హైదరాబాద్

శివ నామస్మరణతో మారుమోగిన దేవాలయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 24: ఓం నమ శివాయా..శంభో శంకర హరహర మహాదేవ..అన్న శివనామ స్మరణతో నగరంలోని దేవాయాలు మారుమోగాయి. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని ఆధ్యాత్మిక వెల్లువిరిసింది. ముఖ్యంగా శివాలయాలు ప్రత్యేకంగా ముస్తాబయ్యాయి. ప్రత్యేక అలంకరణతో మహశివుడు భక్తులకు దర్శనమిచ్చాడు. శివారులోని నాగోల్ శ్రీ శైవమహాపీఠం, అంబర్‌పేటలోని శివం వంటి పేరుగాంచిన పలు ఇతర శివాలయాల్లో ఉదయం అయిదు గంటల నుంచే ప్రత్యేక పూజలతో మహాశివరాత్రి హడావుడి ప్రారంభమైంది. శ్రీ శైవమహాపీఠం ఆధ్వర్యంలో శ్రీ కాశీవిశే్వశ్వరాలయంలో గురువారం నుంచి ప్రారంభమైన శివరాత్ర ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం ఆరు గంటల నుంచి స్వామివారికి అభిషేకం, అర్చనలు నిర్వహించారు. సాయంత్రం ఆరు గంటలకు రుద్రహోమం, పూర్ణాహుతి, రాత్రి ఏడు గంటలకు శ్రీ విశాలాక్షి, విశే్వశ్వరస్వామి వారలకు కల్యాణ మహోత్సవం, పది గంటల నుంచి పనె్నండు గంటల వరకు విశేష గో క్షీరాభిషేకం, నీరాజన, మంత్రపుష్పం వంటి కార్యక్రమాలను అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
25న ఉదయం పది గంటలకు రథోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. భక్తులు ఉపవాసదీక్షలు పాటించే వారితో దేవాలయాలు కిటకిటలాడాయి. కొందరు భక్తులు ఉపవాసదీక్షలతో సాయంత్రం అయిదు గంటల వరకు దేవాలయాల్లోనే గడిపారు. ఆ తర్వాత ఉపవాసదీక్షలను విరమించుకుని భోలా శంకరుడ్ని దర్శించుకున్నారు. శివం వంటి దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఉపవాసదీక్ష విరమించిన తర్వాత శివనామస్మరణతో జాగరణ చేయాలన్న సాంప్రదాయం ఉండటంతో నగరంలోని బేగంబజార్, కోఠి, ఇసామియాబజార్‌తో పాటు పేరుగాంచిన పలు దేవాలయాల్లో ప్రత్యేక భజన, భక్తిసంగీత కార్యక్రమాలను నిర్వహించారు.