హైదరాబాద్

ఆన్‌లైన్ మోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 1: కార్గిల్ ఆర్మీలో పనిచేస్తున్న జవాను బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు ఆన్‌లైన్ ద్వారా డబ్బులు బదిలీ అయ్యాయి. ఆన్‌లైన్ మోసగాడిని రాచకొండ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్న బైళ్ల కిషోర్‌కుమార్ 2015 నుంచి 2017 వరకు తన బ్యాంకు ఖాతాలో రూ. 3.60 లక్షలు జమ చేసుకున్నాడు. కాగా గత నెలలో హైదరాబాద్‌లో ఉంటున్న అతని భార్య ఏటిఎం నుంచి కొన్ని డబ్బులు డ్రా చేయగా బ్యాంకులో నుంచి డబ్బులు రాకపోగా, బ్యాలెన్స్ నిల్ అంటూ సమాచారం వచ్చింది. దీంతో షాక్‌కు గురైన ఆమె సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. నాసిక్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి కిషోర్ కుమార్ ఖాతా నుంచి హైదరాబాద్‌లోని అతని బంధువు గుడిపల్లి విష్ణుప్రసాద్ ఖాతాలోకి బదిలీ అయినట్టు సైబర్ క్రైం పోలీసులు గుర్తించారు. ఈ మేరకు విష్ణుప్రసాద్‌ను అరెస్టు చేసి అతనిపై ఐపిసి 406, 419, 420, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసును ఛేదించిన సైబర్ క్రైం ఇన్స్‌పెక్టర్ మహమ్మద్ రియాజుద్దీన్, ఎస్‌ఐ భాస్కర్‌ను రాచకొండ కమిషనర్ ఆఫ్ పోలీస్ మహేశ్ ఎం భగవత్ అభినందించారు.