హైదరాబాద్

మహిళలందరికీ ఆదర్శం ఈశ్వరీబాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 24: రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ అధ్యక్షురాలు జె. ఈశ్వరీబాయి మహిళలందరికి ఆదర్శమని ఎమ్మెల్యే డా.జె.గీతారెడ్డి అన్నారు. ఈశ్వరిబాయి వర్థంతిని పురస్కరించుకుని శుక్రవారం ఆమె వెస్ట్‌మారెడ్‌పల్లిలోని ఈశ్వరీబాయి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గీతారెడ్డి మాట్లాడుతూ తన తల్లిని ఆదర్శంగా తీసుకుని, ఆమె చూపిన బాటలో నడిచి తాను ఈ స్థాయికి చేరుకున్నానమి వివరించారు. ఆమె చేపట్టిన కార్యక్రమాలను మరింతగా ముందుకు తీసుకెళ్లాలన్న లక్ష్యంతో ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్టు నెలకొల్పడం జరిగిందని వివరించరు. ఈ ట్రస్టు ద్వారా పేద బాలికలకు విద్యాభ్యాసాన్ని అందించటం, విద్యాభ్యాసం తర్వాత తగిన ఉద్యోగ అవకాశాలు కల్పించటం, ప్రతిభ గల వారిని మరింత ఉన్నతమైన చదువుల దిశగా ప్రోత్సహించటం వంటి ఎన్నో కార్యక్రమాలను విజయవంతంగా చేపడుతున్నామని తెలిపారు. గడిచిన రెండేళ్లుగా తమ తల్లి ఈశ్వరీబాయి వర్థింతిని ప్రభుత్వం తరపున అధికారికంగా నిర్వహించటం పట్ల ఆమె ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, సికిందరాబాద్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈశ్వరీబాయి పోరాటం
స్ఫూర్తిదాయకం
ముషీరాబాద్: తెలంగాణ పొరాట యోధురాలు ధీరవనిత ఈశ్వరీబాయి పొరాటం స్ఫూర్తి దాయకమని పలువురు వక్తలు పేర్కొన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, ఈశ్వరబాయి మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం రవీంద్రభారతీ ఆడిటోరియంలో ఈశ్వరీబాయి వర్థంతి సభ నిర్వహించారు. రాష్ట్ర హోంశాఖమంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి, ఎమ్మెల్సీ పి.సుధాకర్‌రెడ్డి, మాజీమంత్రి డా.జె.గీతారెడ్డి, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయరెడ్డి పాల్గొన్నారు. నాయిని నర్సింహ్మరెడ్డి మాట్లాడుతూ ఈశ్వరీబాయి ధీరవనిత దైర్యశాలిగా అభివర్ణించారు. తెలంగాణకు న్యాయపరంగా రావాల్సిన హక్కులపై నిర్భయంగా, నిజాలను నిక్కచ్చిగా ప్రశ్నించి పోరాడిందని కొనియాడారు. ఆమె స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి పథకాలు కొనసాగిస్తుందని అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా ప్రవేశ పెట్టినున్న మహిళా విశ్వవిద్యలయానికి ఈశ్వరి బాయి పేరు నమాకరణం చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ భాషా సంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, దళిత సంఘం నేతలు జెబి రాజు పాల్గొన్నారు.

దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరి అరెస్ట్

హైదరాబాద్, ఫిబ్రవరి 24: దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న పేరుమోసిన నిందితుడిని సికింద్రాబాద్ మారేడ్‌పల్లి పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ నార్త్‌జోన్ డిసిపి కార్యాలయంలో మధ్యాహ్నం జరిగిన విలేఖరుల సమావేశంలో వివరాలను డిసిపి సుమతి వెల్లడించారు. ఈస్ట్‌గోదావరి కాకినాడ తాటిపాక గ్రామానికి చెందిన ఇమాని రాంబాబుఅలియాస్ రామ్‌పవన్(52) గత 21 సంవత్సరాల క్రితం హైదరాబాద్‌కు వచ్చి వెస్ట్‌నాచారంలోని ఇంధ్రనగర్‌లో నివాసం ఉంటున్నాడు. ప్రస్తుతం చైతన్యపూరి కొత్తపేట్‌లోని మారుతినగర్‌లో నివాసం ఉంటున్న ఇమాని రామ్‌బాబు దేవాలయాల్లో దొంగతనాలు చేయటంలో సిద్దహస్తుడు. ఇతను కొంతకాలంగా చెప్పలేనన్ని దొంగతనాలు చేశాడు. చేతికి, మేడలో రోల్డ్‌గోల్డ్ నగలు ధరించి డబ్బులున్నావాడిలా అలయంలో ఉన్న పూజారి వద్ద నటించి, హరాతి తీసుకున్న క్రమంలో వెయ్యిరూపాయల నోటును పంతులుకివ్వడం. చిల్లర కోసం పంతులు వెళ్లి తిరిగోచ్చేలోపే దేవాలయంలోని విగ్రహాలకు ఆలకరించిన బంగారు, వెండి ఆభరణాలను దొంగలించి ఎమాత్రం అనుమానం రాకుండా అక్కడి నుండి పారిపోవడం ఇతని ప్రధాన లక్ష్యం. సికింద్రాబాద్ మారేడ్‌పల్లిలోని ఉజ్జయినీ మహాంకాళి దేవాలయంలో ఈనెల 15వ తేదీన ఇమాని రాంబాబు దొంగతనం చేసి అమ్మవారి విగ్రహాంపై అమర్చిన బంగారు, వెండి అభరణాలు ఎత్తుకేళ్లాడు. ఈ క్రమంలో కేసు నమోదు చేసిన మారెడ్‌పల్లి పోలీసులు సిసి కెమెరా ఫుటేజ్‌ల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. కేసుకు సంబంధించి మారేడ్‌పల్లి ఇన్స్‌పెక్టర్ సిహెచ్ ఉమమహేశ్వరరావు, క్రైమ్ ఇన్‌స్పెక్టర్ ఎం.అప్పల్‌నాయుడు నేతృత్వంలో ప్రత్యేక టీమ్‌లను రంగంలోకి దింపారు. ఇమాని రాంబాబు కోసం త్రవ్విన కొద్ది వస్తవాలు బయటపడటంతో పోలీసులు నివ్వరపోయారు. దేవాలయాలను టార్గెట్‌గా చేసుకుని విగ్రహాలపై ఉన్న ఆభరాణాలను దొంగలించి సొమ్ము చేసుకోవడం అలవాటుగా మారింది. 2009లో కూకట్‌పల్లి పోలీస్టేషన్ పరిధిలో మొత్తం 11 కేసులు దేవాలయాల్లో దొంగతనాలు చేసి జైలుపాలయ్యాడు. తిరిగి 2012లో నాంపల్లి పోలీస్టేషన్ పరిధిలో నాలుగు కేసులు నలోదు చేసి రిమాండ్‌కు వెళ్లాడు. వరుసగా సైదాబాద్, అంబర్‌పేట్, నాంపల్లి పోలీస్టేషన్ పరిధిలోని దేవాలయాల్లో దొంగతనం చేసి జైలు శిక్ష అనుభవించాడు. జూబ్లీహిల్స్ పోలీస్టేషన్ పరిధిలో 21 కేసులు దేవాలయానికి సంబం