హైదరాబాద్

న్యాయ వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 25: ‘రాజకీయాల్లో పెట్టుబడులు భారీగా పెరుగుతున్నాయి..’ అని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. చంద్రకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు న్యాయ వ్యవస్థలోనూ విప్లవాత్మకమైన మార్పులు రావాల్సిన అవశ్యకత ఉందని అన్నారు. ‘న్యాయ వ్యవస్థలో సంస్కరణలు’ అనే అంశంపై శనివారం ఉస్మానియా వర్సిటీ పిజిఆర్‌ఆర్ కళాశాలలో ‘గ్రేటర్ హైదరాబాద్ సొసైటీ ఫర్ ఫాస్ట్ జస్టీస్’ అనే సంస్ధ సదస్సును నిర్వహించింది. రెండో రోజు ఆదివారం కూడా ఈ సదస్సు కొనసాగుతుంది. ఇలాఉండగా ఈ సదస్సుకు గౌరవ అతిథిగా హాజరైన జస్టిస్ చంద్రకుమార్ ప్రసంగిస్తూ రాజకీయాల్లో పెరుగుతున్న అవినీతి పెరిగిపోతున్నదని ఆవేదన చెందారు. కొంత మంది రాజకీయాల్లో పెట్టుబడులు పెట్టడం విస్మయం కలిగిస్తున్నదని అన్నారు. అంటే ఐదారు కోట్లు ఖర్చు పెట్టి ప్రజాప్రతినిధిగా ఎన్నికై 50 కోట్లు ఎలా సంపాదించాలా? అని ఆలోచన చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ విధానానికి స్వస్తి పలకాల్సి ఉందని అన్నారు. లేనిపక్షంలో సామాన్య, మధ్య తరగతి ప్రజల్లో ఎన్నికల్లో పోటీ చేయలేరని, వారు ఎప్పటికీ ఎంపీ, ఎమ్మెల్యే కాలేరని ఆయన తెలిపారు. కోర్టుల్లో పేరుకుపోతున్న కేసులను సత్వరమే పరిష్కరించకపోవడానికీ ప్రభుత్వాల బాధ్యత కూడా ఉందని ఆయన అన్నారు. ఉదాహరణకు ఒక వ్యక్తికి ఏదో ఒక కేసులు 10 వేల రూపాయలు చెల్లించాలని కింది కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశిస్తే, దానిపై ప్రభుత్వం అప్పీలుకు వెళ్ళి అంత కంటే ఎక్కువే ఖర్చు చేస్తుందని, ప్రభుత్వ ప్లీడర్‌కు భారీగానే ఫీజు చెల్లించుకుంటుందని ఆయన చెప్పగానే సభికులు కరతాళధ్వనులు చేశారు. న్యాయమూర్తుల ఖాళీలు అధికంగా ఉండడం వల్ల ఉన్న వారిపై కేసుల భారం పెరుగుతున్నదని అన్నారు. కొంత మంది ఉన్నతాధికారుల, మాజీ సిఎం, మాజీ కేంద్ర మంత్రుల అక్రమ సంపాదనపై ఎసిబి, సిబిఐ వంటివి దాడులు నిర్వహించేందుకు, దర్యాప్తు చేసేందుకు ముఖ్యమంత్రి అనుమతి తీసుకోవాల్సి రావడం దురదృష్టకరమని అన్నారు. న్యాయ వ్యవస్థలో అవినీతికి ఆస్కారం ఉండరాదని ఆయన తెలిపారు. కొలిజీయం ఏర్పాటులో మార్పులు రావాల్సి ఉందని ఆయన చెప్పారు. న్యాయ వ్యవస్థకు ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయింపులు అరకొరగానే కేటాయిస్తున్నదని జస్టిస్ చంద్రకుమార్ విమర్శించారు. సొసైటీ ఫర్ ఫాస్ట్ జస్టిస్ జాతీయ చైర్మన్ భగవాన్‌జీ భాయి రయ్యానీ ప్రసంగిస్తూ న్యాయ వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకుని రావాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
అసమానతలు తొలగించాలి
పిజి లా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గాలి వినోద్‌కుమార్ ప్రసంగిస్తూ సమాజంలో ప్రజల మధ్య ఉన్న అసమానతలను తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. న్యాయ వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు రావాల్సి ఉందని అన్నారు. అవినీతిపరులకు శిక్ష పడడం లేదని ఆయన తెలిపారు. ప్రజలను చైతన్యవంతం చేసేందుకు తాము ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. సొసైటీ ఫర్ ఫాస్ట్ జస్టిస్ (గ్రేటర్ హైదరాబాద్) అధ్యక్షుడు నజీర్ ఖాన్, ప్రధాన కార్యదర్శి జయ వింధ్యాల తదితరులు ప్రసంగించారు.