హైదరాబాద్

కడు రమ్యం ఒడిస్సీ నృత్యోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 28: సంస్కృతి కళా నికేతన్, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం రవీంద్రభారతిలో ‘ఒడిస్సి ఉత్సవం-2017’ కళాకారుల నృత్యాభినయంతో కడు రమ్యంగా జరిగింది. మంగళాచరన్ అంశంతో ప్రారంభించి గణపతి అంశం, ‘ఎక్కడ ఎక్కడ...’ అంటూ చిన్నారుల నృత్యాంశంతో పాటు డాక్టర్ శక్తి ప్రసాద్ నాయక్ ప్రదర్శించిన సోలో నృత్యం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సీనియర్ విద్యార్థులు ప్రదర్శించిన పెద్దపులి, దల్‌ఖాయ్ సాంబాల్‌పురి అంశాలు, ముంబయికి చెందిన డాక్టర్ లలితా సోని కథక్ నృత్యం రక్తికట్టించాయి. కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా పాల్గొన్న సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల సంప్రదాయ నృత్యాలను తెలంగాణ గడ్డపై ప్రదర్శించడంతో సాంస్కృతిక వారసత్వాలను అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, జాదునాథ్ మహంతి, స్మృతిరేఖా మహంతి, జిఎస్ రాజు తదితరులు పాల్గొని కళాకారులను అభినందించారు.

నేటి నుంచి ఇంటర్ పరీక్షలు

హైదరాబాద్, ఫిబ్రవరి 28: నేటి నుంచి హైదరాబాద్ జిల్లా పరిధిలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సారి కూడా తమ పరీక్ష కేంద్రాలను చూసుకోవటంలో విద్యార్థులు నాలుగైదు రోజులుగా బిజీగా ఉన్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి విద్యార్థుల సౌకర్యార్థం ప్రభుత్వం ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ సెంటర్ లోకేటేడ్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు కాస్త ఆలస్యం కావటంతో విద్యార్థులకు చక్కర్లు తప్పలేదు. బుధవారం నుంచి 19 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలు నిర్వహించే సెంటర్ల పరిసరాల్లో సెక్షన్ 144ను అమలు చేస్తూ, పరీక్ష సమయంలో ఒక కిలోమీటరు పరిధిలో గల జిరాక్స్ షాపులను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. పరీక్షలకు హజరయ్యే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వివిధ ప్రభుత్వ శాఖలను ఆదేశించారు. ముఖ్యంగా ఇప్పటికే ఎండాకాలం ప్రారంభం కావటంతో పరీక్షా కేంద్రాల్లో విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా సరఫరా చేరిగేలా, తాగునీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రతి పరీక్షా కేంద్రంలో ఫస్ట్ ఎయిడ్ బాక్సులు అందుబాటులో ఉంచేలా జిల్లా వైద్యారోగ్యశాఖ చర్యలు చేపట్టింది. పరీక్ష కేంద్రాలకు వెళ్లే రూట్లలో బస్సులను అదనంగా, పరీక్షల సమయానికి అనుగుణంగా నడిపేలా చర్యలు ఆర్టీసి చర్యలు చేపట్టింది. జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు గాను 198 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో లక్షా 60వేల 354 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పనె్నండు గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ సమయంలో విద్యుత్ కోతలు ఉండకుండా ట్రాన్స్‌కో అధికారులు చర్యలు చేపట్టారు.పరీక్షా కేంద్రాల వద్ధ పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు.
మేడ్చల్‌లో
మేడ్చల్: ఇంటర్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం అవుతున్నట్టు కస్టోడియన్ శ్రవణ్ మంగళవారం తెలిపారు. ఇంటర్ పరీక్షల నిర్వహణ కోసం మేడ్చల్‌లో నాలుగు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సుమారు 2వేల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరుకానున్నారని తెలిపారు. మేడ్చల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, స్ఫూర్తి జూనియర్ కళాశాల, స్లాలర్స్, రెడ్‌సన్ కాలేజీలను పరీక్షా కేంద్రాలుగా ఏర్పాటు చేసినట్టు వివరించారు. పరీక్షకు నిమిషం ఆలస్యమైన అనుమతించమని, విద్యార్థులు గంట ముందు ఆయా పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకోవాలని ఆయన సూచించారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని ఇప్పటికే పరీక్షా కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు 144 సెక్షన్ విధించినట్లు పేర్కొన్నారు.