హైదరాబాద్

నాడు ఉద్యకారులు..నేడు సంఘ విద్రోహ శక్తులా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/నాచారం,్ఫబ్రవరి 21: నాడు ఉద్యమకారుడిగా కనిపించిన ప్రొ.కోదండరామ్ నేడు సంఘవిద్రోహక శక్తిగా కనిపిస్తున్నారా అని టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చిలుకు మధుసూదన్‌రెడ్డి ప్రశ్నించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో జెఎసి ఏర్పాటు చేసి తెలంగాణవాదులను ఒకే వేదికపై తీసుకువచ్చి తెరాస కెసిఆర్‌తో సహా అన్నివర్గాలను కలుపుకుని ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన కోదండరామ్ నేడు తెరాస ప్రభుత్వానికి విద్రోహశక్తిగా కనిపించడం సిగ్గుచేటన్నారు. నిరుద్యోగులంటే కేసిఆర్‌కు భయమెందుకుని, పోలీసులతో, తెరాస గుండాలతో నిరుద్యోగ నిరసన ర్యాలీలో అలజడులు చేసేందుకు కుట్రలు పన్నారని మధుసూదన్‌రెడ్డి ఆరోపించారు. ర్యాలీలో ఏవైనా అవాంతరాలు సృష్టిస్తే నిరుద్యోగుల నుంచి ప్రతిఘటనలు తప్పవని హెచ్చరించారు. కోదండరామ్ ఆధ్వర్యంలో మిలియన్ మార్చ్, సాగరహారం, సకలజనుల సమ్మె చేసినప్పుడు ఆయనతో కలిసి కెసిఆర్ సహా ఇతర తెరాస నేతలు వేదికలు పంచుకున్న విషయాలను మర్చిపోయారా అని ప్రశ్నించారు.
తెరాస ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అరాచకశక్తిగా ముద్ర వేస్తున్నారని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడంతోపాటు ప్రజలపక్షాన పోరాడే హక్కు ప్రజాసంఘాలకు, నాయకులకు ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే లక్షలాది ఉద్యోగాలు వస్తాయని, ఇంటికో ఉద్యోగం ఇస్తామంటూ యువతను రెచ్చగొట్టి, నీళ్లు, నిధులు నియామకాలు అంటూ తెరాస ఎన్నికల మేనిఫెస్టోలో ఊదరగొట్టి అధికారంలోకి వచ్చాల లక్ష ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయని తెరాస నేతలు మాట్లాతున్నారని విమర్శించారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో లక్షా 7వేల ఉద్యోగాలు ఉంటే రెండేళ్లలో 17వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులపై, ఉద్యమ నాయకులపై లాఠీచార్జీ చేయించి, జైల్లో పెట్టించిన తెలంగాణ వ్యతిరేకులకు రాజకీయ ఉద్యోగాలు కట్టబెట్టి, స్వరాష్ట్రం కోసం పోరాటం చేసిన నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా వారు రోడ్లెక్కి అందోళనలు చేయాల్సిన పరిస్థితి కల్పించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా 2014లో తెరాస ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడమే కాకుండా, నిరుద్యోగుల పట్ల కెసిఆర్ తన వైఖరి మార్చుకోకపోతే నిరుద్యోగ యువత నుంచి ప్రభుత్వానికి తీవ్ర ప్రతిఘనట తప్పదని మధుసూదన్‌రెడ్డి హెచ్చరించారు.

కోళ్ల పరిశ్రమలో
హింసాత్మక ధోరణి :పెటా ఆగ్రహం
ఖైరతాబాద్, ఫిబ్రవరి 21: కోళ్ల పరిశ్రమలో జరుగుతున్న ధోరణులను నిరోధించాలని పీపుల్స్ ఫర్ ద ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ ఎనిమిల్స్ (పెటా) ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పెటాప్రతినిధి నికుంజ్ శర్మ మాట్లాడారు. పౌల్టీ ఫారంలలో అతి కిరాతకంగా కోడి పిల్లలను హింసిస్తున్నట్టు తమ పరిశోధనలో వెల్లడయిందని తెలిపారు. కోడి పిల్లల్లో లింగభేదాన్ని నిర్ధారించేందుకు చేసే చర్యలు క్రూరంగా ఉంటున్నాయని వివరించారు. అదేవిధంగా కోళ్ల ఫారాలలో తక్కువ ప్రదేశాల్లో ఎక్కువ పిల్లలను ఉంచుతున్నారని చెప్పారు. వివిధ కారణాలతో పరిశ్రమకు పనికిరాని కోడి పిల్లలను ప్రాణం ఉండగానే కాల్చిచంపడం, గ్రైండర్లలో వేసి మరణించేలా చేయడం, పెద్దపెద్ద డ్రమ్ముల్లో వేసి ఒత్తిడికి గురిచేసి, నీటిలో ముంచి బలవంతంగా చంపేస్తుండటం తీవ్రంగా కలచివేసే అంశం అన్నారు. వీటితో పాటు ఇలా బలవంతంగా చంపుతున్న పిల్లలను గ్రైండర్లలో వేసి దాని ద్వారా వచ్చిన పొడిని చేపలకు ఆహారం వేస్తున్నట్టు పరిశోధనలో గుర్తించామని చెప్పారు. కేవలం లాభాపేక్షతో పనిచేస్తున్న పౌల్ట్రీ సంస్థలు కోడిపిల్లలను హింసించే తీరును ప్రభుత్వాలకు, ప్రజలకు తెలియజేయాలన్న లక్ష్యంతోనే తామీ పరిశోధనను నిర్వహించినట్టు చెప్పారు. ప్రజలకు నాణ్యమైన మాంసాన్ని అందించాలనే తామీ చర్యలు చేస్తున్నట్టు సంస్థలు చెబుతున్న నేపధ్యంలో ప్రజలు మాంసాహారాన్ని తినడం మానాలని విజ్ఞప్తి చేశారు. నూతన సాంకేతిక విధానాలను అలవర్చుకొని హింసకు తావులేకుండా చూడాలని కోరారు.