హైదరాబాద్

హరితహారంపై కలెక్టర్ సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 17: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపట్టేందుకు కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్లేందుకు మండల అధికారులు ఓఎస్‌డిలు చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఓఎస్‌డిలతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. హరితహారంలో భాగంగా పెంచే నర్సరీలను ఎప్పటికప్పుడు సందర్శిస్తూ పర్యవేక్షించాలని ఓఎస్‌డిలకు సూచిస్తూ, ప్రతి నర్సరీలో నాటడానికి సిద్ధంగా ఉన్న మొక్కల వివరాలను ఈనెల 21లోగా అందించాలని సూచించారు. జిల్లాలో 8మండలాలు పన్ను వసూళ్లలో చాలా వెనుకబడి ఉన్నందున పంచాయతీ సెక్రెటరీలు దీన్ని ప్రథమ కర్తవ్యంగా భావించి పన్ను వసూళ్లు చేయడంలో అలసత్వం వీడి 100 శాతం వసూలు చేసే దిశగా కృషి చేయాలని అన్నారు. వసూళ్లు చేయడంలో వెనుకబడి ఉన్న వారిపై కఠిన చర్యలు చేపట్టబడునని హెచ్చరించారు. గ్రామాలలో ప్రజలకు పన్నులు కట్టేందుకు అవగాహన కల్పించాలని చెప్పారు. ఎంపిక చేసిన 5గ్రామాలలో ఐహెచ్‌ఎఫ్‌ఎఫ్ కింద మరుగుదొడ్ల నిర్మాణాలు మొదలుపెట్టిన గ్రామాలకే ముందుగా నిధులు మంజూరు చేసి మార్చిలోపు వందశాతం పనులు పూర్తి చేసేటట్లు చర్యలు చేపట్టాలని అన్నారు. ఉపాది హామీ పథకం కింద సిసి రోడ్ల పనులు గుర్తించి వెంటనే పనులు ప్రారంభించమని డిఆర్‌డిఓను ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న గ్రామ పంచాయతీ, అంగన్‌వాడీ భవనాల పనులు త్వరగా పూర్తి చేసే బాధ్యత ఓఎస్‌డిలదే అని హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగులు సర్వీసులో ఉండగా మరణిస్తే వెంటనే ఆ కుటుంబంలోని ఒక సభ్యునికి 10 రోజులలో కారుణ్య నియామకం చేసే విధంగా ఆ శాఖకు చెందిన అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలోని ఓఎస్‌డిల పరిధిలో ఉన్న నియోజకవర్గాల వారీగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల స్థలాలను గుర్తించి ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. వచ్చే వేసవిలో తాగునీటి ఎద్దడి కలుగకుండా కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకుని ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు ప్రధానంగా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా, చేతి పంపుల మరమ్మతులు, నీటి బావులను మెరుగుపర్చడం, ఎండిన బోర్లను పునరుద్ధరించడం తదితర పనులు చేపట్టాలని, గ్రామాల్లో తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

నిర్ణీత గడువులోపు ప్రాజెక్టు పూర్తి కావాలి

హైదరాబాద్, ఫిబ్రవరి 17: శివార్ల దాహర్తీని తీర్చేందుకు జలమండలి ప్రపంచ బ్యాంకు నిధులతో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మల్కాజ్‌గిరి మంచినీటి సరఫరా ప్రాజెక్టు పనులను జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ దాన కిషోర్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా చంద్రగిరికాలనీ, సఫిల్‌గూడ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిన ఆయన నూతనంగా ఇస్తున్న వాటర్ కనెక్షన్లను సైతం పరిశీలించారు. అలాగే గౌతమ్‌నగర్‌లో పైప్‌లైన్ విస్తరణ పనులు, రోడ్డు మరమ్మతు పనులను పర్యవేక్షించినానంతరం మల్కాజ్‌గిరి రైల్వే ట్రాక్ వద్ధ అండర్ గ్రౌండ్ పైప్‌లైన్ నిర్మాణ పనులు జరుగుతున్న తీరును అధికారులతో చర్చించారు. అనంతరం సైనిక్‌పురిలో 70 మిలియన్ గ్యాలన్ల సామర్థ్యంతో హడ్కో నిధులతో నిర్మిస్తున్న (గ్రౌండ్ లెవెల్ సర్వీస్ రిజర్వాయర్)జిఎల్‌ఎస్‌ఆర్ ను ఎండి పరిశీలించారు. ఆ తర్వాత ప్రాజెక్టు విభాగానికి చెందిన అధికారులు, నిర్వాహణ సంస్థలకు చెందిన అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండి మాట్లాడుతూ జలమండలి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పలు ప్రాజెక్టు పనులు శివార్ల దాహర్తీని తీర్చేందుకు చేపట్టిన విషయాన్ని గుర్తించి, అధికారులు పనుల్లో ఎలాంటి అశ్రద్ద, అలసత్వం వహించకుండా నిర్ణీత గడువులో పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. గౌతమ్‌నగర్‌లో చేపట్టిన పైప్‌లైన్ విస్తరణ పనులను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎండితో పాటు జలమండలి చీఫ్ మేనేజర్లు, జనరల్ మేనేజర్లతో పాటు నిర్వాహణ సంస్థల ప్రతినిధులు కూడా ఉన్నారు.