హైదరాబాద్

మళ్లీ జత కలిసే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 28: ప్రస్తుతం శాసన మండలిలో ఖాళీగా ఉన్న జిహెచ్‌ఎంసి స్థానిక సంస్థల స్థానం ఎన్నికలకు సంబంధించి మరో సారి అధికార టిఆర్‌ఎస్ పార్టీతో మజ్లిస్ జత కట్టింది. గత సంవత్సరం ఫిబ్రవరి మాసంలో జరిగిన కార్పొరేషన్ పాలక మండలి ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుని ఏకంగా 143 స్థానాలను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే! ఇపుడు శాసన మండలిలో ఖాళీ అయిన స్థానిక సంస్థల స్థానాన్ని భర్తీ చేసేందుకు ఈ రెండు పార్టీలు మళ్లీ జాఫ్రీకే అవకాశమిచ్చాయి. ఈ నెల 20వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ చేపట్టినా, చివరి నిమిషం వరకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాకపోవటంతో ఈ సారి రెండు పార్టీలు ఎవరికి అవకాశమిస్తాయన్న ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో రెండు పార్టీలు గత పర్యాయం మాదిరిగానే ఈ సారి కూడా జాఫ్రీకే అవకాశం కల్పించాయి. హైదరాబాద్ రెవెన్యూ జిల్లా పరిధిలోని వంద మంది కార్పొరేటర్లు, మరో 49 మంది ఎక్స్ అఫిషయో సభ్యులు ఎన్నుకునే ఈ స్థానానికి జాఫ్రీని నియమించేందుకే రెండు పార్టీల మధ్య సయోధ్య కుదిరింది. ప్రస్తుతం కూడా మండలి సభ్యునిగా కొనసాగుతున్న జాఫ్రీ మండలిలోనూ, జిహెచ్‌ఎంసి కౌన్సిల్‌లోనూ ప్రజాసమస్యలపై, అధికారుల నిర్లక్ష్యం, అలసత్వంపై గట్టిగానే గళం విన్పించినందున మరోసారి ఆయనకు అవకాశం దక్కిందని చెప్పవచ్చు. ఆయన మినహా మరెవ్వరూ నామినేషన్ దాఖలు చేయకపోవటంతో దాదాపు జాఫ్రీ ఎన్నిక ఏకగ్రీవమైంది. కాగా, ప్రస్తుతం ఖాళీగా ఉన్న టీచర్స్ మండలి స్థానానికి ఈ నెల 9న పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక సంస్థలకు చెందిన శాసన మండలి మరో స్థానంలో ప్రస్తుతం ఎం.ఎస్. ప్రభాకర్‌రావు కొనసాగుతున్నారు. 2014కు ముందు కాంగ్రెస్ ఎమ్మెల్సీగా వ్యవహారించిన ప్రభాకర్‌రావు ఆ తర్వాత టిఆర్‌ఎస్‌లో చేరి, ఆ పార్టీ మండలి అభ్యర్థిగా కొనసాగుతున్నారు.

హడ్కో ప్రాజెక్టు పనులు వేగవంతం
ఖైరతాబాద్, ఫిబ్రవరి 28: వేసవి కాలం సమీపిస్తుండంతో తాగునీటి కష్టాలను అధిగమించే విషయంపై జలమండలి తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇప్పటికే రూ. 5.81 కోట్ల వ్యయంతో పలు పనులను చేపట్టాలని వేసవి కార్యచరణను మేనేజింగ్ డైరెక్టర్ దాన కిషోర్ రెండురోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే! దీనికి తోడు శివారు ప్రజల దాహార్తీని తీర్చేందుకు ప్రభుత్వం రూ. 1900 కోట్ల హడ్కో నిధులతో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మంచినీటి ప్రాజెక్టు పనుల పురోగతిపై కూడా ఎండి ప్రత్యేక దృష్టి సారించారు.
ఈ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ఎండి తనదైన శైలిలో అధికారులపై వత్తిడి తెస్తున్నారు. ప్రతిరోజు సమీక్షలు నిర్వహిస్తూ పనులను వేగవంతం చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు. మంగళవారం ఆయన జలమండలి ప్రధాన కార్యాలయంలో పిసిసి 1 అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజర్వాయర్ పనులు, రిజర్వాయర్ ఇన్‌లెట్, ఔట్ లెట్ పనులు, పైప్‌లైన్ విస్తరణ పనులు, రోడ్ల మరమ్మత్తు పనులన్నీ కూడా నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా పనుల్లో ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా ముందస్తుగా తగిన ప్రమాద నివారణ జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని పనుల నిర్వాహణ సంస్థలను ఆదేశించారు. ఇక్కడ పనులు జరుగుతున్నట్లు సూచిస్తూ బోర్డులను ఏర్పాటు చేస్తే రాకపోకలు సాగించే వారు కూడా అప్రమత్తంగా ఉంటారని వివరించారు. పనులు జరిగే ప్రాంతాల్లో బ్యారికేడ్లు, సూచిక బోర్డులను క్షేత్ర స్థాయిలో ప్రాజెక్టు పనులు జరిగే ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలన్నారు. రోడ్లను తవ్వటం, జలమండలి పనులు పూర్తికాగానే తవ్విన రోడ్లకు వెంటనే మరమ్మత్తులను చేపట్టి వాహనదారులకు ఎదురయ్యే ఇబ్బందులను నివారించటంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జనరల్ మేనేజర్లు, నిర్వాహణ సంస్థలను ఎండి ఆదేశించారు. ఈ సమీక్షలో జలమండలి ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ ఎం.సత్యనారాయణ, ప్రాజెక్టు డైరెక్టర్ ఎం. ఎల్లస్వామి, ప్రాజెక్టు విభాగం సిజిఎంలు, జిఎంలు పాల్గొన్నారు.