హైదరాబాద్

స్టేట్ బ్యాంక్ ప్యానల్ ఉద్యోగులకు న్యాయం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, ఫిబ్రవరి 26: రాష్ట్రంలోని వివిధ ఎస్‌బిఐ శాఖల్లో దీర్ఘకాలం విధులు నిర్వహించిన తాత్కాలిక ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకొని వారికి న్యాయం చేయాలని స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా ప్యానల్ ఎంప్లారుూస్ (క్లాస్-4) అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పాలడుగు అనిల్‌కుమార్ మాట్లాడారు. కోర్టు తీర్పులను సైతం ఉల్లంఘిస్తూ ఎస్‌బిఐ యాజమాన్యం కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ విధానంలో బయటి వారిని నియమించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 20 ఏళ్లపాటు బ్యాంకుల్లో విధులు నిర్వహించిన క్లాస్-4 ఉద్యోగులను యాజమాన్యం అకారణంగా తొలగించిందని చెప్పారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా 1997లో తొలగించడంతో తాము ఆర్ధికంగా ఎంతో ఇబ్బందుల పాలవుతున్నట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా సుమారు 3556 మందిని తొలగించగా ఆనాటి నుంచి ఉద్యోగులుగా తాము న్యాయ పోరాటం చేస్తున్నట్టు చెప్పారు. కోర్టులో కేసులు నడుస్తుండగానే కొంత మంది ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకోగా, మరికొంత మంది పదవీ విరమణ వయస్సుకు చేరుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతున్న తమకు ఆర్ధిక ఇబ్బందులు, కుటుంబ భారం తలకు మించిపోతుందని కన్నీరుపెట్టుకున్నారు.
హైకోర్టు సింగిల్, డివిజన్ బేంచులు తమకు అనుకూలంగా తీర్పులను వెలువరించినా బ్యాంకు యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. ఈనెల 28న ఉద్యోగుల సమస్యల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించనున్న సమ్మెకు తమ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు నిస్తుందని చెప్పారు. సమావేశంలో సూర్యనారాయణ, శ్రీనివాస్, మహాలక్ష్మయ్య, కొమరయ్య, అనంతరెడ్డి, బలయ్య, రమణ, ప్రకాష్ పాల్గొన్నారు.