హైదరాబాద్

పెరిగిన ధరల ప్రకారం మెస్ చార్జీలు -- ఇందిరాపార్కు వద్ద విద్యార్థుల భారీ ప్రదర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముషీరాబాద్, ఫిబ్రవరి 19: రాష్ట్రంలో ఆరు లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బిసి హాస్టల్, రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థుల మెస్ చార్జీలను పెరిగిన ధరల ప్రకారం పెంచాలని, 15 లక్షల మంది విద్యార్ధుల ఫీజుల బకాయిలు చెల్లించాలని వేలాది మంది విద్యార్థులు ఆదివారం ఇందిరాపార్కు వద్ద భారీ ధర్నా, ప్రదర్శన నిర్వహించారు.
విద్యార్థులు భారీగా తరలిరావటంతో పెద్ద ఎత్తున పోలీసులు పెద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రదర్శనకు ముఖ్యఅతిథిగా హాజరైన బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రసంగిస్తూ ప్రస్తుతం హాస్టల్ విద్యార్ధులకు ఇస్తున్న మెస్ చార్జీలు 2012లో నాటి ధరల ప్రకారం నిర్ణయించినవన్నారు. ఈ ఐదు సంవత్సరాలకాలంలో నిత్యావసర వస్తువుల ధరలు ఎంతో పెరిగాయనీ, దీంతో హాస్టళ్లలో నాసిరకం భోజనం పెడుతున్నారని ఆరోపించారు.హాస్టళ్లలో విద్యార్ధుల సంఖ్య తగ్గటానికి ప్రభుత్వ నిర్లక్ష్యం, అస్తవ్యస్త పాలనే కారణమని విమర్శించారు. కొత్త విద్యార్థులు హాస్టళ్లో చదవటానికి రావటం లేదన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగుల జీతాలు యాభై శాతానికి పెంచారని, ఎమ్మెల్యేల జీతాలు రూ.95వేల నుంచి రూ.2లక్షల 75 వేలకు పెంచారని, మంత్రుల జీతాలు రూ.2 లక్షల నుండి రూ.5 లక్షలకు పెంచారు కానీ విద్యార్ధుల మెస్ చార్జీలు, స్కాలర్‌షిప్‌లు పెంచలేదన్నారు. అన్ని వర్గాలకు కానుకలిస్తున్న ప్రభుత్వం విద్యార్ధులకు ఏం కానుననిచ్చిందని ప్రశ్నించారు. కార్యక్రమంలో బిసి సంఘాల నాయకులు డాక్టర్.ర్యాగఅరుణ్, నీలం వెంకటేష్, గుజ్జ కృష్ణ. కులకచెర్ల శ్రీనివాస్, నర్సింహాగౌడ్, వేముల రామకృష్ణ, జె.అంజి, భూపేశ్‌సాగర్, సి,రాజేందర్, రాంబాబు, గజేందర్, చందర్, ప్రసాద్ పాల్గొన్నారు.