హైదరాబాద్

ఓయులో ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నాచారం, ఫిబ్రవరి 21: తెలంగాణ జేఏసి ప్రొఫెసర్. కోదండరామ్ బుధవారం చేపట్టిన నిరుద్యోగ ర్యాలీకి అనుమతి నిరాకరించడంతో ఓయులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఓయు నిరుద్యోగ జేఏసి ర్యాలీకి మద్దతు ప్రకటించారు. అయితే ర్యాలీకి శాంతిభద్రతల సమస్య ఎదురవుతుందని ప్రభుత్వం నిరాకరించడంతో సమస్య మరింత జటిలమైంది. ముందుగా నిర్ణయించిన మేరకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరాపార్కు వరకు ర్యాలీ నిర్వహించాలని తెలంగాణ జేఏసి సంకల్పించింది. ఇందుకు ప్రత్యామ్నాయంగా మరీ అయితే నిజాం కళాశాల మైదానం, ఎన్టీఆర్ స్టేడియం, లేదా ఓయు క్యాంపస్‌లలో నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చిన ఫర్వాలేదని కోర్టుకు విన్నవించినప్పటికీ చివరి నిముషంలో ర్యాలీ, సమావేశం నాగోల్ ప్రాంతంలో నిర్వహించుకోవాలని కోర్టు చెప్పడంతో జెఎసి తన వ్యూహాన్ని మార్చుకుంది. జెఎసి చైర్మెన్ ప్రొఫెసర్.కోదండరామ్ మాత్రం ర్యాలీ అనుకున్న విధంగా బుధవారం ఉదయం 10 గంటల నుంచి సుందరయ్య విజ్ఞానకేంద్రం నుంచి ఇందిరాపార్కు వరకు జరిగి తీరుతుందని తెలిపారు. ఇప్పటికే రాష్టవ్య్రాప్తంగా అరెస్టుల పర్వం కొనసాగుతోందని, తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న నిరుద్యోగులే ఇపుడు తమ ఉద్యోగాల కోసం పోరాటం చేస్తుంటే వారిలో ఇపుడు నేరపూరిత చరిత్ర కనిపిస్తుందా అని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉన్న కేసులను బూచిగా చూపించి నిరుద్యోగులు తమ జీవితాల కోసం చేస్తున్న పోరాటాలను ఉక్కుపాదంతో అణచివేయాలని చూస్తున్న తెరాస ప్రభుత్వ లక్ష్యం నెరవేరబోదని, తెలంగాణ ప్రజలకు ఉద్యమాలు కొత్తేమీ కాదని వారు హెచ్చరించారు. ఇదిలాఉండగా బుధవారం చేపట్టిన నిరుద్యోగ జెఎసి ర్యాలీని పోలీసులు ససేమిరా అంటుంటే ఓయు నిరుద్యోగ విద్యార్థులు మాత్రం జరిపి తీరుతామని భీష్మించుకున్నారు. దీంతో మరోసారి ఉస్మానియా క్యాంపస్ ఖాకీవనంగా మారిపోయింది. వందలాది మంది పోలీసులు ఓయు క్యాంపస్ చుట్టూ పహారా కాస్తున్నారు. సాయుధ బలగాలతోపాటు పోలీసులు కంచెలను ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో చోటుచేసుకున్న పరిణామాలు మరోసారి ఓయు క్యాంపస్‌లో చోటు చేసుకుంటున్నాయి. పెద్దయెత్తున మోహరించిన పోలీసులు విద్యార్థి నాయకులను నీడలా వెంటాడడంతో పాటు అరెస్టులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఓయు నుంచి విద్యార్థులు బయటికి రాకుండా మరోవైపుఇతర జిల్లాల నుంచి నగరానికి చేరుకునే వారిపైన గట్టి నిఘాను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ కట్టడి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి నిరుద్యోగులు ర్యాలీకి తరలివస్తే క్రిమినల్ కేసులు పెడతామని పోలీసులు హెచ్చరికలు జారీచేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారిపోయింది. ఎలాగైనా నిరుద్యోగుల ర్యాలీ నిర్వహించి తీరుతామని తెలంగాణ జెఎసి, నిరుద్యోగ జెఎసి తెగేసి చెప్పడంతో పరిస్థితిని పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. గతంలో సమైక్య రాష్ట్రంలోనే అనుమతి నిరాకరించినా న్యాయమైన తమ డిమాండ్‌ను నెరవేర్చడానికి ముట్టడిలు, ర్యాలీలు నిర్వహించి సత్తాచాటిన చరిత్ర తమదని, తమను కట్టడి చేయాలని చూస్తే అదిప్రభుత్వ అవివేకమే అవుతుందని విద్యార్థి నేతలు అంటున్నారు. తాము శాంతియుతంగా నిరసనను వ్యక్తం చేయాలనుకుంటే తమ హక్కులను కాలరాయాలని చూస్తారా అని నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఓయులో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లోనికి బయటికి వెళ్లకుండా పోలీసులు కంచెలను ఏర్పాటు చేశారు. ఓయు క్యాంపస్ చుట్టూ భారీ బలగాలను మోహరించారు.
నాచారం నుంచి ర్యాలీకి సిద్ధమవుతున్న నేతలు
ఓయు నిరుద్యోగ జెఎసికి నాచారం నుంచి పెద్దయెత్తున మద్దతు ప్రకటించిన జెఎసిల చర్యతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన వ్యక్తం చేసే అధికారం ఎవరికైనా ఉంటుందని, అడ్డుకోవాలనుకుంటే మరింత రెచ్చిపోతారని నిరుద్యోగ జెఎసి నేతలు పేర్కొన్నారు. ఏది ఏమైనా నిరుద్యోగ ర్యాలీని నిర్వహించి తీరుతామని తెలిపారు.

తెలంగాణ సారస్వత పరిషత్తుకు నిధులు కేటాయించాలి

హైదరాబాద్, ఫిబ్రవరి 21: తెలుగు భాషా పరిరక్షణ కోసం గత 70 ఏళ్లు అనితర సాధ్యమైన రీతిలో ఎంతగానో పాటుపడుతున్న పూర్వపు ఆంధ్ర సారస్వత పరిషత్తు, నేటి తెలంగాణ సారస్వత పరిషత్తు గర్వించదగ్గ సంస్థ అని, దీనికి ప్రభుత్వం తగిన నిధులు కేటాయించి అభివృద్ధిపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రముఖ గాయకుడు గోరటి వెంకన్న అన్నారు. బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్తులోని డా. దేవులపల్లి రామానుజరావు కళామందిరంలో సారస్వత పరిషత్తు ప్రాచ్య కళాశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో వెంకన్న ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడుతూ ఏడు దశాబ్దాల పరిషత్తు చరిత్రలో అన్ని రకాలైన భావాలకు వేదికగా నిలిచిందని, పరిషత్తును నిలబెట్టిన మహామహుల్లో డా. దేవులపల్లి రామానుజరావు ప్రథమగణ్యుడన్నారు.