హైదరాబాద్

‘సాకేత సార్వభౌమ’ గ్రంథావిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ, ఫిబ్రవరి 26: నిడుమోలు ప్రసూన రచించిన ‘సాకేత సార్వభౌమ’ గ్రంథావిష్కరణ సభ నవ్య సాహితీ సమితి ఆధ్వర్యంలో ఆదివారం నల్లకుంట శృంగేరి శంకర మఠంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సమన్వయ సరస్వతి వాగ్దేవి వరపుత్ర బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ పాల్గొని గ్రంథావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ రామాయణం భారతీయ సంస్కృతికి ప్రతీక అని కీర్తించారు. రామభక్తి మన రక్తంలో ప్రవహించే అంతర్వాహిని అని పేర్కొన్నారు.
రామతత్వం తెలుసుకోవటం సులభం కాదని, రచయిత ప్రసూన సమాన్యులకు అర్ధమయ్యే విధంగా పుస్తకం రచించారని తెలిపారు. గురజాడ వెంకటేశ్వరరావు ప్రథమ గ్రంథ తొలికృతిని స్వీకరించారు. అనంతరం బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మచే ‘తులసీదాసు రామాయణ విశిష్టత’పై ప్రసంగించారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు డా.కెవి.రమణచారి సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యం.జగన్నాథరావు, సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు వి.విజయకుమార్, ఆర్‌ఎన్.సుధారాణి, ఉదయ భాస్కర్ పాల్గొన్నారు.