హైదరాబాద్

అధికార దాహంతో హామీలు.. అందుకే కాపుల ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, ఫిబ్రవరి 6: అధికార దాహంతో చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇష్టానుసారంగా హామీలు ఇవ్వడం వల్లే కాపుల ఉద్యమం జరుగుతోందని సమగ్ర బిసి కులాల సమాఖ్య జాతీయ కన్వీనర్ ఉ. సాంబశివరావు మండిపడ్డారు. రాజకీయంగా లబ్ధి పొందేందుకు నాయకులు చేస్తున్న హామీలను నెరవేర్చని సమయంలో ప్రజలు ఆగ్రహావేశాలకు గురౌతున్నారని అన్నారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బిసి సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిసిలకు అన్యాయం చేయకుండా కాపులను బిసిల్లో ఎలా చేర్చుతారని నిలదీశారు. బిసి కమిషన్ నివేదిక లేకుండా బిసి జాబితాలో కొనసాగుతున్న కులాలను తొలగించడం కాని చేర్చడం గాని చట్టవిరుద్ధమని అన్నారు. బిసిలకు అన్యాయం చేయకుండా కాపులను బిసిల్లో చేర్చుతామని చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ నేతలు చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. కాపులతో చెలగాటం బిసిలకు సంకటంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగం మొట్టమొదటి సవరణ ద్వారా బిసిలకు రిజర్వేషన్లు కల్పించారని, వాటిని రూపుమాపేందుకు చూస్తే ఊరుకునేది లేదన్నారు. బిసి రిజర్వేషన్లపై ఇప్పటికే సుప్రీం కోర్టు 54 శాతాన్ని సీలింగ్‌గా విధించిందని దీనిని సవరించకుండా కాపులను బిసిల్లో చేర్చితే బిసిలకు అన్యాయం ఎందుకు జరగదని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో కాపులను మభ్యపెట్టిన బాబు, ప్రస్తుతం బిసి కులాలను మభ్యపెట్టాలని చూస్తున్నారని దీంతో మరింత సమస్యలు ఎదురౌతాయని అన్నారు. కాపుల సమస్య ఓసిలకు సంబంధించిన సమస్య అని, ఓసి జాబితాలో ఉన్న తాము వెనుకబడి పోతున్నామని కాపులు భావిస్తున్న నేపధ్యంలో ఓసీల్లో కూడా ఏ,బి,సి,డిలుగా విభజిస్తే సమస్యకు పరిష్కారుం లభిస్తుంది తప్ప బిసిల్లో చేర్చుతామంటే ఎవరూ ఊరుకోరని హెచ్చరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని రెండు సంవత్సరాలైనా నేరవేర్చకపోవడంతో ఆగ్రహంగా ఉన్న కాపులు రైళ్లను తగలబెడుతుంటే ప్రయాణికులు హాహాకారాలు చేస్తున్న సమయంలో చంద్రబాబు ప్రభుత్వం విజయవాడలోని కమ్మ కులస్థుల ఇళ్లముందు బందోబస్తును పెట్టిందని విమర్శించారు.
సంఘటన విషయమై ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు మాట్లాడిన తీరు హేయమైనదన్నారు. కాపులను బిసిల్లో చేర్చితే ముమ్మాటికీ బిసిలకు అన్యాయం జరుగుతుందని ఆ చర్యను బిసి కులాలు ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోవని ఆయన తెల్చిచెప్పారు. చంద్రబాబు నిజాయితీగా ఈ సమస్యను పరిష్కరించాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిసి సంఘాల నాయకులు చక్రవరి, శేషు ఫణి, సుధాకర్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.