హైదరాబాద్

శాసన మండలి టీచర్స్ స్థానం బరిలో 12 మంది అభ్యర్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 23: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పాత జిల్లాలతో ఏర్పాటైన తెలంగాణ శాసన మండలి ఉపాధ్యాయుల స్థానం ఎన్నిక సమయం దగ్గర పడుతోంది. దీంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు, పోలింగ్ ఏర్పాటు చేయటంలో అధికారులు బిజీగా ఉన్నారు. ఈ ఎన్నికకు సంబంధించి మొత్తం 33 నామినేషన్లు రాగా, ఇందులో ముగ్గురు అభ్యర్థుల నామినేషన్లను రిటర్నింగ్ అధికారి అద్వైతకుమార్ సింగ్ తిరస్కరించగా, 14 మంది బరిలో నిలిచారు. అయితే గురువారం నామినేషన్ల ఉపసంహరణలో భాగంగా మరో జ్ఞానేశ్వరమ్మ, మహ్మద్ మోయినుద్దిన్ అహ్మద్ అనే ఇద్దరు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవటంతో ప్రస్తుతం బరిలో 12 మంది అభ్యర్థులు మిగిలారు. వీరు ఇ.లక్ష్మయ్య, నర్ర భూపతిరెడ్డి, ఎస్. విజయ్‌కుమార్, ఎ. వెంకటనారాయణరెడ్డి, పాపన్నగారి మాణిక్‌రెడ్డి, కాటేపల్లి జనార్దన్ రెడ్డి, జి. హర్షవర్ధన్‌రెడ్డి, ఏ. లక్ష్మయ్య, ఎం.వి. నర్సింగ్‌రావు, మీసాల గోపాల్ సాయిబాబా, అరకల కృష్ణాగౌడ్, ఎం. మమతలు ఎన్నికల బరిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. గురువారంతో నామినేషన్ల పర్వానికి తెర పడటంతో అధికారులు ఇక పోలింగ్‌పై దృష్టి సారించారు. మొత్తం ఓటర్లు మొత్తం 23వేల 13 మంది ఉన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 6675 మంది ఓటర్లకు 57 పోలింగ్ కేంద్రాలు, అలాగే రంగారెడ్డి జిల్లాలో 11వేల 832 మందికి 47, హైదరాబాద్‌లో 4501 ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు గాను 22 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో వౌలిక వసతులకు సంబంధించి ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారి జనార్దన్ రెడ్డి, ఎన్నికల రిటర్నింగ్ అధికారి అద్వైతకుమార్ సింగ్‌లు రెవెన్యూ, ఇతర శాఖల అధికారులతో పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు అంశంపై పలు దఫాలుగా పోలీసు అధికారులతో సమావేశమయ్యారు.
స్థానిక సంస్థల స్థానానికి నామినేషన్లు నిల్
హైదరాబాద్ స్థానిక సంస్థల మండలి స్థానానికి కూడా ఈ నెల 20వ తేదీ నుంచి నామినేషన్లను ఆహ్వానించగా, గురువారం సాయంత్రం వరకు ఒక్క నామినేషన్ కూడా అందలేదని జిహెచ్‌ఎంసి అధికారులు తెలిపారు. ఈ స్థానానికి నామినేషన్ల స్వీకరణ ఈ నెల 28తో ముగిసి, ఆ తర్వాత 1వ తేదీన పరిశీలన, 3న ఉపసంహరణ, మార్చి 17న పోలింగ్, 20న కౌంటింగ్ నిర్వహించేందుకు జిహెచ్‌ఎంసి ఏర్పాట్లు చేస్తోంది.

మిషన్ భగీరథతో ఇంటింటికీ సురక్షిత నీరు

హైదరాబాద్, ఫిబ్రవరి 23: రాష్ట్ర ప్రభుత్వం నిర్ధేశించిన గడువులోగా ప్రతి ఇంటికి సురక్షితమైన నీటిని అందించడమే లక్ష్యమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి డాక్టర్ పి.మహెందర్‌రెడ్డి అన్నారు. గురువారం సచివాలయంలోని తన ఛాంబర్‌లో మిషన్ భగీరథ పనుల పై అధికారులతో సమీక్షించారు. మిషన్ భగీరథ పనులు వేగవంతం చేయాలని, నిర్ధేశించిన గడువుకంటే ముందుగానే పనులు పూర్తి చేసేందుకు గాను ఎప్పటికప్పుడు అధికారులు దగ్గరుండి పనులను పర్యావేక్షించాలని అన్నారు. ప్రతి ఇంటికి స్వచ్ఛ నీటిని అందించే విషయంలో ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోనుందని చెప్పారు. వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు అనుకున్న సమయానికి తాగునీటిని అందించనున్నట్లు వెల్లఢించారు. పరిగి, తాండూరు, వికారాబాద్‌లకు డిసెంర్ నాటికి నీటిని అందించేందుకు పనులు పూర్తిచేయాలని తెలిపారు.