హైదరాబాద్

ర్యాష్ డ్రైవింగ్.. వేర్వేరు ఘటనల్లో ఇద్దరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 4: నగరవ్యాప్తంగా ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నా..అనేక మంది మందుబాబులు పట్డుబడుతున్నా.. మందుబాబుల ఆగడాలు తగ్గడం లేదు. తాజాగా శనివారం నగరంలో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. నగరశివారులోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో నలుగురు యువకులు మద్యం సేవించి కారు నడిపారు. ర్యాష్ డ్రైవింగ్‌తో ఓ విద్యార్థిని ఢీ కొట్టారు. దీంతో ఆ విద్యార్థి అక్కడిక్కడే మృతి చెందాడు. నలుగురు యువకులను అదుపులో తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నట్టు తెలిపారు. మరో సంఘటన చంపాపేట్‌లో చోటుచేసుకుంది. ఓ తుపాన్ వ్యాన్ మూడు వాహనాలను ఢీ కొట్టగా ఒకరు వృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కోపోద్రిక్తులైన స్థానికులు డ్రైవర్‌ను చితకబాది పోలీసులకు అప్పగించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు చంపాపేట్ పోలీసులు తెలిపారు.