హైదరాబాద్

క్రమశిక్షణ, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 20: క్రమశిక్షణ, పట్టుదలతో పాటు ఏకగ్రతతో సాధన చేస్తే ఎదైన సాధించవచ్చని దక్షిణ మండలం డిసిపి వి.సత్యనారాయణ అన్నారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పోలీస్ కానిస్టెబుల్ పరీక్షలో దక్షిణ మండాలనికి చెందిన దాదాపు 138 మంది ఎంపికయ్యారు. ఈ సందర్భంగా సోమవారం ఉదయం రాజన్నభావి ప్రాంతంలోని రెడ్డి ఫంక్షన్‌హాలులో అభినందన సభ ఏర్పాటు చేవారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన డిసిపి పోలీస్ కానిస్టెబుల్‌గా ఎంపికైన బాలురు, బాలిలకను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే పోలీస్ కానిస్టెబుల్, ఎస్‌ఐ పరీక్షలో హైదరాబాద్ పాతబస్తీ నుండే అధికంగా ఎంపికవ్వాలన్నారు. శారీరదారుడ్యం కలిగిన అనేక మంది పాతబస్తీలో ఉన్నారని వారిని సరైన మార్గంలో పెట్టి తగిన శిక్షణనిచ్చే వారు లేరని అవేధన వ్యక్తం చేశారు. ఇకనుంచి పాతబస్తీలోని అనేక ప్రాంతాల్లో నిరుద్యోగులైన యువతి, యువకులకు తగిన శిక్షణనిచ్చే విధంగా ఏర్పాట్లను భవిష్యత్తులో చేస్తామన్నారు. దక్షిణి మండలంలో ఎంపికైన అభ్యర్థుల్లో కేవలం ఛత్రినాక పోలీస్టేషన్ పరిధిలో 37 మంది అభ్యర్థులు కానిస్టెబుల్‌గా ఎంపికవడం విశేషం. ఛత్రినాక ఇన్‌స్పెక్టర్ కె.మనోజ్‌కుమార్ పర్యవేక్షణలో డిటెక్టీవ్ డిపార్ట్‌మెంట్ ఇన్‌స్పెక్టర్ ఎస్‌ఎ ఖాదార్ జీలాని దాదాపు 70 మంది బాలబాలికలు ఫలక్‌నూమా ప్రభుత్వ జూనియర్ కాలేజీ, చాంద్రాయణగుట్ట బర్కాస్ అబ్బాస్ ప్లేగ్రౌండ్‌లో ప్రత్యేక శిక్షణనిచ్చారు. ప్రతి రోజు ఉదయం వేళల్లో రన్నింగ్, జంపింగ్ వంటి ఈవెంట్‌లతో పాటు పలు అంశాల్లో యువతి, యువకులకు శిక్షణనిచ్చి వారిని అన్ని విదాల తీర్చిదిద్దారు ఇన్‌స్పెక్టర్ ఖాధర్‌జిలాని. అదనపు డిసిపి బాబురావుతో పాటు ఫలక్‌నుమా, చార్మినార్, మీర్‌చౌక్, సంతోష్‌నగర్ ఎసిపిలతో పాటు ఫలక్‌నుమా డివిజన్‌కు సంబంధించిన ఇన్‌స్పెక్టర్లు పూలియాదగిరి, తిరుపతి మురళికృష్ణ, ఎన్.లింగయ్య, డి.నాగేష్, కె.మనోజ్‌కుమార్, ఎస్‌ఎ.ఖాధర్ జిలానీ, వై.ప్రకాష్‌రెడ్డి, శంకర్‌లతో పాటు ఎస్‌ఐలు సిబ్బంది పాల్గొన్నారు.

గాంధీ దర్శన్‌ను కూల్చివేస్తే జాతీయ స్థాయిలో ఉద్యమిస్తాం

ముషీరాబాద్, ఫిబ్రవరి 20: మహాత్మాగాంధీ స్మారక చిహ్నంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఆరు దశాబ్ధాల క్రితం నిర్మించిన గాంధీ దర్శన్ భవనాన్ని కేవలం ఎగ్జిబిషన్ సొసైటీ పాలక మండలి క్లబ్ కోసం కూల్చివేయటానికి ప్రయత్నిస్తే జాతీయ స్థాయిలో ఉద్యమిస్తామని నగర సర్వోదయ మండలి ప్రతినిధులు హెచ్చరించారు.
సోమవారం హైదర్‌గూడ న్యూస్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మండలి కార్యదర్శి సి.రవీంద్రనాథ్, ప్రతినిధులు ప్రశాంత్, శషిభూషణ్, అవినాష్ మాట్లాడారు. తక్షణమే గాంధీ దర్శన్ కూల్చివేసే ప్రయత్నాన్ని విరమించుకోవాలని హెచ్చరించారు.
ఒక వైపు రాష్ట్ర మంత్రి కెటిఆర్ భారతీయ వస్తధ్రారణలో ఖాదీ ప్రాముఖ్యత తెలుపుతూ ఖాదీ ప్రాచుర్యానికి కృషి చేస్తుంటే ఖద్దరు బట్టల విక్రయశాల అయిన గాంధీదర్శన్‌ను నిర్మూలించటం అమానుషమన్నారు. గాంధీ నియమాలు పాటించే అన్ని గాంధేయ సంస్థలు ఈ గాంధీ దర్శన హాలులో ఏన్నో కార్యక్రమాలు చేస్తుంటారని తెలిపారు. ప్రజా సమస్యలకు వైద్యశాల అభివృద్ధి కోసం ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఆనాటి గాంధేయ వాదులు కోరటంతో ఉచితంగా ఇచ్చారని తెలిపారు.