అంతేగాక, దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఇంటికి డస్ట్‌బిన్లను పంపిణీ చేయటంతో పాటు చెత్తను త్వరితగతిన తరలించేందుకు 2వేల ఆటో టిప్పర్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. దీనికి తోడు ఈ ఆఫీసును అమలు చేస్తూ జిహెచ్‌ఎంసి దేశంలోనే మొట్టమొదటి కార్పొరేషన్ స్థానానికి ఎదిగిందని వివరించారు. నగర మేయర్ రామ్మోహన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్ నగరానికి రాజస్థానంలోని జైపూర్ తదితర నగరాలకు సామీప్యత ఉందని, ఇవి చారిత్రాత్మకంగా, సాంస్కృతికపరంగా గొప్ప నగరాలు అని వివరించారు. కాగా, హైదరాబాద్ నగరంలో ఓపెన్ గ్యార్బెజీ పాయింట్లను ఎత్తివేయటాన్ని రాజస్థాన్ మేయర్, డిప్యూటీ మేయర్ల బృందం అభినందించింది. నగరంలో పారిశుద్ద్య నిర్వాహణ మెరుగ్గా ఉందని, ముఖ్యంగా సిటీ రహదారులను చాలా చక్కగా నిర్వహిస్తున్నారని కూడా ప్రశంసించింది. డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్ స్వాగతం పలికిన ఈ బృందంలో రాజస్థాన్‌లోని జోత్‌పూర్ నగర పాలక సంస్థ మేయర్ గన్‌శ్యాం ఓజ, భరత్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శివసింగ్ భూత్, జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ మనోజ్ భరద్వాజ్, అజ్మీర్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సంపత్ సంక్లా, భరత్‌పూర్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఇంద్రపాల్‌సింగ్‌లతో పాటు అధికారులు ఓపి కాలా, జార్జ్ చరియన్, అమర్‌దీప్‌సింగ్, మధుసూధన్ తదతరులు పాల్గొన్నారు.