హైదరాబాద్

పెద్దనోట్ల రద్దు రోజు రూ.37 కోట్ల బంగారం కొనుగోలు కేసు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 17: పెద్ద నోట్ల రద్దయిన రోజు జరిగిన బంగారం కొనుగోళ్ల కేసులో నగల వ్యాపారి పవన్ అగర్వాల్‌ను హైదరాబాద్ నగర సిసిఎస్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. కేంద్రప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన గత ఏడాది నవంబర్ 8వ తేదీ రాత్రి హైదరాబాద్ నగరంలో కోట్లాది రూపాయలు బంగారం కొనుగోళ్లు జరిగినట్లు గుర్తించిన పోలీసులు దర్యాప్తు చేయగా లెక్కల్లోకి రాని సొమ్ముతో బంగారం కొనుగోళ్లు జరిగినట్లు నిర్ధారించారు. సిసిఎస్ డిసిపి అవినాష్ మహంతి తెలిపిన వివరాల ప్రకారం..ఈ కేసుల్లో భాగంగా అబిడ్స్‌లోని గన్‌ఫౌండ్రీ ప్రాంతంలోని శ్రీ బాలాజీ గోల్డ్ దుకాణం నడుపుతున్న పవన్ అగర్వాల్, మరికొంత మందితో కలిసి రూ.37 కోట్లను నితిన్ గుప్తాకు చెందిన ముసద్దిలాల్ జెమ్స్, జువెల్లరీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో డిపాజిట్ చేశాడు. అనంతరం పవన్ అగర్వాల్‌కే చెందిన శ్రీ బాలాజీ గోల్డ్ బులియన్ పేరుతో ఉన్న రెండు అక్కౌంట్లకు మళ్లించారు. అనంతరం ఆ మొత్తాన్ని మరికొన్ని ఇతర బులియన్ డీలర్ల అక్కౌంట్లకు బదిలీ చేసి బంగారం కొనుగోలు చేసినట్లు చూపించారు.
సిసిఎస్ ఎసిపి కె.రామ్‌కుమార్ నేతృత్వంలోని దర్యాప్తు బృందం లోతుగా విచారణ చేపట్టి పవన్ అగర్వాల్‌ను అరెస్టు చేసినట్లు డిసిపి తెలిపారు. కాగా పెద్ద నోట్ల రద్దయిన రోజు రాత్రి కొందరు నిందితులు రూ.59 కోట్లతో ముసద్దిలాల్ జెమ్స్, జువెల్లరీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో బంగారం కొనుగోలు చేసినట్లు నకిలీ రసీదులను సృష్టించారు. అలాగే వైష్ణవి బులియన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో 40 కోట్లకు నకిలీ ముందస్తు రసీదును సృష్టించారు. అలాగే ముసద్దిలాల్ జువెల్లరీస్ కూడా 12 కోట్లకు 600 మంది వినియోగదారులు బంగారం కొన్నట్లు సృష్టించారు. ఈ నోట్ల మార్పిడి కుట్రలో మొత్తం 5890 మంది వినియోగదారులు దాదాపు రూ.110 కోట్లను బంగారం కొనుగోళ్ల రూపంలో నగదు మార్పిడికి పాల్పడినట్లు తేలింది. ఇందుకు సంబంధించిన బిల్లులన్నీ నవంబర్ 8వ తేదీ రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు కొనుగోళ్లు జరిగినట్లు చూపించారు. ఈకేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ అవినాష్ మహంతి తెలిపారు.

రాష్ట్ర స్థాయి గ్రీన్ క్యారమ్ చాంపియన్‌షిప్

హైదరాబాద్, ఫిబ్రవరి 17: హైదరాబాద్ క్యారమ్ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 25 నుంచి 28వరకు ప్రథమ తెలంగాణ రాష్ట్ర స్థాయి సీనియర్ పురుషులు, మహిలళ క్యారమ్ చాంపియన్‌షిప్‌ను నిర్వహిస్తారు.
ఎల్‌ఐసి సౌజన్యంతో నిర్వహిస్తున్న ఈ చాంపియన్‌షిప్ ఖైరతాబాద్‌లోని ఆనంద్‌నగర్ సంక్షేమ సంఘం స్పోర్ట్స్ హాలులో నిర్వహిస్తారు. మొట్టమొదటిసారి అఖిలభారత క్యారమ్ సమాఖ్య నియమాలకు అనుగుణంగా గ్రీన్ క్యారమ్ బోర్డులపై పోటీలు నిర్వహిస్తామని హైదరాబాద్ క్యారమ్ సంఘం అధ్యక్షుడు బికె హరనాథ్‌బాబా తెలిపారు. మొదటిసారి గ్రీన్ క్యారమ్ బోర్డులను డెల్లాస్‌లో గత జూలై మాసంలో జరిగిన ప్రథమ యుఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ క్యారమ్ చాంపియన్‌షిప్‌లో వినియోగించామని ఆయన తెలిపారు. క్యారమ్ సంఘం ఏర్పడి 45 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న సీనియర్ క్యారమ్ చాంపియన్‌షిప్‌లో వాడేందుకు గాను 25 గ్రీన్ బోర్డులను జయదేవ్ సూర్యదేవర సమాకురుస్తున్నట్లు హరనాథ్ తెలిపారు.
నాలుగురోజుల పాటు జరుగునున్న ఈ చాంపియన్‌షిప్‌లో పురుషుల విభాగంలో డబుల్స్, సింగిల్స్‌లో మహిళల్లో కేవలం సింగిల్స్‌లో మాత్రమే పోటీలు జరుగుతాయి. ఈనెల 25న చాంపియన్‌షిప్‌ను ఎల్‌ఐసి ఆఫ్ ఇండియా జోనల్ మేనేజర్ టిసి సుశీల్‌కుమార్ ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభిస్తారు.
టోర్నమెంట్‌లో పాల్గొనదలిచిన అసక్తి గలవారు తమ దరఖాస్తులను పంపించేందుకు ఆఖరు తేదీ ఈనెల 22. ఇతర పూర్తి వివరాల కోసం లాల్‌బహదూర్‌స్టేడియంలోని రూమ్‌నెంబర్ 33లోని హైదరాబాద్ క్యారమ్ సంఘం కార్యాలయంలో సంప్రదించాల్సి ఉంటుంది. లేదా టోనర్నమెంట్ నిర్వహణ కార్యదర్శి, హైదరాబాద్ క్యారమ్ సంఘం నిర్వహణ కార్యదర్శి ఎస్.శోభాన్‌బాబును ఫోన్ నెంబర్ 9247126616లో సంప్రదించాల్సి ఉంటుందని హరనాథ్‌బాబా తెలిపారు.